India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ఫార్ములా-ఈ రేస్ నిర్వహణ కంపెనీ ఎఫ్‌ఈవో సీఈవోను ఏసీబీ అధికారులు వర్చువల్‌గా విచారించారు. రేస్ అగ్రిమెంట్లు, డబ్బు చెల్లింపులపై ప్రశ్నించారు. ఇదే కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌ను ఇప్పటికే ఏసీబీ విచారించింది.

సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ జేపీ డుమిని తన భార్య స్యూ నుంచి విడాకులు తీసుకున్నట్లు తెలిపారు. 14 ఏళ్ల వివాహ బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అన్నీ ఆలోచించాకే తామిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా డుమినీ దక్షిణాఫ్రికా తరఫున 46 టెస్టులు, 199 వన్డేలు, 81 టీ20లకు ప్రాతినిధ్యం వహించారు. 83 IPL మ్యాచ్‌లు కూడా ఆడారు.

దేశవ్యాప్తంగా 20 స్కూళ్ల నిర్మాణానికి రూ.2000CR ఇస్తామని అదానీ గ్రూప్ ప్రకటించింది. ప్రైవేటు K-12 ఎడ్యుకేషన్లో గ్లోబల్ లీడరైన GEMS ఎడ్యుకేషన్ సంస్థను ఇందుకు భాగస్వామిగా ఎంచుకున్నట్టు తెలిపింది. చిన్న కొడుకు జీత్ పెళ్లి సందర్భంగా గౌతమ్ అదానీ రూ.10,000CR విరాళం ప్రకటించడం తెలిసిందే. అందులో రూ.6000CR ఆస్పత్రుల నిర్మాణం, రూ.2000CR స్కిల్ డెవలప్‌మెంటుకు కేటాయించారు. మిగిలింది స్కూళ్లకు వినియోగిస్తారు.

AP: మాజీ MLA వంశీని 10రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు, బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు లాయర్లు వేసిన పిటిషన్లపై విజయవాడ SC, ST ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టింది. వాదనలు విని వాటి విచారణను రేపటికి వాయిదా వేసింది. అలాగే వంశీకి ఇంటి నుంచి ఫుడ్ అందించాలన్న పిటిషన్‌నూ విచారించి ఇరుపక్షాలకు నోటీసులిచ్చింది. అటు గన్నవరం TDP ఆఫీసుపై దాడి కేసు ఫిర్యాదుదారైన సత్యవర్ధన్‌ను కోర్టుకు తెచ్చి వాంగ్మూలం నమోదు చేశారు.

TG: హైదరాబాద్‌లో కమ్యూనిటీ భవనాలకు భూకేటాయింపులపై హైకోర్టులో విచారణ జరిగింది. బలిజ, కాపు, వెలమ, కమ్మ సంఘాలకు సర్కారు భూములు కేటాయించడాన్ని హైకోర్టులో పిటిషనర్ సవాల్ చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

AP: వచ్చే నెల 14న పిఠాపురంలో జనసేన ప్లీనరీ నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ తెలిపింది. ఈ సందర్భంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. దీనికి డిప్యూటీ సీఎం, పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరవుతారని వెల్లడించింది. ఎన్నికల తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులను కోరింది.

TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఉచితంగా ఇసుక ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 24 గంటల పాటు స్లాట్ బుకింగ్ సదుపాయం ఉంటుందని మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ తెలిపారు. అటు ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. అక్రమ రవాణాపై 9848094373, 7093914343 నంబర్లకు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

మూగ జీవాల పేరుతో కొన్ని సామెతలు వాడుతుంటాం. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడి, కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయ్, పాండ్స్ పౌడర్ వాసన పందికేమి తెలుసు? అంటూ వివిధ సందర్భాల్లో వీటిని వాడుతుంటాం. ఈ సామెతలను జంతువులు వింటే ఎలా ఫీల్ అవుతాయి? అలాంటి ఆలోచనతోనే మీమర్స్ కొన్ని ఫన్నీ పోస్టులు క్రియేట్ చేశారు. అవేంటో పై ఫొటోల్లో మీరూ చూసేయండి.

ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగే IND జట్టును ESPNcricinfo అంచనా వేసింది. షమీ, అర్ష్‌దీప్ బౌలింగ్ దళాన్ని నడిపిస్తారని పేర్కొంది. ఆల్‌రౌండర్లు హార్దిక్, అక్షర్, జడేజాలను రోహిత్ తుది జట్టులోకి తీసుకుంటారని తెలిపింది. 19న CT ప్రారంభం కానుండగా, IND తొలి మ్యాచ్ 20న BANతో ఆడనుంది.
జట్టు: రోహిత్ (C), గిల్, కోహ్లీ, శ్రేయస్, రాహుల్, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్దీప్, అర్ష్‌దీప్, షమీ. ఈ జట్టుపై మీ COMMENT.

ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్ కరాచీ స్టేడియంలో భారతదేశ <<15488827>>జాతీయ పతాకం<<>> ప్రదర్శించకపోవడంతో దుమారం రేగిన విషయం తెలిసిందే. దీనిపై ఆ దేశ క్రికెట్ బోర్డ్ PCB స్పందించింది. పాక్‌లో భారత్ మ్యాచ్‌లు ఆడట్లేదని, అక్కడి మైదానాల్లో ఆడే జట్ల జెండాలనే ఎగరేసినట్లు వెల్లడించింది. పాక్‌లో ఆడేందుకు BCCI నిరాకరించడంతో హైబ్రిడ్ విధానంలో లీగ్ జరుగుతోంది. భారత్ తన మ్యాచులన్నీ దుబాయ్‌లో ఆడనుంది.
Sorry, no posts matched your criteria.