News May 30, 2024

నేటితో ముగియనున్న ప్రచారపర్వం

image

లోక్‌సభ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఇప్పటికే ఆరు దశల పోలింగ్ పూర్తవ్వగా, ఏడో దశ జూన్ 1న జరగనుంది. చివరి దశలోనే ప్రధాని మోదీ పోటీ చేసే వారణాసి ఉండటం గమనార్హం. నేడు ఒడిశాలోని భద్రలోక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, TG డిప్యూటీ సీఎం భట్టి ప్రచారం నిర్వహించనున్నారు. జూన్ 1న పోలింగ్ ముగియగానే ఎగ్జిట్ పోల్ సర్వేలు వెలువడే అవకాశం ఉంది. 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

News May 30, 2024

కోతల్లేకుండా విద్యుత్ సరఫరా: డిస్కంల సీఎండీ

image

AP: ఫీడర్లలో సాంకేతిక సమస్యతో పలుచోట్ల గంటల తరబడి విద్యుత్ సరఫరా <<13335123>>నిలిచిపోయిందంటూ<<>> వచ్చిన వార్తలను 2 డిస్కంల CMD సంతోషరావు ఖండించారు. డిమాండ్ పెరిగినప్పటికీ నిరంతరాయంగా విద్యుత్ పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడటం, సబ్ స్టేషన్లపై పిడుగుల వల్ల ఇబ్బందులు వస్తున్నాయని పేర్కొన్నారు. సమస్య పరిష్కారానికి పలు చోట్ల 23-45 నిమిషాలే సరఫరా నిలిపివేశామన్నారు.

News May 30, 2024

నేడు ఐసెట్, ఈసెట్ ఫలితాలు

image

AP: నేడు ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉ.11 గంటలకు అనంతపురం JNTUలో రిజల్ట్స్ విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన విద్యార్థులు బీటెక్ సెకండియర్‌లో ప్రవేశానికి ఈసెట్, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్లకు ఐసెట్ నిర్వహిస్తారు. మే 6 ఐసెట్, 8న ఈసెట్ నిర్వహించారు.

News May 30, 2024

భార్యపై కోపంతో బాంబు బెదిరింపు ఫోన్ కాల్

image

హైదరాబాద్‌లోని ప్రజా భవన్, నాంపల్లి కోర్టులో <<13330985>>బాంబులు<<>> పెట్టానంటూ బెదిరింపు ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. మల్కాజ్‌గిరిలోని సఫిల్‌గూడకు చెందిన శివకుమార్ భార్యతో మనస్పర్ధలు రావడంతో ఒంటరిగా ఉంటున్నాడని వారు తెలిపారు. మద్యానికి బానిసైన అతను మత్తులో మంగళవారం భార్యకు ఫోన్ చేయగా ఆమె స్పందించలేదన్నారు. ఆ కోపంలో నగరంలో పలు చోట్ల బాంబులు పెట్టానంటూ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడని చెప్పారు.

News May 30, 2024

సెన్సార్ ఎర్రర్ వల్లే 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత: IMD

image

నిన్న ఢిల్లీలోని ముంగేశ్‌పూర్‌లో సెన్సార్ తప్పిదాల వల్లే 52.9 డిగ్రీల <<13338270>>ఉష్ణోగ్రత<<>> నమోదైనట్లు ఐఎండీ క్లారిటీ ఇచ్చింది. ‘సెన్సార్‌ ఎర్రర్ లేదా లోకల్ ఫ్యాక్టర్ వల్ల 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. డేటా, సెన్సార్లను పరిశీలించి అధికారికంగా ఈ ప్రకటన చేస్తున్నాం’ అని తెలిపింది. కాగా, ఢిల్లీలో అంత ఉష్ణోగ్రత నమోదైందంటే నమ్మశక్యంగా లేదని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కూడా నిన్న ట్వీట్ చేశారు.

