News May 30, 2024

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిపోతున్న బంగారం, వెండి ధరలు ఇవాళ తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.66,700కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.440 తగ్గడంతో రూ.72,760 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.1,200 తగ్గి రూ.1,01,000కు చేరింది.

News May 30, 2024

ఈసెట్ ఫలితాలు విడుదల

image

AP: ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. 93.34 శాతం ఉత్తీర్ణత నమోదైందని అధికారులు వెల్లడించారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ సెకండియర్‌లో ప్రవేశానికి ఈసెట్ నిర్వహిస్తారు. 36,369 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాశారు. WAY2NEWS ఓపెన్ చేయగానే కనిపించే బాక్స్‌లో హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.

News May 30, 2024

ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట

image

AP: సీనియర్ IPS ఆఫీసర్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట దక్కింది. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు కోర్టు నిరాకరించింది. మూడు వారాల క్రితం ABV సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఆయన సస్పెన్షన్ చట్టవిరుద్ధమని పేర్కొంది. క్యాట్ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసింది. అందులో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.

News May 30, 2024

BREAKING: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

image

నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ రుతుపవనాల ప్రభావంతో నాలుగైదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కేరళలో వర్షాలు దంచికొడుతున్నాయి. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

News May 30, 2024

T20WC FINALSలో జట్ల విజయ ప్రస్థానం ఇలా..

image

2007 PAKపై 5రన్స్‌ తేడాతో IND విజయం
2009 SLపై 8వికెట్ల తేడాతో PAK గెలుపు
2010 AUSపై 7వికెట్ల తేడాతో ENG విజయం
2012 SLపై 36రన్స్‌ తేడాతో WI గెలుపు
2014 INDపై 6వికెట్ల తేడాతో SL విజయం
2016 ENGపై 7వికెట్ల తేడాతో WI గెలుపు
2021 NZపై 8వికెట్ల తేడాతో AUS విజయం
2022 PAKపై 5వికెట్ల తేడాతో ENG గెలుపు
2024లో ఎవరు గెలుస్తారో? కామెంట్ చేయండి.

News May 30, 2024

‘అగ్నిబాణ్’ ప్రయోగం విజయవంతం

image

శ్రీహరికోట నుంచి అగ్నికుల్ కాస్మోస్ చేసిన ‘అగ్నిబాణ్’ ప్రయోగం విజయవంతమైంది. ఇది త్రీడీ ప్రింటెడ్ సెమీ-క్రయోజెనిక్ లిక్విడ్ ఇంజిన్‌ కలిగిన సింగిల్ స్టేజ్ లాంఛ్ వెహికల్ కావడం విశేషం. ప్రయోగం సక్సెస్ కావడం పట్ల ఇస్రో హర్షం వ్యక్తం చేసింది. భారత ప్రైవేటు రోదసి పరిశ్రమలో ఇది ఓ మైలురాయి అని కొనియాడింది. గత నెల 7నే ఈ లాంఛ్ జరగాల్సినప్పటికీ సాంకేతిక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది.

News May 30, 2024

ఇజ్రాయెల్ అధీనంలోకి వ్యూహాత్మక కారిడార్

image

ఈజిప్టు-గాజా సరిహద్దుల్లోని వ్యూహాత్మక ఫిలడెల్ఫీ కారిడార్‌ను అధీనంలోకి తీసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హమాస్‌ కోసం గాజాలోకి అక్రమంగా ఆయుధాలు, ఇతర వస్తువులను ఫిలడెల్ఫీ కారిడార్ నుంచి తరలిస్తున్నట్లు ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. దీనిని అధీనంలోకి తీసుకోవడంతో ఈజిఫ్టు-ఇజ్రాయెల్ సంబంధాలు సంక్లిష్టం కానున్నాయి. ఈ కారిడార్‌లో బలగాలను మోహరించడం శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని ఈజిఫ్టు పేర్కొంది.

News May 30, 2024

బార్డర్లు మరింత బలంగా..

image

ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా రూ. 6వేల కోట్ల విలువైన 100 కే-9 యుద్ధట్యాంకులను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోలింగ్ పూర్తై, రక్షణ సముపార్జన మండలి ఆమోదం ఇవ్వగానే HALతో ఈ ఒప్పందాన్ని చేసుకోనున్నట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. వీటిని అటు చైనా, ఇటు పాకిస్థాన్‌ సరిహద్దుల వద్ద భారత్ మోహరించనుంది. 50 టన్నుల బరువుండే ఈ ట్యాంకులకు 50 కిలోమీటర్ల పరిధి వరకూ గురి పెట్టగల సామర్థ్యం ఉంది.

News May 30, 2024

IRDAI గ్రే(ట్)స్ రిలీఫ్

image

హెల్త్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ గ్రేస్ పీరియడ్‌లోనూ పాలసీదారులకు పూర్తి కవరేజ్ ఇవ్వాలని <<13340589>>IRDAI<<>> ఆదేశించింది. నెలవారీ ప్రీమియం చెల్లించేవారికి 15 రోజులు, క్వార్టర్లీ, ఆఫ్ ఇయర్లీ, యాన్యువల్ ప్రీమియం గల వారికి 30 రోజుల గ్రేస్ టైమ్ ఉంటుందని తెలిపింది. ఇప్పటివరకు ఈ పీరియడ్ కంపెనీని బట్టి వేర్వేరుగా ఉంది. అటు ఆ టైమ్‌లో కస్టమర్లు పాలసీ రెన్యూవల్ చేసుకోవచ్చు కానీ కవరేజ్ పొందే అవకాశం లేదు.

News May 30, 2024

రాష్ట్ర గీతం.. ఈ విషయాలు తెలుసా?

image

తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్నా రాష్ట్ర గీతం లేదు. అందె శ్రీ రచించిన ‘జయ జయహే తెలంగాణ.. జననీ జయకేతనం’ అనే గీతం ఉద్యమ సమయంలో ఎంతోమందిలో స్ఫూర్తి నింపింది. ఇందులో 11 చరణాలు ఉండగా, 4 చరణాలను ఎంచుకుని రాష్ట్ర గీతంగా ఎంపిక చేయాలని అప్పటి సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కానీ కుదరలేదు. తాజాగా కాంగ్రెస్ సర్కారు రాష్ట్ర గీతంగా దీన్ని ఎంపిక చేసింది. అయితే కీరవాణికి సంగీత బాధ్యతలు అప్పగించడం వివాదాస్పదమైంది.