News May 30, 2024

అంబటి రాయుడు భార్య, పిల్లలకి హత్యాచార బెదిరింపులు!

image

అంబటి రాయుడు భార్యకు కోహ్లీ ఫ్యాన్స్ నుంచి అత్యాచారం, హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆయన స్నేహితుడు సామ్‌పాల్ వెల్లడించారు. ‘1,4 ఏళ్ల వయసున్న కుమార్తెలను హత్యాచారం చేస్తామని బెదిరించారని రాయుడు భార్య చెప్పింది. ఆమెను తీవ్రంగా హింసిస్తున్నారు. వీరిపై పోలీసులు చర్యలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. IPLని గెలిపించేది ఆరెంజ్ క్యాప్ కాదని రాయుడు పరోక్షంగా కోహ్లీపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

News May 30, 2024

శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న ఏడుకొండలవాడిని 73,811 మంది దర్శించుకున్నారు. 34,901 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.19 కోట్లు లభించింది.

News May 30, 2024

మోదీజీ.. నాకే ఫోన్ చేయొచ్చుగా: ఒడిశా సీఎం

image

బీజేపీ నేతలు తన ఆరోగ్యంపై అబద్ధాల్ని వ్యాప్తి చేస్తున్నారని ఒడిశా సీఎం పట్నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘నెలరోజులుగా నేను రాష్ట్రమంతటా ప్రచారంలో తిరుగుతూ బాగానే ఉన్నా. నేను మంచి మిత్రుడినని మోదీ అన్నారు. మరి అలాంటప్పుడు నాకే ఫోన్ చేసి నా ఆరోగ్యం గురించి కనుక్కోవచ్చుగా’ అని ప్రశ్నించారు. నవీన్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంపై అనుమానాలున్నాయని, దర్యాప్తు చేయిస్తామని మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే.

News May 30, 2024

చంద్రగిరి డీఎస్పీ సస్పెండ్

image

AP: పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన అల్లర్ల విషయంలో పోలీసు అధికారులపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. తాజాగా చంద్రగిరి డీఎస్పీ శరత్ కుమార్‌ను తిరుపతి జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. నిన్న ఆయన నియోజకవర్గంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించారు. విధుల్లో డీఎస్పీ నిర్లక్ష్యం వహించినట్లు ఫిర్యాదులు రావడంతో వేటు వేశారు.

News May 30, 2024

తొలుత 35.. రీకౌంటింగ్‌లో 89 మార్కులు

image

AP: టెన్త్ పరీక్షల మూల్యాంకనంలో ఎవాల్యుయేటర్ల <<13337104>>తప్పులు<<>> బయటికొస్తున్నాయి. చిత్తూరులో ఉర్జిత్ అనే విద్యార్థికి తెలుగులో 95, ఇంగ్లిష్‌లో 98, సైన్స్‌లో 90, సోషల్‌లో 85 మార్కులు రాగా, హిందీలో 35 మాత్రమే వచ్చాయి. రీకౌంటింగ్‌కు దరఖాస్తు చేయగా, తాజా ఫలితాల్లో ఆ సబ్జెక్టుకు 89 మార్కులు వచ్చాయి. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన మార్కుల విషయంలో ఎవాల్యుయేటర్లు బాధ్యతగా ఉండాలని పేరెంట్స్ సూచిస్తున్నారు.

News May 30, 2024

స్కూళ్లలో స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్

image

AP: రాష్ట్రంలోని 352 KGBVలు, 50 రెసిడెన్షియల్ స్కూళ్లలో 9వ తరగతి విద్యార్థులకు ‘స్టూడెంట్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌’ను విద్యాశాఖ అమలు చేయనుంది. ఇందులో భాగంగా విద్యార్థులను వివిధ ప్రాంతాల్లోని స్కూళ్లకు కొద్దిరోజులు పంపుతుంది. కొత్త విద్యార్థులతో మాట్లాడటం, విద్యావిధానాలను తెలుసుకోవడం ద్వారా వారి ఆలోచనా పరిధి పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్‌కు జూన్ 15 నుంచి దరఖాస్తులు మొదలవుతాయి.

News May 30, 2024

మోదీ ధ్యానం ఎన్నికల కోడ్ ఉల్లంఘనే: విపక్షాలు

image

కన్యాకుమారిలో ప్రధాని <<13340790>>మోదీ<<>> ధ్యానం ‘ఎన్నికల కోడ్’ ఉల్లంఘనే అని విపక్షాలు ఆరోపించాయి. చివరి దశ పోలింగ్‌ను ప్రభావితం చేసే అవకాశం ఉందని మండిపడ్డాయి. ఈ కార్యక్రమాన్ని టీవీలు, ఇతర మాధ్యమాల్లో ప్రసారం కాకుండా అడ్డుకోవాలని కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీలు ఈసీని కోరాయి. కావాలంటే జూన్ 1న సాయంత్రం నుంచి ధ్యానం చేసుకోవాలన్నాయి. ప్రధాని కార్యక్రమంపై ఎలాంటి నిషేధం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

News May 30, 2024

T20 WC: టాప్-5 రన్ స్కోరర్స్

image

☛ విరాట్ కోహ్లీ (ఇండియా) -1141 (25 ఇన్నింగ్స్)
☛ జయవర్దనే (శ్రీలంక) -1016 (31 ఇన్నింగ్స్)
☛ క్రిస్ గేల్ (వెస్టిండీస్) – 965 (31 ఇన్నింగ్స్)
☛ రోహిత్ శర్మ(ఇండియా) – 963 (36 ఇన్నింగ్స్)
☛ దిల్షాన్ (శ్రీలంక) – 897 (34 ఇన్నింగ్స్)

News May 30, 2024

నేడు కేరళకు నైరుతి రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణకు ఎప్పుడంటే?

image

నైరుతి రుతుపవనాలు నేడు కేరళను తాకుతాయని IMD అంచనా వేసింది. రాబోయే 3, 4 రోజుల్లో AP, TGలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది. APలో ఇవాళ పొడి వాతావరణం ఉంటుందని, ఉష్ణోగ్రతలు 2-4 డిగ్రీలు పెరుగుతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. రేపు శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, పల్నాడు, NLR, ప్రకాశం, నంద్యాల, YSR, అన్నమయ్య, TPT, శ్రీ సత్యసాయి, అల్లూరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

News May 30, 2024

PHOTO: వృద్ధురాలికి పాదాభివందనం చేసిన మోదీ

image

ఒడిశాలోని కేంద్రపరాలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఓ వృద్ధురాలికి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఫొటోను బీజేపీ ట్వీట్ చేస్తూ.. ‘నేను మీ సేవకుడ్ని, మీ కుమారుడిని’ అని పోస్ట్ చేసింది. దేశం మొత్తం మూడోసారి మోదీ సర్కార్‌ను తీసుకొచ్చేందుకు నిర్ణయించిందని పేర్కొంది.