News June 2, 2024

వాహనదారులకు బ్యాడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలు పెంపు

image

దేశవ్యాప్తంగా టోల్ ఛార్జీలు సగటున 5% పెరిగాయి. ఇవాళ అర్ధరాత్రి నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ఏటా APR 1న NHAI టోల్ ఛార్జీలు పెంచుతుంది. ఈసారి ఎన్నికలు ఉండటంతో EC ఆదేశాలతో వాయిదా వేసింది. HYD-విజయవాడ హైవేపై కార్లు, జీపులు, వ్యాన్లకు ఒకవైపు ప్రయాణానికి రూ.5, రెండు వైపులా కలిపి రూ.10 పెరిగింది. తేలికపాటి వాణిజ్య వాహనాలు రూ.10-20, బస్సులు, ట్రక్కులు రూ.25-35, భారీ రవాణా వాహనాలకు రూ.35-50కి పెరిగాయి.

News June 2, 2024

T20 WC: బౌలింగ్ ఎంచుకున్న USA

image

డల్లాస్ వేదికగా కెనడాతో జరుగుతున్న టీ20 WC తొలి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు అమెరికా టాస్ గెలిచింది. కెప్టెన్ మొనాంక్ పటేల్ బౌలింగ్ ఎంచుకున్నారు.
కెనడా: జాన్సన్, నవనీత్, పర్గత్, కిర్టన్, శ్రేయాస్, దిల్‌ప్రీత్, సాద్ బిన్ జాఫర్, నిఖిల్, హేలిగర్, కలీమ్ సనా, జెరెమీ గోర్డాన్
USA: టేలర్, మొనాంక్ , ఆండ్రీస్, జోన్స్, నితీష్, అండర్సన్, హర్మీత్, షాల్క్‌విక్, జస్దీప్, అలీఖాన్, సౌరభ్

News June 2, 2024

నేటి నుంచే T20 WC.. కాసేపట్లో మ్యాచ్

image

IPL ముగిసినా క్రికెట్ అభిమానులను అలరించేందుకు T20 WC సిద్ధమైంది. ఇవాళ ఉ.6 గం.కు USA-కెనడా మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌తో పొట్టి కప్ సంగ్రామానికి తెర లేవనుంది. రా.8 గం.కు విండీస్-పపువా న్యూగినియా మ్యాచ్ జరగనుంది. WC తొలి సీజన్‌(2007)లో టైటిల్ గెలిచిన IND.. ఇప్పటివరకు మళ్లీ కప్పు కొట్టలేదు. ఈసారైనా ఆ కోరిక తీరాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈనెల 5న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో IND టైటిల్ వేట మొదలవుతుంది.

News June 2, 2024

ఇవాళ స్థానిక సంస్థల MLC ఉపఎన్నిక ఫలితాలు

image

TG: మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గ MLC ఉపఎన్నిక ఫలితాలు నేడు వెలువడనున్నాయి. మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఉ.8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 1,439 ఓట్లలో 1,437 పోలయ్యాయి. ఈ ఎన్నికలో మన్నె జీవన్‌రెడ్డి(కాంగ్రెస్), నవీన్‌కుమార్ రెడ్డి(బీఆర్ఎస్), సుదర్శన్ గౌడ్(స్వతంత్ర) పోటీ చేశారు. MLC కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవడంతో ఈ ఉపఎన్నిక వచ్చింది.

News June 2, 2024

నేడు తెలంగాణ దశాబ్ది వేడుకలు

image

తెలంగాణ ఏర్పడి పదేళ్లు కావడంతో నేటి రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోంది. ఉ.9.30గం.కు CM రేవంత్ గన్‌పార్క్‌లోని అమరుల స్తూపం వద్ద నివాళి అర్పిస్తారు. 9.55గం.కు పరేడ్ గ్రౌండ్‌లో జాతీయజెండా ఆవిష్కరిస్తారు. ‘జయజయహే తెలంగాణ’ను రాష్ట్ర అధికార గేయంగా జాతికి అంకితమిస్తారు. సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై కళాకారుల ధూం ధాం ప్రదర్శనలు, లేజర్ షో, ఫైర్ వర్క్స్, కార్నివాల్ కార్యక్రమాలు ఉంటాయి.

