India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తమ కోసమే బతుకును ధారపోసిన తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలోకి వచ్చేసరికి భారంగా భావిస్తున్నారు వారసులు. ఆస్తులు కావాలి కానీ వారి బాధ్యత మాత్రం వద్దన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. వృద్ధాప్య గృహాలకు తరలించడం, నడిరోడ్డుపై వదిలేయడం వంటివి చేస్తున్నారు. నాలుగు మెతుకులు, తలదాచుకునే నీడ, ఒంట్లో ఎలా ఉంది అన్న ప్రేమపూరిత స్పర్శ.. ఇవేగా ఆ పండుటాకులు కోరుకునేది. అది కూడా చేయలేమా! నేడు వృద్ధుల దినోత్సవం.
ఒలింపిక్ మెడల్స్‌తో దేశవ్యాప్తంగా స్టార్ అయ్యారు షూటర్ మనూ భాకర్. స్కూల్లో చదువుకునే రోజుల్లో సాధన చేస్తున్న ఫొటోను, ఒలింపిక్స్‌లో పతకం గెలుచుకున్న ఫొటోను పోలుస్తూ తాజాగా ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. ‘ఎలా మొదలైంది వెర్సస్ ఎలా కొనసాగుతోంది. ఈ ప్రయాణం పట్ల చాలా కృతజ్ఞతగా ఉన్నాను’ అని పేర్కొన్నారు. ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో మెడల్ గెలిచిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
వర్షాకాలంలో పిడుగుపాటుకు ఎంతోమంది బలవుతున్నారు. ఈ నేపథ్యంలో పిడుగుల్ని తప్పించుకునేందుకు కొన్ని వాతావరణ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ‘పిడుగులు ఎక్కువగా చెట్లు, ఎత్తైన ప్రాంతాలపై పడుతుంటాయి. ఉరుముతున్న సమయంలో బయటికి రాకుండా ఉండటం మేలు. వచ్చినా చెట్లు, టవర్లు, విద్యుత్ పరికరాలు, ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఫోన్ మాట్లాడకూడదు. ఇంట్లోనూ ఎలక్ట్రానిక్ పరికరాలను ఆపేయడం మంచిది’ అని సూచిస్తున్నారు.
ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్ మరోసారి తండ్రి కాబోతున్నారు. ఆయన సతీమణి బెకీ బోస్టన్ ఈ విషయాన్ని ప్రకటించారు. 2020లో ఈ జంటకు నిశ్చితార్థమైంది. 2021లో ఆల్బీ అనే కుమారుడు జన్మించిన అనంతరం 2022 ఆగస్టులో పెళ్లి చేసుకున్నారు. ‘ఈ వార్త చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. మా జీవితాల్లోకి మరింత క్రేజీనెస్ తీసుకొచ్చేందుకు మరో బేబీ రానుంది’ అని ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
TG: అమర రాజా కంపెనీ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. MBNRలోని దివిటిపల్లిలో లిథియం-అయాన్ బ్యాటరీ ప్లాంట్ వచ్చే ఆరేళ్లలో పూర్తి చేయాలన్నారు. ప్లాంట్ నుంచి జాతీయ రహదారి వరకు 3KMల అప్రోచ్ రోడ్డుకు భూసేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. రూ.9,500 కోట్ల ఈ ప్రాజెక్ట్ మొదటి దశ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం ఉత్పత్తి జరుగుతోంది.
32 ఏళ్ల నాటి కేసులో ఆరుగురు అత్యాచార నిందితులకు ఎట్టకేలకు కోర్టు శిక్ష విధించింది. 1992లో అజ్మీర్‌లో 100మందికి పైగా బాలికల్ని ఓ ముఠా రేప్ చేసిన దారుణ ఘటన అది. బాలికలతో స్నేహం చేసిన నిందితులు, వారిని అశ్లీలంగా ఫొటోలు తీసి బెదిరించి అనంతరం అత్యాచారానికి ఒడిగట్టారు. కేసులో మొత్తం 18మంది నిందితులుండగా ప్రస్తుతం ఆరుగురికి యావజ్జీవ శిక్ష పడింది. దీన్నే అజ్మీర్ సెక్స్ స్కాండల్‌గా వ్యవహరిస్తారు.
అవును, ఆకాశంలో నదులు ఉంటాయి. వాటిని అట్మాస్ఫిరిక్ రివర్స్/ఫ్లయింగ్ రివర్స్ అంటారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా వాతావరణంలో తేమ గణనీయంగా పెరిగి ఈ నదులు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మహాసముద్రాల్లోని నీరు వేడెక్కినా భారీ మొత్తంలో నీరు ఆవిరిగా మారి, ఆకాశంలో కంటికి కనిపించని నీటి ఆవిరిగా పాయలుగా ఏర్పడుతాయి. ‘నేచర్ జర్నల్ 2023’ ప్రకారం 1951-2020 మధ్య ఇండియాలో 574 ఆకాశ నదులు ఏర్పడ్డాయి.
భారత క్రికెటర్ విరాట్ కోహ్లీకి సామాన్యులే కాక క్రికెటర్లలోనూ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. తాను వారిలో ఒకరినంటున్నారు న్యూజిలాండ్ దేేశవాళీ క్రికెటర్ జారా జెట్లీ. కోహ్లీతో సెల్ఫీ దిగాలనేది తన జీవితాశయమని ఆమె ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. ‘విరాట్‌కు బౌలింగ్ చేయాలి. తనతో సెల్ఫీ దిగి ఇన్‌స్టాలో పోస్ట్ చేయాలి. ఇవే నా లక్ష్యాలు’ అని పేర్కొన్నారు. విరాట్ ఫ్యాన్స్ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.
జపాన్‌లోని హక్కైడో విమానాశ్రయంలో కత్తెర పోవడంతో 36 విమానాలు రద్దు, 201 విమానాలు ఆలస్యమయ్యాయి. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బోర్డింగ్ గేట్ సమీపంలో ఉన్న ఓ దుకాణంలో కత్తెర మాయమైంది. దీంతో భద్రత దృష్ట్యా సిబ్బంది రోజంతా కత్తెర కోసం వెతికారు. ఫలితంగా వేలాది మంది ప్రయాణికులతో చెకింగ్ పాయింట్ల వద్ద భారీ క్యూలు ఏర్పడ్డాయి. అయితే ఆ కత్తెర అదే దుకాణంలో దొరకడం కొసమెరుపు.
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Sorry, no posts matched your criteria.