India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: తాను జీవితంలో నిత్య విద్యార్థినని SRM వర్సిటీ విస్తరణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో CM చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘1995లోనే ఐటీని హైదరాబాద్‌కు తీసుకొచ్చా. వచ్చే 30 ఏళ్ల కోసం ఇప్పుడే ఆలోచించడం నా అలవాటు. ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ ఆదాయం సంపాదించేది భారతీయులే. వారిలో 30శాతం మంది తెలుగువారే’ అని పేర్కొన్నారు. గతంలో జనాభాను సమస్యగా భావించేవారిమని, కానీ దేశానికి అదే బలమని వివరించారు.

AP: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీ ఉత్పత్తుల్లో అరకు కాఫీకి ప్రత్యేక స్థానం ఉందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. అరకు కాఫీ ప్రాముఖ్యత తెలిసేలా పార్లమెంట్ వద్ద ప్రచార కార్యక్రమం ఏర్పాటుకు అనుమతించాలని ఆయన స్పీకర్ ఓంబిర్లాను కోరారు. అరకు కాఫీని ప్రధాని నరేంద్ర మోదీ కూడా మెచ్చుకున్నారని తెలిపారు. అరకు వ్యాలీ ఈ పంటకు ప్రసిద్ధి అని ఆయన వ్యాఖ్యానించారు.

TG: మామునూర్(WL) ఎయిర్‌పోర్టు మంజూరు చేసిన కేంద్రమంత్రి రామ్మోహన్‌కు మంత్రి కోమటిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. భూసేకరణకు నిధులు మంజూరు చేసిన అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. 15 రోజుల్లో భూసేకరణ పూర్తి చేస్తామని వివరించారు. రెండున్నరేళ్లలో ఎయిర్‌పోర్టు నిర్మిస్తామని రామ్మోహన్ హామీ ఇచ్చారని మంత్రి పేర్కొన్నారు. అలాగే కొత్తగూడెం, ఆదిలాబాద్, పెద్దపల్లి, NZB ఎయిర్‌పోర్టులకై సర్వే చేయాలని కోరారు.

ప్రణయ్ హత్య కేసు నిందితులకు కోర్టు <<15710208>>శిక్ష<<>> విధించడంపై అతని భార్య అమృత స్పందించారు. ‘ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత న్యాయం లభించింది. ఈ తీర్పుతోనైనా పరువు పేరుతో జరిగే నేరాలు, దౌర్జన్యాలు తగ్గుతాయని ఆశిస్తున్నా. ఈ ప్రయాణంలో మద్దతునిచ్చిన పోలీసు శాఖ, పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీడియాకు నా ధన్యవాదాలు. నా బిడ్డ భవిష్యత్తు కోసం నేను ప్రెస్ మీట్ నిర్వహించట్లేదు. మమ్మల్ని అర్థం చేసుకోగలరు’ అని పోస్ట్ చేశారు.

ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌తో ఎయిర్‌టెల్ ఒప్పందం కుదుర్చుకుంది. స్టార్‌లింక్ ఉపగ్రహాల సాయంతో భారత్‌లోని తమ వినియోగదారులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ను అందించనున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది స్పేస్‌ఎక్స్‌కి భారత్‌లో తొలి ఒప్పందం కావడం గమనార్హం. ఇదో మైలు రాయి అని, దేశంలోని అత్యంత వెనుకబడ్డ మారుమూల ప్రాంతాలకూ హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని ఎయిర్‌టెల్ VC గోపాల్ పేర్కొన్నారు.

TG: ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రి గడ్కరీని కలిసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పెండింగ్ రోడ్లు, రీజినల్ రింగ్ రోడ్డుపై చర్చించారు. RRRకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్, యాదగిరిగుట్ట ఆలయం, భువనగిరి కోట, నల్గొండ హనుమాన్ కొండ, నాగార్జునసాగర్, మంథనిలోని రామగిరి కోటకు రోప్‌వే వేయాలని కోరారు. HYD-విజయవాడ NH-65ను 6 లేన్లుగా విస్తరించే DPR తయారీని వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ప్రజాధనం వృథా చేసినందుకు ఆయనపై FIR నమోదు చేయాలని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు పోలీసులను ఆదేశించింది. కాగా 2019లో ద్వారకాలో కేజ్రీవాల్, ఎమ్మెల్యే గులాబ్ సింగ్, కౌన్సిలర్ నిఖితా శర్మ పబ్లిక్ మనీతో భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు. దీనిపై 2019లో కేసు నమోదైంది. 2022లో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఈ కేసును కొట్టివేశారు.

TG: సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీ వీసీగా శ్రీనివాస్‌ను కేంద్రం నియమించింది. తొలి వీసీగా ఎంపికైన ఆయన ఐదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. 30 ఏళ్లకుపైగా ఇంగ్లిష్ ప్రొఫెసర్, అడ్మినిస్ట్రేషన్, ఉస్మానియా యూనివర్సిటీలోని పలు విభాగాల్లో ఆయన సేవలు అందించారు. శ్రీనివాస్‌ను నియమించినందుకు ప్రధాని మోదీకి కేంద్రమంత్రి బండి సంజయ్ ధన్యవాదాలు చెప్పారు.

త్వరలోనే రూ.100, రూ.200 నోట్లను జారీ చేయనున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా సంజయ్ మల్హోత్రా నియమితులైన నేపథ్యంలో ఆయన సంతకంతో ఈ నోట్లు రానున్నాయి. మహాత్మా గాంధీ సిరీస్‌తోనే కొత్త నోట్లు ఉంటాయని RBI పేర్కొంది. ఇవి అందుబాటులోకి వచ్చినా పాతవి చెల్లుతాయని వెల్లడించింది.

AP: సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కర్నూలు JFCM కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆదోని కేసుకు సంబంధించి న్యాయస్థానం ఈ బెయిల్ ఇచ్చింది. ఇప్పటివరకు ఆయనకు మూడు కేసుల్లో బెయిల్ లభించింది. దీంతో ఆయన రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. కాగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో పోసానిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే.
Sorry, no posts matched your criteria.