India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: MLA కోటా MLC అభ్యర్థుల ఎంపిక టీడీపీలో ఉత్కంఠగా మారింది. నామినేషన్ల దాఖలుకు రేపటితో గడువు ముగుస్తుండటంతో అభ్యర్థుల ఎంపికపై ఇవాళ స్పష్టత రావొచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఐదింటిలో ఒక దాని కోసం నాగబాబు నామినేషన్ వేయగా, మిగతా 4 స్థానాలకు అభ్యర్థుల ఎంపికకు సీఎం చంద్రబాబు సామాజికవర్గాల వారీగా కసరత్తు చేస్తున్నారు. దాదాపు <<15649237>>25 మందికి<<>> పైగా MLC సీటు కోసం ప్రయత్నిస్తున్నారు.

నేడు భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగే CT ఫైనల్ మ్యాచ్‌పై రూ.5వేల కోట్ల బెట్టింగ్ జరగనున్నట్లు నిఘావర్గాలు గుర్తించాయి. ఈ బెట్టింగ్ ముఠాలకు అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలు ఉన్నట్లు తెలిపాయి. దుబాయి వేదికగా బెట్టింగ్ నడుస్తుండగా మనీశ్ సాహాని అనే వ్యక్తి నాయకత్వం వహిస్తున్నట్లు సమాచారం. IND-AUS సెమీస్ మ్యాచుకు బెట్టింగ్‌కు పాల్పడిన పలువురు బుకీలను ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేశారు.

‘సంక్రాంతికి వస్తున్నాం’తో బ్లాక్‌బస్టర్ కొట్టిన అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో తన తర్వాతి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీలో చిరును సరికొత్తగా చూపించనున్నట్లు సమాచారం. టాలీవుడ్ వర్గాల ప్రకారం.. గ్యాంగ్ లీడర్ తరహాలో మేకోవర్ చేయడమే కాకుండా డైలాగ్ డెలివరీ కూడా యాసతో పెట్టాలని అనిల్ భావిస్తున్నారు. చిరుకు రొమాంటిక్ ట్రాక్ ఉండదని మూవీ టీమ్ చెబుతుండటం ఆసక్తికరం.

బర్డ్‌ఫ్లూ వ్యాప్తితో చికెన్ అమ్మకాలు తగ్గి తెలుగు రాష్ట్రాల్లో పౌల్ట్రీ పరిశ్రమ కష్టాల్లోకి వెళ్లింది. ప్రస్తుతం షెడ్లలో ఉన్న కోళ్లను అమ్మేందుకు కూడా రైతులకు కష్టమవుతోంది. దీంతో కొత్తగా కోడి పిల్లలను దింపుకోవాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్నారు. ఇదే సమయంలో షెడ్ల క్లీనింగ్‌పై ఫోకస్ పెట్టిన రైతులు వైరస్ వ్యాప్తి లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చికెన్ అమ్మకాలు పుంజుకుంటేనే తాము నిలబడతామంటున్నారు.

రోజంతా ఆరోగ్యంగా, చలాకీగా ఉండేందుకు 30-30-30 నియమాన్ని అనుసరిస్తే మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు. వారి ప్రకారం.. నిద్రలేచిన 30 నిమిషాల్లోపు 30 గ్రాముల ప్రొటీన్ శరీరానికి అందేలా చూడాలి. అనంతరం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఉదయాన్నే ప్రొటీన్ తీసుకున్న కారణంగా విపరీత ఆకలి తగ్గుతుంది. ఇది బరువు తగ్గేందుకూ ఉపకరిస్తుంది. ఇక కనీసం అరగంట చేసే వ్యాయామంతో రోజు ఉల్లాసంగా గడుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఏపీ ఓపెన్ టెన్త్ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ నెల 17వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉ.9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు మనమిత్ర వాట్సాప్ నంబర్ లేదా స్టడీ కేంద్రాల ద్వారా హాల్‌టికెట్లు పొందవచ్చు. హాల్‌టికెట్ల కోసం ఇక్కడ <

* బెస్ట్ ఫిలిం- అమర్ సింగ్ చమ్కీలా
* బెస్ట్ ఫీమేల్ లీడింగ్ రోల్- కృతి సనన్(దో పత్తీ)
* బెస్ట్ మేల్ లీడింగ్ రోల్- విక్రాంత్ మాస్సే(సెక్టార్ 36)
* బెస్ట్ డైరెక్టర్- ఇంతియాజ్ అలీ(అమర్ సింగ్ చమ్కీలా)
* బెస్ట్ ఒరిజినల్ స్టోరీ(ఫిలిం)- కనికా ధిల్లాన్(దో పత్తీ)

మరికొన్ని గంటల్లో ఛాంపియన్స్ ట్రోఫీ మహా సంగ్రామానికి తెర లేవనుంది. మ.2.30 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. దీంతో భారత్ అదే జట్టుతో బరిలోకి దిగుతుందా? లేక ఏమైనా కీలక మార్పులుంటాయా? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. ‘NDTV’ ప్రకారం ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ 11 ఇది. రోహిత్, గిల్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, హార్దిక్, అక్షర్, జడేజా, కుల్దీప్/సుందర్, షమీ, వరుణ్.
దీనిపై మీరేమంటారు? కామెంట్ చేయండి.

టీమ్ ఇండియాపై పాక్ మాజీ ఆటగాడు జునైద్ ఖాన్ తీవ్ర ఆరోపణలు చేశారు. కొన్ని జట్లు నైపుణ్యంతో గెలిస్తే మరికొన్ని జట్లు మాత్రం షెడ్యూలింగ్‌తో గెలుస్తాయంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచుల కోసం న్యూజిలాండ్ 7150 కి.మీ, దక్షిణాఫ్రికా 3286 కి.మీ ప్రయాణించాయి. భారత్ ప్రయాణించిన దూరం సున్నా’ అని ట్వీట్ చేశారు. అతడి ట్వీట్‌పై భారత ఫ్యాన్స్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

TG: MLA కోటా MLC అభ్యర్థులపై CM రేవంత్ సహా ముఖ్య నేతలు ఇవాళ AICC పెద్దలతో ఫోన్‌లో చర్చించనున్నారు. అసెంబ్లీలో ఆ పార్టీకున్న బలాన్ని బట్టి 4 పదవులు దక్కొచ్చు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తమకో సీటు ఇవ్వాలని CPI పట్టుబడుతోంది. INCలోనే పోటీ తీవ్రంగా ఉండటంతో CPIకి ఇప్పుడే ఇవ్వాలా? లేక గవర్నర్ కోటాలో ఇద్దామా? అని ముఖ్య నేతలు సమాలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. దీనిపై రాత్రిలోపు క్లారిటీ రానుంది.
Sorry, no posts matched your criteria.