India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: తిరుమల శ్రీవారి లడ్డూలో ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో నలుగురు నిందితులకు కోర్టు విధించిన 5 రోజుల కస్టడీ ముగిసింది. సిట్ తాత్కాలిక కార్యాలయంలో వారి విచారణ జరగ్గా, ఇవాళ రుయా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం తిరుపతి 2వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపర్చారు. నిందితులు విచారణకు సహకరించట్లేదని, మరికొన్ని రోజులు కస్టడీ పొడిగించాలని సిట్ అధికారులు కోరినట్లు సమాచారం.

కుంభమేళా వేళ గంగా నదిలో నీటి నాణ్యతపై పొల్యూషన్ కంట్రోల్ అధికారులు ఆందోళన రేకెత్తించే అంశాలను వెల్లడించారు. ఈ నీళ్లలో చర్మానికి హానిచేసే కోలిఫామ్ బ్యాక్టీరియా పెరిగిందని నివేదికలో పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లోని నీరు స్నానం చేయడానికి పనికిరాదని NGTకి తెలిపింది. ప్రతి 100mm నీటిలో 2,500 కోలిఫామ్ బ్యాక్టీరియా ఉంటే స్నానం చేయవచ్చని CPCB చెబుతోంది. కాగా దీనిపై విచారణను NGT రేపటికి వాయిదా వేసింది.

AP: రాష్ట్ర అవసరాలు, విభజన హామీలు సాధించుకోవడానికి ఇదే సరైన సమయమని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. పవన్ తలుచుకుంటే ఇది సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే విషయమై పవన్‌కు లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. విభజన హామీలో రాష్ట్రానికి రూ.75,050 కోట్లు రావాలని, దీనిపై పార్లమెంటులో ప్రస్తావించాలని కోరినట్లు వెల్లడించారు. జగన్, చంద్రబాబు సాధించలేని విభజన హామీలు పవన్ సాధించాలని సూచించారు.

AP: రాష్ట్రానికి ఆక్వా రంగం గ్రోత్ ఇంజిన్ కావాలని CM చంద్రబాబు అన్నారు. టెక్నాలజీ వినియోగంతో 30% వృద్ధి సాధ్యమే అని చెప్పారు. ప్రకృతి సాగు ఆక్వా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని తెలిపారు. సీడ్, ఫీడ్‌లో జాగ్రత్తలు తీసుకుంటూ యాంటీబయాటిక్స్ తగ్గించాలని సూచించారు. 10లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు లక్ష్యం దిశగా రైతులను ప్రోత్సహిస్తామని GFST ఆక్వాటెక్ 2.0 కాన్‌క్లేవ్‌లో CM వెల్లడించారు.

దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) ప్రత్యేక వర్క్ వీసాలను దుర్వినియోగం చేసిందని ఆ సంస్థ మాజీ ఉద్యోగులు ఆరోపించారు. ఫ్రంట్ లైన్ వర్కర్లను US తీసుకెళ్లడానికి వారిని మేనేజర్లుగా చూపిస్తూ L-1A వీసాలను వాడుకుందని చెప్పారు. ఈ మేరకు అనిల్ కిని, మరో ఇద్దరు TCS మాజీ ఉద్యోగులు వ్యాజ్యాలు సైతం దాఖలు చేశారు. ఈ ఆరోపణలను ఖండించిన TCS తమ కంపెనీ US చట్టాలకు కట్టుబడి పని చేస్తుందని వెల్లడించింది.

థియేటర్లు-
* రామం రాఘవం- feb 21
* బాపు- feb 21
* డ్రాగన్- feb 21
* జాబిలమ్మ నీకు అంత కోపమా- feb 21
* నెట్‌ఫ్లిక్స్- 1. డాకు మహారాజ్- feb 21 2. జీరో డే- feb 20
* జీ5- క్రైమ్ బీట్(వెబ్ సిరీస్)- feb 21
* జియో హాట్ స్టార్- 1. ది వైట్ లోటస్(వెబ్ సిరీస్)- feb 17 2. ఊప్స్ అబ్ క్యా(హిందీ)- feb 20 3. ఆఫీస్(తమిళ్)- feb 21

సూపర్ స్టార్ రజినీకాంత్ ‘జైలర్’ సినిమాలోని ‘కావాలయ్యా’ సాంగ్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అలాంటిదే మరో సాంగ్ రాబోతుందని సినీవర్గాలు తెలిపాయి. లోకేశ్ కనగరాజ్- రజినీ కాంబోలో వస్తోన్న ‘కూలీ’ మూవీలో ‘కావాలయ్యా’ లాంటి స్పెషల్ సాంగ్ ఉంటుందని సమాచారం. అయితే, ఇందులో తమన్నాకు బదులు బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించనున్నట్లు తెలుస్తోంది.

FY25 Q3లో భారత పట్టణ నిరుద్యోగ రేటు 6.4% వద్ద యథాతథంగా ఉంది. మహిళల నిరుద్యోగ రేటు 8.4 నుంచి 8.1కి తగ్గగా పురుషులది 5.7 నుంచి 5.8కు పెరిగింది. గత త్రైమాసికంలో 5.4%కు తగ్గిన ఎకానమీ గ్రోత్ ప్రస్తుతం పుంజుకున్నప్పటికీ నిరుద్యోగ రేటులో మార్పేమీ లేకపోవడం గమనార్హం. ఇక లేబర్ ఫోర్స్‌లో స్త్రీల భాగస్వామ్యం తగ్గినట్టు పీరియాడిక్ లేబర్ సర్వే పేర్కొంది. రెగ్యులర్‌గా శాలరీ పొందుతున్న వర్క్‌ఫోర్స్ 49.4%గా ఉంది.

CT-2025కి ముందు BCCI భారత ప్లేయర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. BGT ఓటమి తర్వాత కుటుంబ సభ్యులను విదేశాలకు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని ఆటగాళ్లకు విధించిన షరతును సవరించింది. దుబాయ్‌లో రేపటి నుంచి జరగనున్న CTకి కుటుంబ సభ్యులను తీసుకెళ్లొచ్చని తెలిపింది. అయితే ఒక మ్యాచ్ వరకే పరిమితం అని కండీషన్ పెట్టింది. ఇందుకు ముందుగానే BCCI అనుమతి పొందాలని, వారి ఖర్చులను ప్లేయర్లే భరించాలని స్పష్టం చేసింది.

చిలగడదుంప/ స్వీట్ పొటాటోలో పుష్కలంగా పోషకాలుంటాయని మీకు తెలుసా? శివరాత్రి సమీపిస్తుండటంతో ప్రస్తుతం రోడ్లపై ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. ఉడకబెట్టిన చిలగడదుంపను తినడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ A లభిస్తుందని న్యూట్రీషన్లు చెబుతున్నారు. ఇందులో బీటా-కెరోటిన్ ఉండటం వల్ల కంటిచూపు, రోగనిరోధక వ్యవస్థ, గుండె& లంగ్స్ పనితీరును మెరుగుపరుస్తుంది. రోజూ దీనిని తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.