News May 30, 2024

భారత జట్టుకు తప్పకుండా ఆడతా: పరాగ్

image

ఏదో ఒక దశలో సెలక్టర్లు తనను టీమ్‌ఇండియాకు ఎంపిక చేయక తప్పదని రియాన్ పరాగ్ అన్నారు. ‘ఎప్పుడనేది తెలియదు కానీ భారత జట్టుకు తప్పకుండా ఆడతా. ఇది నాపైన నాకున్న నమ్మకం. దీనిలో అహంకారం ఏం లేదు. పదేళ్ల వయసులో క్రికెట్ ఆడటం మొదలెట్టినప్పుడే జాతీయ జట్టుకు ఆడతానని అనుకున్నా’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ ఏడాది IPLలో అతను RR తరఫున 14 మ్యాచుల్లో 573 రన్స్ చేశారు.

News May 30, 2024

GOOD NEWS: పుస్తకాల రేట్లు తగ్గించిన ప్రభుత్వం

image

TG: జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరంలో అన్ని మీడియంలకు చెందిన పాఠ్యపుస్తకాల ధరలు తగ్గనున్నాయి. ఒక్కో బుక్‌పై ₹10 నుంచి ₹74 వరకు తగ్గుతుందని ప్రభుత్వం తెలిపింది. మార్కెట్‌లో పేపర్ రేటు తగ్గడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక్కో క్లాస్ బుక్స్ రేట్స్‌పై పేరెంట్స్‌కు ₹200-300 ఆదా కానుంది. ఉదాహరణకు 2023-24లో టెన్త్ పుస్తకాల ధర ₹1,482 ఉండగా ఈసారి ₹1,126కి తగ్గింది.

News May 30, 2024

నం.1 ర్యాంకుతోనే T20WCలోకి

image

టీ20 WCలోకి భారత జట్టు నం.1 ర్యాంకుతోనే అడుగుపెట్టనుంది. ఇటీవల ప్రకటించిన ఐసీసీ టీమ్ ర్యాంకుల్లో భారత్ అగ్రస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్, న్యూజిలాండ్ టీమ్స్ ఉన్నాయి. వీటిలో ENG, వెస్టిండీస్ ఇప్పటివరకు తలో రెండు సార్లు ట్రోఫీ నెగ్గాయి. ఇక భారత్, AUS ఒక్కోసారి టైటిల్ అందుకున్నాయి. 2021లో రన్నరప్‌గా నిలిచిన NZ ఈ సారి కప్పుపై కన్నేసింది.

News May 30, 2024

ప్రభాకర్ రావు ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ ఆధారాలు ధ్వంసం: ప్రణీత్ రావు

image

TG: ఎగ్జిట్ పోల్స్ విడుదలైన అనంతరం ఫోన్ ట్యాపింగ్‌ ఆధారాలను, డాక్యుమెంట్లను ధ్వంసం చేయాలని SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశించినట్లు నిందితుడు ప్రణీత్ రావు తన వాంగ్మూలంలో తెలిపారు. అతడే సీసీ కెమెరాలను ఆఫ్ చేయించారన్నారు. BRS ఓడిపోవడంతో డిసెంబర్ 4న రా.7.30 నుంచి 8.15 గంటల వరకు హార్డ్ డిస్కులను కట్టర్లతో కట్ చేశామని చెప్పారు. తన ఫోన్, ల్యాప్‌టాప్ ఫార్మాట్ చేశానని, పెన్‌డ్రైవ్‌లను పారేశానని తెలిపారు.

News May 30, 2024

ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇలా

image

TGలో లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు 119 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 1,855 టేబుళ్లు ఏర్పాట్లు చేసినట్లు CEO వికాస్ రాజ్ వెల్లడించారు. *34 ప్రాంతాల్లో సెగ్మెంట్ల వారిగా <<13340511>>ఓట్ల<<>> లెక్కింపునకు ఏర్పాట్లు *తొలుత పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ *అత్యధికంగా చొప్పదండి, దేవరకొండ, యాకుత్‌పురలో 24 రౌండ్లు, అత్యల్పంగా ఆర్మూర్, భద్రాచలం, అశ్వారావుపేటలో 13 రౌండ్లలో కౌంటింగ్ *నియోజకవర్గంలో 5 VVప్యాట్‌ల ఓట్ల లెక్కింపు.