India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఫ్యూచర్‌లో టీమ్‌ఇండియాకు ఆల్ ఫార్మాట్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ యువ ఆటగాళ్లలో ఇద్దరికే ఉందని దినేశ్ కార్తీక్ అభిప్రాయపడ్డారు. రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్‌కు ఆ సత్తా ఉందని, ఇప్పటికే IPLతో పాటు INDకి కొన్ని మ్యాచుల్లో వారిద్దరూ కెప్టెన్లుగా చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం టీ20లకు సూర్యకుమార్ కెప్టెన్‌గా ఉండగా, ODI, టెస్టుల్లో రోహిత్ శర్మ లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
TG: రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా 29 జిల్లాలను ప్రభుత్వం వరద బాధిత జిల్లాలుగా ప్రకటించింది. ఈ లిస్టులో సిరిసిల్ల, HYD, రంగారెడ్డి, మేడ్చల్ మినహా మిగతా అన్ని జిల్లాలున్నాయి. ఇప్పటికే 4 జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదల చేసినట్లు CS శాంతికుమారి తెలిపారు. మిగతా 25 జిల్లాలకు ₹3కోట్ల చొప్పున విడుదల చేస్తామని పేర్కొన్నారు. సహాయ, పునరావాస చర్యలపై ఎల్లుండి హై లెవెల్ మీటింగ్ నిర్వహిస్తామన్నారు.
TG: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేసే లెక్చరర్లకు డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా ప్రమోషన్లు కల్పించాలని విద్యాశాఖ నిర్ణయించింది. పీజీలో 55% మార్కులు, నెట్/స్లెట్/పీహెచ్ ఉన్నవారు అర్హులని, ఈనెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. జూనియర్ కాలేజీల్లో పనిచేసే లైబ్రేరియన్లు, ఫిజికల్ డైరెక్టర్లకూ పదోన్నతులు కల్పించనుంది. వారికి కూడా అప్లై చేసుకునే అవకాశాన్నిచ్చింది.
రాష్ట్రకూట, శాతవాహన, చాళుక్యుల కాలం నుంచి గణేశ్ చతుర్థిని జరుపుకుంటున్నారు. ఆ తర్వాత ఛత్రపతి శివాజీ గణేశ్ చతుర్థిని జరిపించారు. తర్వాత పీష్వా రాజవంశం దీనిని కొనసాగించింది. 1893లో పుణేలో తొలిసారి బహిరంగంగా గణేశ్ ఉత్సవాలు మొదలెట్టారు. జాతీయోద్యమంలో హిందువులందరినీ ఏకతాటిపైకి తేవడానికి బాలగంగాధర్ తిలక్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఆ తర్వాత నుంచి దేశమంతటా ఈ వేడుకలు జరుపుకుంటున్నారు.
వినాయక చవితి రోజున ప్రసాదం అంటే కుడుములు, ఉండ్రాళ్లే చేస్తాం. దానికో కారణముందంటారు పెద్దలు. ఈ దక్షిణాయన కాలంలో మన జీవక్రియ నెమ్మదిగా ఉంటుంది. అరుగుదల, ఆకలి రెండూ పెద్దగా ఉండవు. ఈ నేపథ్యంలో బియ్యప్పిండితో ఆవిరిమీద చేసిన వంటకాలు తేలిగ్గా అరగడమే కాక శరీరానికి ఆరోగ్యాన్ని, శక్తిని కూడా అందిస్తాయి. అందుకే చవితి నాడు కుడుములు, ఉండ్రాళ్ల వంటివాటిని వండుకుంటామనేది పెద్దల మాట.
తరిగిన లేదా ఒలిచిన ఉల్లిపాయను ఫ్రిడ్జ్‌లో ఉంచడం ప్రమాదకరం. ఎందుకంటే ఇది బ్యాక్టీరియా వృద్ధికి కారణమవుతుంది. తద్వారా ఫ్రిడ్జ్‌లోని ఇతర పదార్థాలకు బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. ఇది రకరకాల అనారోగ్యాలకు దారి తీస్తుంది. కట్ చేసిన ఉల్లిపాయను ఫ్రిడ్జ్‌లో పెడితే చేదుగా మారి టేస్ట్ పోతుంది. అందుకే అప్పటికప్పుడు కట్ చేసిన తాజా ఉల్లిపాయలను మాత్రమే వంటకాల్లో వాడటం ఉత్తమం.
> SHARE
AP: తెలుగు ప్రజలకు CM చంద్రబాబు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ‘తొలి పూజ అందుకునే ఆ గణనాథుడు అందరికి శుభం కలిగించాలని కోరుకుంటున్నాను. వీధులన్నీ చవితి పందిళ్లతో కళకళలాడాల్సిన సమయంలో వరదలు విజయవాడ ప్రజలను తీవ్ర కష్టాల పాలుచేశాయి. వారి బాధలు తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. రానున్న రోజుల్లో రాష్ట్రానికి ఎలాంటి విపత్తులు రాకుండా చూడాలని గణపతిని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.
‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈనెల మధ్య నుంచి కేరళలో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. దాదాపు నెలన్నర రోజులకు పైగా ఫైట్స్‌తో పాటు సాంగ్స్ షూట్ చేయనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. దసరా పండుగకు టైటిల్‌ను అనౌన్స్ చేస్తారని టాక్. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్నారు.
ఏ పనిలోనైనా ముందు పూజ వినాయకుడికేనన్నది సంప్రదాయం. అటు హైందవ సంప్రదాయంలో పసుపునకు ఉన్న విశిష్టత అంతాఇంతా కాదు. అందుకే గణేశ చవితిరోజున పసుపుతో చేసిన వరసిద్ధి వినాయకుడిని కొలుచుకుంటుంటాం. సహజంగా యాంటీ ఫంగల్ అయిన పసుపుతో చేసిన వినాయకుడి నిమజ్జనం తర్వాత చెరువుల్లోని రోగకారకాలు అంతమవుతాయని శాస్త్రీయ వివరణ. అమ్మవారు బుజ్జి గణపతిని తొలుత పసుపు-నలుగుతోనే తయారుచేశారనేది పురాణ ప్రాశస్త్యం.
తేది: సెప్టెంబర్ 07, శనివారం
ఫజర్: తెల్లవారుజామున 4:50 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:03 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:14 గంటలకు
అసర్: సాయంత్రం 4:39 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:25 గంటలకు
ఇష: రాత్రి 7.38 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Sorry, no posts matched your criteria.