India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రధాని మోదీ తన నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు. దీనికి కేంద్రమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తదితరులు హాజరయ్యారు. ఈ భేటీలో కొత్త చీఫ్ ఎలక్షన్ కమిషనర్(CEC) నియామకంపై నిర్ణయం తీసుకోనున్నారు. రేపటితో CEC రాజీవ్ కుమార్ పదవీకాలం ముగియనుంది.

IPLలో అత్యధిక ఓపెనింగ్ మ్యాచులు ఆడిన రికార్డు చెన్నై సూపర్ కింగ్స్ పేరిట ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు 9 సార్లు టోర్నీ ఓపెనింగ్ మ్యాచుల్లో బరిలోకి దిగింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్ (8) నిలిచింది. మూడు నాలుగు స్థానాల్లో కేకేఆర్ (7), ఆర్సీబీ (5) ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచులు ఆడకపోవడం గమనార్హం.

తెలుగు అమ్మాయిలను ఎంకరేజ్ చేయబోమన్న నిర్మాత <<15485932>>ఎస్కేఎన్‌పై<<>> హీరోయిన్ రేఖా భోజ్ ఫైర్ అయ్యారు. ‘ఇప్పుడేదో తెగ ఆఫర్లిస్తున్నట్లు.. ప్రతివాడు పెద్ద ఉద్దరించేసినట్లు ఎదవ బిల్డప్పులు. ఒక రకంగా ఇది తెలుగు అమ్మాయిలపై అఫీషియల్‌గా బ్యాన్ విధించినట్టే.. మా బతుకుదెరువుపై కొట్టేలా మాట్లాడాక మీకు గౌరవం ఇచ్చేదేంటి?’ అని మండిపడ్డారు. రేఖా భోజ్ మాంగళ్యం, దామిని విల్లా, రంగీలా వంటి చిత్రాల్లో నటించారు.

పెళ్లయిన 8 ఏళ్లకు పుట్టిన బిడ్డను కళ్లారా చూడకుండానే చనిపోయిందో మహిళ. తర్వాత అవయవదానం చేసి పలువురిలో సజీవంగా నిలిచిపోయిన ఘటన ఢిల్లీలో జరిగింది. ఆషితా(38) ఈ నెల 7న బ్రెయిన్ స్ట్రోక్‌తో స్పృహ కోల్పోయారు. వైద్యులు సిజేరియన్ చేసి మగ బిడ్డను బయటకు తీశారు. FEB 13న ఆమె బ్రెయిన్ డెడ్ అవడంతో 2 కిడ్నీలు, 2 కార్నియాలు, కాలేయాన్ని భర్త దానం చేశారు. దీంతో సొంత బిడ్డతో సహా ఆరుగురికి జీవితాన్నిచ్చినట్లయ్యింది.

తనకు ఉద్యోగమిస్తే చాలని, జీతం అవసరం లేదని ఓ టెకీ ‘రెడిట్’లో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. ‘2023లో బీఈ పూర్తి చేసినా ఇప్పటికీ ఉద్యోగం రాలేదు. నా రెజ్యూమెను తగలబెట్టినా పర్లేదు. ఉద్యోగం ఇచ్చి సహాయం చేయండి. ఉచితంగా పని చేయడానికి నేను సిద్ధం. ఇలా పనిచేసినా కనీసం ఎక్స్‌పీరియెన్స్ వస్తుంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దేశంలో నిరుద్యోగానికి ఇది ఒక నిదర్శనమంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

తనకు పీఆర్ లేరని, తన ఆటే ఒక పీఆర్ అని టీమ్ ఇండియా క్రికెటర్ అజింక్య రహానే అన్నారు. తిరిగి భారత జట్టులో చోటు సంపాదిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ‘జట్టులో చోటు విషయమై కొందరు బీసీసీఐ పెద్దలను కలవమని సలహా ఇచ్చారు. కానీ నేను ఆ పని చేయలేను. జట్టులోకి నన్ను తీసుకోండి అని వారిని కోరలేను. క్రికెట్ ఆడటం.. ఇంటికి వెళ్లడం. నాకు తెలిసింది ఇదే. ఇంతకుమించి నా చేతుల్లో ఏమీ లేదు’ అంటూ బాధపడ్డారు.

TG: శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి ఏపీ ఎక్కువ నీటిని తరలించుకుపోకుండా చూడాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఏపీ ఏకపక్షంగా వ్యవహరిస్తే కేంద్రానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. నీటి సరఫరాలో టెలిమెట్రీ విధానం అమలు చేయాలని పేర్కొన్నారు. టెలిమెట్రీ నిర్వహణకు అవసరమైన నిధులన్నీ తెలంగాణనే భరిస్తుందని చెప్పారు. వెంటనే టెలిమెట్రీ అమలు చేయాలని కేంద్రానికి లేఖ రాయాలని ఆదేశించారు.

TG: రంజాన్ మాసం సందర్భంగా ప్రభుత్వ ముస్లిం ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. మార్చి 2 నుంచి 31 వరకు వారంతా సాయంత్రం 4 గంటలకే కార్యాలయాల నుంచి వెళ్లిపోవచ్చని పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, కాంట్రాక్ట్ వర్కర్లకు ఇది వర్తించనుందని తెలిపింది. ఈమేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఏపీలోనూ ముస్లిం ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులిచ్చింది.

కొన్ని వస్తువులపై టారిఫ్స్ తగ్గించుకొనేందుకు భారత్, అమెరికా ఒప్పుకున్నాయని తెలిసింది. రెండు దేశాలకూ ప్రయోజనం కలిగే ట్రేడ్ డీల్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాయని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2030 నాటికి భారత్, అమెరికా మధ్య వాణిజ్యాన్ని $500Bకు పెంచుకోవాలని ట్రంప్, మోదీ టార్గెట్ పెట్టుకున్న సంగతి తెలిసిందే. పరిశ్రమ, శ్రామిక ఆధారిత, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి, దిగుమతులను పెంచుకోనున్నాయి.

AP: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించి మే నెల కోటా టికెట్లు ఈ నెల 21న విడుదలవుతాయని టీటీడీ ప్రకటించింది. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవల కోసం రేపు ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదలవుతాయని తెలిపింది. అలాగే ఈ నెల 18 నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు టికెట్ల లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకోవచ్చని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.