News May 30, 2024

ప్రజ్వల్‌ రేవణ్ణకు 10రోజుల డెడ్‌లైన్: MEA

image

కర్ణాటక MP ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్ట్ రద్దు దిశగా చర్యలు చేపట్టినట్లు భారత విదేశాంగశాఖ వెల్లడించింది. తన పాస్‌పోర్టు ఎందుకు రద్దు చేయకూడదో వివరించాలని ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చామంది. ఈమేరకు విధించిన డెడ్‌లైన్‌(10 రోజులు)లోగా స్పందించకపోతే చర్యలు తీసుకుంటామని తెలిపింది. ప్రజ్వల్ ఈరోజు అర్ధరాత్రి బెంగళూరుకు చేరుకోనుండగా.. ఆయనను విమానాశ్రయంలోనే అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

News May 30, 2024

ఇంటర్ కాలేజీలకు రేపటితో ముగియనున్న సెలవులు

image

తెలంగాణలోని జూనియర్ కాలేజీలకు రేపటితో వేసవి సెలవులు ముగియనున్నాయి. దీంతో జూన్ 1న కళాశాలలు పున:ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని అన్ని జూనియర్, ఎయిడెడ్ కాలేజీలకు మార్చి 31 నుంచి ఇంటర్ బోర్డు సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే. అటు స్కూళ్లు జూన్ 12న తిరిగి తెరుచుకుంటాయి.

News May 30, 2024

తుది అంకానికి సార్వత్రిక ఎన్నికలు

image

సుమారు రెండున్నర నెలలుగా దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు చివరి ఘట్టానికి చేరుకున్నాయి. మొత్తం 543 ఎంపీ స్థానాలతో పాటు AP, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు మార్చి 16న EC షెడ్యూల్ విడుదల చేసింది. తొలి విడత-APR 19, రెండో విడత-APR 26, మూడో విడత-మే 7, నాలుగో విడత-మే 13, ఐదో విడత-మే 20, ఆరో విడత-మే 25న జరిగాయి. జూన్ 1న చివరి విడత పోలింగ్ అనంతరం 4న ఫలితాలు రానున్నాయి.

News May 30, 2024

ముస్లిం యువకుడు, హిందూ యువతి పెళ్లి చెల్లదు: ఎంపీ హైకోర్టు

image

ముస్లిం యువకుడు, హిందూ యువతి పెళ్లి చేసుకోవడం ముస్లిం లా ప్రకారం చెల్లదని మధ్యప్రదేశ్ హైకోర్టు తాజాగా తీర్పుచెప్పింది. మతాంతర వివాహంగా రిజిస్టర్ అయ్యేందుకు అనుమతినివ్వాలని, తమకు రక్షణ కల్పించాలని ఓ జంట చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఇద్దరూ మతం మార్చుకోవడానికి సిద్ధంగా లేరని, ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకున్నప్పటికీ ముస్లిం లా ప్రకారం చట్టబద్ధంగా పరిగణించలేమని స్పష్టం చేసింది.

News May 30, 2024

ప్రసారాల్లో జియో సరికొత్త రికార్డ్!

image

ఈ ఏడాది ఐపీఎల్‌ ప్రసారంలో కొత్త రికార్డుల్ని సృష్టించినట్లు జియో సినిమా ప్రకటించింది. ఈ సీజన్‌లో 62 కోట్ల వీక్షణలు నమోదైనట్లు వెల్లడించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 53శాతం ఎక్కువ. ఇక వీక్షణ సమయం 35వేల కోట్ల నిమిషాలుగా ఉందని తెలిపింది. గత ఏడాది తొలి మ్యాచ్‌తో పోలిస్తే ఈ ఏడాది తొలిమ్యాచ్‌ను 51శాతం ఎక్కువగా (11.3 కోట్లమంది) చూశారని పేర్కొంది. ప్రేక్షకుడు సగటున 75 నిమిషాలను వెచ్చించారని చెప్పింది.

News May 30, 2024

ఇండియా కూటమికి స్పష్టమైన ఆధిక్యం: ఖర్గే

image

ఈ ఎన్నికల్లో ఇండియా కూటమికి స్పష్టమైన ఆధిక్యం వస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశానికి సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తామని చెప్పారు. ‘ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ తన ప్రసంగాల్లో 421 సార్లు మత, విభజన వాద వ్యాఖ్యలు చేశారు. కులమతాల ఆధారంగా ఓట్లు అభ్యర్థించకూడదని ఈసీ నిబంధనలు ఉన్నా వాటిని ఉల్లంఘించారు. 758 సార్లు తన సొంత పేరే తలుచుకున్నారు’ అని ఆయన ఎద్దేవా చేశారు.

News May 30, 2024

ఐదేళ్ల క్రితం ఇదేరోజు అధికారంలోకి వచ్చాం: CM జగన్

image

AP: దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల క్రితం ఇదేరోజు YCP అధికారంలోకి వచ్చిందని CM జగన్ ట్వీట్ చేశారు. ‘కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మన పార్టీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటు కానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది’ అంటూ గతంలో ప్రమాణస్వీకారం చేసిన ఫొటోను పోస్ట్ చేశారు.

News May 30, 2024

మార్కెట్లను వెంటాడుతున్న నష్టాలు!

image

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదోరోజు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 617 పాయింట్లు కోల్పోయి 73,885కు చేరగా నిఫ్టీ 216 పాయింట్ల నష్టంతో 22,488 వద్ద స్థిరపడింది. ఎన్నికల ఫలితాలు సహా రిలయన్స్, ఇన్ఫోసిస్, TCS వంటి బడా షేర్లు ఒడుదొడుకులకు గురవడం మార్కెట్‌పై ప్రభావం చూపించింది. US వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ మిన్నియాపోలిస్ ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలు సైతం ప్రభావం చూపాయి.

News May 30, 2024

BREAKING: ముగిసిన చివరి దశ ప్రచారం

image

సార్వత్రిక ఎన్నికలు-2024ల్లో చివరి దశ ప్రచారం ముగిసింది. ఈ ఫేజ్‌లో 8 రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇందులో యూపీలోని వారణాసి నుంచి ప్రధాని మోదీ, హిమాచల్ ప్రదేశ్‌లోని మండిలో నటి కంగన వంటి ప్రముఖులు ఈ పోటీ చేస్తున్నారు. జూన్ 1తో 7 దశల పోలింగ్ ముగియనుండగా జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో మొత్తం సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది.

News May 30, 2024

లోయలో పడ్డ బస్సు.. 15 మంది దుర్మరణం

image

జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అఖ్నూర్ వద్ద బస్సు అదుపు తప్పి లోయలో పడటంతో 15 మంది మరణించారు. మరో 50 మంది గాయపడ్డారు. ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.