News September 2, 2024

రేపు భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులపై CS ఆదేశాలు

image

TG: రేపు 11 జిల్లాల్లో భారీ వర్షాలుంటాయన్న హెచ్చరికల నేపథ్యంలో స్థానిక పరిస్థితులను బట్టి కలెక్టర్లే విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని CS శాంతికుమారి ఆదేశించారు. స్వర్ణ, కడెం ప్రాజెక్టుల గేట్లను తెరవడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. కాగా ADB, జగిత్యాల, కామారెడ్డి, ASF, MDK, మేడ్చల్, నిర్మల్, NZB, పెద్దపల్లి, సంగారెడ్డి, SDP జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

News September 2, 2024

‘బుల్డోజర్ బాబా’- ‘బుల్డోజర్ మామ’ ఎవరో తెలుసా?

image

క్రిమిన‌ల్ కేసుల్లో నిందితులుగా ఉన్నవారి స్థిరాస్తుల‌ను బుల్డోజ‌ర్ల‌తో కూల్చే చర్యలకు UP CM యోగీ 2017లో శ్రీకారం చుట్టారు. ఈ సంస్కృతి రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు విస్త‌రించింది. దీంతో యోగీని బుల్డోజర్ బాబా అని, అప్పటి MP CM శివరాజ్ సింగ్‌ను బుల్డోజ‌ర్ మామ అంటూ విప‌క్షాలు విమ‌ర్శించాయి. ఈ కూల్చివేతలు దేశంలో చర్చనీయాంశం కావడంతో SCలో పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా కోర్టు ఈ చర్యలను తప్పుబట్టింది.

News September 2, 2024

రజినీ ‘కూలీ’ నుంచి మరో అప్డేట్

image

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘కూలీ’. తాజాగా చిత్ర యూనిట్ మరో అప్డేట్ ఇచ్చింది. ఇందులో రజినీ పాత్ర పేరును ‘దేవ’గా పేర్కొంది. చేతిలో కూలీ నంబర్‌తో ఉన్న ఫొటోను షేర్ చేసింది. కాగా ఈ సినిమాలో నాగార్జున, సత్యరాజ్, ఉపేంద్ర తదితరుల పాత్రలను ఇప్పటికే రివీల్ చేసిన సంగతి తెలిసిందే.

News September 2, 2024

కాలేజీలో చేరిన స్టార్ హీరో మనుమరాలు.. అడ్మిషన్‌పై వివాదం

image

బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బ‌చ్చ‌న్ మనుమరాలు న‌వ్యా నంద ప్ర‌తిష్ఠాత్మ‌క‌ అహ్మ‌దాబాద్ IIMలో చేరారు. రెండేళ్ల‌ బ్లెండెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ (BPGP) క్లాస్ ఆఫ్-2026లో అడ్మిష‌న్ తీసుకున్నారు. దీంతో ఆమె క్యాట్ రాశారా? లేక సెల‌బ్రిటీ స్టేట‌స్ కింద అడ్మిష‌న్ ఇచ్చారా? అంటూ పలువురు నెటిజన్లు ప్ర‌శ్నిస్తున్నారు. న‌వ్యాకు ఉన్న CVతో క్యాట్ అవ‌స‌రం లేదని Pro.అగ‌ర్వాల్ ట్వీట్ చేశారు.

News September 2, 2024

ప్రజలు తమను తాము రక్షించుకుంటే ఇక ప్రభుత్వం ఎందుకు?: KTR

image

వరద బాధితులను రక్షించేందుకు తెలంగాణ సర్కార్ శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌పై KTR ఘాటుగా స్పందించారు. ‘సహాయక చర్యల్లో కాంగ్రెస్ విఫలమైంది. రోజురోజుకూ ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం పోతోంది. ప్రజలు తమను తాము రక్షించుకుని దేవుడిని ప్రార్థించవలసి వస్తే ప్రభుత్వం ఉండి ఏం లాభం? ఈ వ్యవస్థీకృత వైఫల్యానికి నైతిక బాధ్యత కాంగ్రెస్‌దే’ అని ఫైరయ్యారు.

News September 2, 2024

వరద బాధితులకు రూ.10 వేల తక్షణ సాయం: CM

image

TG: ఖమ్మంలో వరదలు బాధాకరమైన సందర్భమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇళ్లు దెబ్బతిన్నవారికి తక్షణ సాయంగా రూ.10 వేలు ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన మాట్లాడారు. నష్టంపై అధికారులు అంచనా వేసి నివేదికలు ఇస్తే అనుగుణంగా పరిహారం ఇస్తామని చెప్పారు. సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి కొత్తవి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

News September 2, 2024

మరో రెండు జిల్లాల్లో రేపు సెలవు ప్రకటన

image

AP: భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలోని మరో రెండు జిల్లాల్లోని స్కూళ్లకు రేపు సెలవు ప్రకటించారు. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు మంగళవారం సెలవు ఇస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇప్పటికే గుంటూరు జిల్లాలో <<14002872>>సెలవు<<>> ఇచ్చిన విషయం తెలిసిందే.

News September 2, 2024

BRS విజన్‌తోనే మరింత మెరుగ్గా హైదరాబాద్‌: KTR

image

భారీ వర్షాలకు సైతం హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలు ముంపునకు గురికాలేదనే వార్త వినేందుకు ఆనందంగా ఉందని కేటీఆర్ అన్నారు. దీనికి కారణం SNDP అని ఆయన పేర్కొన్నారు. ‘BRS విజన్‌ను ఆచరణలోకి తీసుకొచ్చేందుకు ఇంజినీర్ల బృందం, అన్ని విభాగాలు కలిసికట్టుగా శ్రమించాయి. మీ అంకితభావం వల్లే ఈరోజు హైదరాబాద్ మరింత మెరుగ్గా ఉంది. నాతో నిలబడి ఈ నగరాన్ని ప్రగతికి నమూనాగా మార్చినందుకు ధన్యవాదాలు’ అని KTR ట్వీట్ చేశారు.

News September 2, 2024

హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్: మహేశ్‌బాబు

image

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఆయనకు విషెస్ తెలిపారు. ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్. మీ ప్రయాణం ఇతరులకు స్ఫూర్తినిస్తూ, ప్రజలను ఉద్ధరించే విధంగా కొనసాగుతూ ఉండాలి. మీరు ఆనందంగా మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.

News September 2, 2024

ALERT.. బయటకు రావొద్దు: GHMC

image

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో GHMC అప్రమత్తమైంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించింది. నాలాలు, చెరువులు, లోతట్టు ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా ఉండాలని హెచ్చరించింది. వాహనదారులు, పాదచారులు రోడ్లపై వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని కోరింది.