India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుమల అలిపిరి నడక మార్గంలో పాదాల మండపం వద్ద దివ్యదర్శనం టోకెన్ల జారీని త్వరలో పునః ప్రారంభిస్తామని టీటీడీ తెలిపింది. భక్తులకు ఆధార్ ప్రామాణికంగా సేవలందించేందుకు కేంద్రం ప్రాథమికంగా అనుమతి ఇచ్చిందని, త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై నోటిఫికేషన్ జారీ చేయనుందని ఈవో శ్యామలరావు తెలిపారు. ఆగస్టులో శ్రీవారిని 22.42లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని పేర్కొన్నారు.
వినాయక చవితి రోజున గణపతిని 21 రకాల పత్రిలతో పూజిస్తారు. మాచీ పత్రం (మాచిపత్రి), బృహతీ(ములక), బిల్వ(మారేడు), దూర్వ(గరిక), దత్తూర(ఉమ్మెత్త), బదరీ(రేగు), అపామార్గ(ఉత్తరేణి), తులసి, చూత(మామిడి), కరవీర(గన్నేరు), విష్ణుక్రాంత(శంఖపుష్పం), దాడిమీ(దానిమ్మ), దేవదారు, మరువక(ధవనం, మరువం), సింధువార(వావిలి), జాజి(జాజిమల్లి), గండకీ పత్రం(కామంచి), శమీ(జమ్మి), అశ్వత్థ(రావి), అర్జున(తెల్ల మద్ది), అర్క(జిల్లేడు).
AP: చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయక దేవస్థానంలో ఇవాళ్టి నుంచి 21 రోజులపాటు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నేడు కలెక్టర్ సుమిత్ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 8న ధ్వజారోహణం, 9న నెమలి వాహనం, 10న మూషిక, 11న శేష, 12న చిలుక, 13న గజ వాహనం, 14న రథోత్సవం, 16న ధ్వజావరోహణం ఉంటుంది. 17న నందివాహనం, 18న రావణ బ్రహ్మ, 20న విమానోత్సవం తదితర సేవలుంటాయి. 27న తెప్పోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.
TG: హైడ్రాను HMDA వరకు విస్తరించి, 3 జోన్లుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటి బాధ్యతలను SP స్థాయి అధికారులకు ఇవ్వనుంది. HYD పోలీస్ కమిషనరేట్‌ను సెంట్రల్ జోన్‌గా, రాచకొండ-సౌత్, సైబరాబాద్‌ను నార్త్ జోన్‌గా విభజించనుంది. హైడ్రాకు చట్టబద్ధతపై న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది. దీనిపై ఆర్డినెన్స్ జారీ చేయాలని, ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
AP: వరద సహాయ చర్యల కోసం 6 జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.67కోట్ల నిధులను విడుదల చేసింది. ఎన్టీఆర్ జిల్లాకు రూ.50కోట్లు, కృష్ణాకు రూ.5కోట్లు, అల్లూరి సీతారామరాజు జిల్లాకు రూ.2కోట్లు, పల్నాడుకు రూ.4కోట్లు, గుంటూరుకు రూ.2కోట్లు, ఏలూరుకు రూ.3కోట్లు, తూ.గో జిల్లాకు రూ.కోటి చొప్పున కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
TG: ఖమ్మం జిల్లాలోని వరద బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నేటి నుంచి పరిహారం అందజేయనుంది. అధికారులు 3 రోజులపాటు సర్వే నిర్వహించి జిల్లావ్యాప్తంగా బాధితులను గుర్తించారు. సుమారు 22వేల కుటుంబాలు బాధితులుగా గుర్తించినట్లు సమాచారం. సీఎం రేవంత్ ఇచ్చిన హామీ మేరకు వీరందరికీ రూ.10వేల చొప్పున ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ ప్రక్రియ 3 రోజుల్లో ముగియనుంది.
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాబోయే 3 రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, ఏలూరు జిల్లాల్లో భారీ వానలు పడే ఛాన్స్ ఉందంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడి, చైనాలో బీభత్సం సృష్టిస్తున్న ‘యాగి’ తుఫాన్ కారణంగా ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతోందని చెప్పింది. దీంతో కుండపోత వర్షాల ముప్పు తప్పిందని వివరించింది.
చవితి పూజలో ఎన్ని రకాల పుష్పాలు వాడినా పత్రిలో గరిక లేకపోతే వినాయకుడు లోటుగా భావిస్తాడని పూజారులు చెబుతున్నారు. పూర్వం అనలాసురుడు అనే రాక్షసుడు విపరీతమైన వేడి పుట్టించి దేవతల్ని ఇబ్బందులకు గురిచేశాడట. ఆ రాక్షసుడిని గణేశుడు మింగేయడంతో ఆయన శరీరం వేడిగా మారిందట. దీంతో రుషుల సూచనతో 21 గరిక పోచలను స్వామి తలపై పెట్టగా, వేడి తగ్గిపోయిందట. అందుకే పూజలో గరికకు ప్రాధాన్యం దక్కినట్లు చెబుతారు.
Jr.NTR ‘దేవర’ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈనెల 10న ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగనుందని, ఇందులో మూవీ టీమ్ అంతా పాల్గొంటారని సినీవర్గాలు తెలిపాయి. ట్రైలర్ నిడివి 2 నిమిషాల 45 సెకన్లు ఉంటుందని పేర్కొన్నాయి. దీనిపై మూవీ టీమ్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఈనెల 27న థియేటర్లలోకి రానుంది.
AP: విజయవాడ పరిధిలోని ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం రేపటి నుంచి ఇంటింటి ఆరోగ్య సర్వే చేపట్టనుంది. దీనికోసం ఓ యాప్‌ను సిద్ధం చేసింది. వరద వల్ల జ్వరాలు, జలుబు, దగ్గు, గాయాలు, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడిన వారి వివరాలను సేకరించనుంది. గత రెండు రోజుల్లో బాధితులకు 50వేలకు పైగా మెడికల్ కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపింది. గర్భిణుల వివరాలనూ సేకరించి సాయం చేస్తున్నట్లు పేర్కొంది.
Sorry, no posts matched your criteria.