News June 2, 2024

24వేల మార్క్ దాటేందుకు నిఫ్టీ రెడీ?

image

బీజేపీదే మరోసారి అధికారం అని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్న నేపథ్యంలో మార్కెట్లలో ఒడుదొడుకులకు చెక్ పడొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. రేపటి నుంచి మార్కెట్లు దూసుకెళ్లొచ్చని అంచనా వేశారు. ఒకవేళ 4న వెల్లడయ్యే ఫలితాలు కూడా బీజేపీకి సానుకూలంగా వస్తే నిఫ్టీ 24వేల మార్క్‌ను దాటుతుందని పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం 100 రోజుల్లో తీసుకునే నిర్ణయాలపై మార్కెట్లు దృష్టి సారిస్తాయని తెలిపారు.

News June 2, 2024

అరుణాచల్‌ ప్రజలు పట్టం కట్టేదెవరికో?

image

అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పుపై ఆసక్తి నెలకొంది. ప్రత్యర్థులు లేక BJP ఇప్పటికే పది చోట్ల విజేతగా నిలిచింది. నేడు వెల్లడికానున్న మిగిలిన 50 స్థానాల ఫలితాలపైనా BJP ధీమాగా ఉంది. మరోవైపు నేషనల్ పీపుల్స్ పార్టీతో కలిసి బరిలోకి దిగిన కాంగ్రెస్ 19 సీట్లలోనే పోటీకి పరిమితమైంది. పేపర్ లీక్స్‌తో ప్రభుత్వంపై వ్యతిరేకత, తమ పార్టీ ప్రకటించిన గ్యారంటీలు కలిసి వస్తాయనేది కాంగ్రెస్ అంచనా.

News June 2, 2024

బెంగాల్, ఏపీలో 15 రోజుల పాటు అదనపు భద్రత?

image

ఎన్నికల్లో ఇటీవల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో ఏపీ, బెంగాల్ రాష్ట్రాలపై ఈసీ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఫలితాలు వెల్లడైన 15రోజుల వరకు కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. మరోవైపు యూపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌ల రాష్ట్రాల్లో ఫలితాలు వెల్లడైన రెండు రోజుల వరకు కేంద్ర బలగాలు గస్తీ కాయనున్నాయి.

News June 2, 2024

‘అగ్నిపథ్’పై రాష్ట్రపతికి రాహుల్ లేఖ

image

అగ్నివీరులకు న్యాయం చేయాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కోరారు. విధుల్లో అమరులైన అగ్నివీరులకు ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. ఈ సందర్భంగా అమరుడైన అజమ్ కుమార్ అనే అగ్నివీర్ కుటుంబ దుస్థితి గురించి లేఖలో పేర్కొన్నారు. ఇదే పరిస్థితి ఇతర అగ్నివీరులకూ ఉందని, సైనిక బలగాల సుప్రీంకమాండర్‌గా దీనిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని కోరారు.

News June 2, 2024

మళ్లీ అదానీనే నెం.1!

image

అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ మరోసారి ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆయన నికర సంపద $111 బిలియన్లకు పెరిగింది. ఫలితంగా అంబానీని ($109 బిలియన్లు) వెనక్కి నెట్టి బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల జాబితాలో 11వ స్థానానికి చేరారు. శుక్రవారం జరిగిన ట్రేడింగ్‌లో అదానీ గ్రూప్ స్టాక్స్ దూసుకెళ్లడమే ఇందుకు కారణం. కాగా గత ఏడాది హిండెన్‌బర్గ్ రిపోర్ట్ కారణంగా అదానీ సంపద క్షీణించిన సంగతి తెలిసిందే.