India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించనున్నారు. ఉ.11 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి మ.2 గంటలకు పాలకొండకు చేరుకుంటారు. ఇటీవల మరణించిన వైసీపీ సీనియర్ నేత పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శిస్తారు. ఆయన కుమారుడు, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌కు ధైర్యం చెబుతారు. సాయంత్రానికి తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.

TG: పీఎం కిసాన్ 19వ విడత కింద ఈనెల 24న రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నగదు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. బిహార్‌లోని భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నిధులు రిలీజ్ చేయనున్నారు. E-KYC పూర్తి చేసిన వారికి మాత్రమే డబ్బులు అందుతాయి. ఈ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుందని అధికారులు తెలిపారు. కేంద్రం 2018 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తోంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో నిన్న జరిగిన PAKvNZ మ్యాచ్‌లో బాబర్ ఆజమ్ ఆటతీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పాక్ ఎదుట 321 పరుగుల లక్ష్యం ఉండగా బాబర్ 90 బంతులాడి 64 పరుగులు చేశారు. ఆ ఇన్నింగ్స్ ఇతర ఆటగాళ్లపై ఒత్తిడి పెంచి చివరికి జట్టు ఓటమికి కారణమైందంటూ పాక్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ మండిపడుతున్నారు. ఇటు భారత నెటిజన్లు బాబర్‌పై జోకులు పేలుస్తున్నారు.

ఎన్టీఆర్ బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ఎన్టీఆర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు సమాచారం. హృతిక్‌తో కలిసి తారక్ ఓ పాటకు డాన్స్ వేశారని, సినిమాకు అది హైలైట్‌గా ఉంటుందని బీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి. నేటి నుంచి ప్రశాంత్ నీల్ సినిమా షూట్‌లోకి తారక్ ఎంటర్ కానున్నారని సమాచారం. ఈ ఏడాది ఆగస్టు 15న ‘వార్ 2’ విడుదలయ్యే అవకాశం ఉంది.

AP: CM చంద్రబాబు నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఉ.9 గంటలకు కేంద్ర జల్ శక్తి మంత్రి CR పాటిల్‌తో సమావేశమై పోలవరానికి ఆర్థిక సాయంపై చర్చిస్తారు. 11 గంటలకు ఢిల్లీ CM రేఖా గుప్తా ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయి పలు అంశాలపై మాట్లాడతారు. అనంతరం కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శిని కలిసి మిర్చి రైతుల సమస్యలను వివరిస్తారు. రాత్రికి అమరావతికి తిరిగొస్తారు.

TG: ప్రభుత్వం వచ్చే నెల 1 నుంచి 5వ తేదీ వరకు ప్రత్యేక అసెంబ్లీ సెషన్లను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్లపై 3 బిల్లుల్ని ప్రవేశపెట్టేందుకు ఈ సెషన్లు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అధికారులు ముసాయిదాల రూపకల్పనలో ఉన్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆ పని పూర్తి కాగానే మంత్రివర్గం వాటిపై చర్చించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

TG: రంగారెడ్డి జిల్లా కన్హాశాంతివనంలో నేటి నుంచి జీవవైవిధ్య జాతీయ సదస్సు ప్రారంభం కానుంది. రాష్ట్ర పర్యావరణ మంత్రి కొండా సురేఖ సదస్సును ప్రారంభిస్తారు. 3రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి విద్యార్థులు, న్యాయశాస్త్ర పట్టభద్రులు హాజరుకానున్నారు. సదస్సు ముగింపు రోజున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

‘పుష్ప-2’తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్‌గా ఎస్టాబ్లిష్ అయ్యారు. తాజాగా ఆయన మరో ఘనత సాధించారు. సినీవర్గాలు ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘ది హాలీవుడ్ రిపోర్టర్’ మ్యాగజైన్ కవర్ పేజీపై స్థానం దక్కించుకున్నారు. నటుడిగా తనకు 5.5 రేటింగ్ మాత్రమే ఇచ్చుకుంటానని మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూలో బన్నీ చెప్పడం ఆసక్తికరం. కాగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మైథలాజికల్ సినిమా చేసేందుకు ఆయన ఓకే చెప్పినట్లు సమాచారం.

తెలుగు రాష్ట్రాలకు కృష్ణాజలాల పంపిణీలో ఈ సీజన్‌కు ఎటువంటి మార్పూ లేదని కృష్ణానదీ యాజమాన్య బోర్డు(KRMB) తేల్చిచెప్పింది. ఈ నెల 21న నిర్వహించిన సమావేశం తాలూకు వివరాల్ని ఇరు రాష్ట్రాలకు పంపించింది. జలాల్ని 66:34 రేషియోలో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 298 టీఎంసీలు పంచనున్నట్లు స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్-జులై వరకు ఏపీకి 27.03 టీఎంసీలు, తెలంగాణకు 131.75 టీఎంసీ జలాలు మిగిలి ఉన్నట్లు పేర్కొంది.

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం విపత్తు సాయాన్ని విడుదల చేసింది. ఏపీకి రూ.608.08 కోట్లు, తెలంగాణకు రూ.231.75 కోట్లను ఇచ్చింది. మొత్తంగా ఐదు రాష్ట్రాలకు నిధుల్ని విడుదల చేసింది. వాటిలో త్రిపుర(రూ.288.93 కోట్లు), ఒడిశా(రూ.255.24 కోట్లు), నాగాలాండ్(రూ.170.99 కోట్లు) ఉన్నాయి. ఈ సాయంపై కేంద్రమంత్రి బండి సంజయ్ ట్విటర్లో హర్షం వ్యక్తం చేశారు.
Sorry, no posts matched your criteria.