News June 3, 2024

ప్రపంచ రికార్డు సృష్టించిన భారత ఓటర్లు: ఈసీ

image

దేశంలో 7 విడతల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ విజయవంతంగా నిర్వహించామని CEC రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఎన్నికల్లో 64.2కోట్ల మంది ఓట్లు వేయడం ప్రపంచ రికార్డు అని చెప్పారు. ఇది G7 దేశాలైన USA, UK, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడా, ఇటలీ జనాభా కంటే 1.5 రెట్లు ఎక్కువన్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా మనదేశంలో 31.2కోట్ల మంది మహిళలు ఓట్లు వేసినట్లు ఎన్నికల తర్వాత నిర్వహించిన తొలి ప్రెస్‌మీట్‌లో ఆయన వివరించారు.

News June 3, 2024

దొంగతనానికి వెళ్లి AC ఆన్ చేసుకుని నిద్రపోయాడు

image

UPలోని లక్నోలో ఓ వ్యక్తి దొంగతనానికి వెళ్లి ఇంట్లో ఏసీ ఆన్ చేసుకుని హాయిగా నిద్రపోయాడు. పోలీసులు అతడిని నిద్రలేపి అరెస్టు చేశారు. ఓ డాక్టర్ కుటుంబం పనిమీద వారణాసికి వెళ్లగా, పీకలదాకా మద్యం తాగిన దొంగ వారి ఇంట్లోకి చొరబడ్డాడు. ఏసీ ఆన్ చేసుకుని నేలపై పడుకున్నాడు. బయట గేట్ ఓపెన్ చేసి ఉండటంతో పక్కింటి వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు.

News June 3, 2024

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.66,100కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గడంతో రూ.72,110 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.700 తగ్గి రూ.97,300కు చేరింది.

News June 3, 2024

భారీ ర్యాలీకి బీజేపీ ప్లాన్!

image

మళ్లీ కమల ప్రభంజనమే అని ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠంగా ప్రకటించడంతో బీజేపీ గెలుపు సంబరాలకు ప్లాన్ చేస్తోంది. రేపు ఢిల్లీలోని ప్రధాని మోదీ నివాసం నుంచి బీజేపీ జాతీయ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ర్యాలీలో మోదీ పాల్గొంటారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం గెలుపు ప్రసంగంలో తొలి 100 రోజుల ప్రణాళిక ప్రకటించే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి.

News June 3, 2024

వైసీపీకి షాకిచ్చిన సుప్రీంకోర్టు

image

AP: పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు వ్యవహారంలో <<13364354>>సుప్రీంకోర్టులోనూ<<>> వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. పోస్టల్ బ్యాలెట్ ఓటుపై సీలు లేకున్నా కౌంటింగ్‌కు అర్హత ఉంటుందని హైకోర్టు ఇచ్చిన <<13358298>>తీర్పును<<>> వైసీపీ సుప్రీంలో సవాల్ చేసింది.

News June 3, 2024

నోటా ఓటుతో కలవరపాటు!

image

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడి కానున్నాయి. కాగా ఈసారి లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో నోటా ఓట్లు కూడా అభ్యర్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపనున్నాయి. ఎందుకంటే.. గత రెండు ఎన్నికల్లోనూ నోటా ఓట్లు భారీగానే పోలయ్యాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 60,02,942 మంది, 2019లో 65,22,772 మంది నోటా బటన్ నొక్కేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఈ ఓట్లు అభ్యర్థులకు పడితే ఫలితాలు తారుమారయ్యే ఛాన్స్ కూడా ఉండేది.

News June 3, 2024

BREAKING: పాలిసెట్ ఫలితాలు విడుదల

image

తెలంగాణ పాలిసెట్ ఫలితాలను విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. Way2News యాప్‌లో సులభంగా, వేగంగా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ప్రత్యేక స్క్రీన్‌లో హాల్‌టికెట్ నంబర్ ఇచ్చి క్లిక్ చేస్తే మెరుపు వేగంతో ఫలితాలు వస్తాయి. మే 24న జరిగిన ఈ పరీక్షకు 82,809 మంది విద్యార్థులు హాజరయ్యారు.

News June 3, 2024

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘన.. బీఆర్ఎస్ MLAపై కేసు

image

TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. గతేడాది నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆయన పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువాతో వెళ్లారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తూ ఓటర్లను మభ్యపెట్టిన ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు. 188 ఐపీసీ, 130 ఆర్పీ సెక్షన్ల కింద కేసు నమోదైంది.

News June 3, 2024

21 స్థానాల్లో జనసేన పోటీ.. ఎక్కడెక్కడ గెలుస్తుంది?

image

AP: జనసేన పోటీ చేసిన 21 MLA స్థానాల్లో 14-15 సీట్లు, 2 ఎంపీ స్థానాల్లో గెలిచే అవకాశముందని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. పిఠాపురం, పెందుర్తి, విశాఖ సౌత్, యలమంచిలి, అనకాపల్లి, నెల్లిమర్ల, పాలకొండ, రాజానగరం, పి.గన్నవరం, రాజోలు, కాకినాడ రూరల్, భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు, నరసాపురం, ఉంగుటూరు, పోలవరం, అవనిగడ్డ, తెనాలి, తిరుపతి, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో JSP ఎక్కడెక్కడ గెలుస్తుందో కామెంట్ చేయండి.

News June 3, 2024

BREAKING: పిన్నెల్లిపై సుప్రీంకోర్టు ఆంక్షలు

image

AP: మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే <<13354570>>పిన్నెల్లి<<>> రామకృష్ణారెడ్డిపై సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లొద్దని ఆయనను ఆదేశించింది. అలాగే బెయిల్‌ను పొడిగించకుండా ఈ నెల 6న నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచించింది. EVM ధ్వంసం కేసులో ఆయనకు హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను రద్దు చేయాలని టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.