India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఒక స్పోర్ట్స్ స్కూల్ నిర్మించాలని CM రేవంత్ నిర్ణయించారు. విద్యార్థుల్లో క్రీడానైపుణ్యాలను గుర్తించి, ప్రోత్సహించాలని అధికారులకు సూచించారు. ఫోర్త్ సిటీలో నిర్మించతలపెట్టిన స్పోర్ట్స్ వర్సిటీకి యంగ్ ఇండియా పేరు పెట్టాలని ఆదేశించారు. క్రీడా శిక్షణ సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తేవాలన్నారు. భవిష్యత్తులో ఒలింపిక్స్‌కు HYD వేదికగా నిలిచేలా తీర్చిదిద్దాలన్నారు.
లేటరల్ ఎంట్రీలతో కేంద్ర ప్రభుత్వం అణగారిన వర్గాల రిజర్వేషన్లను లాక్కుంటోందని కాంగ్రెస్ చేసిన విమర్శలకు ఎన్డీయే మిత్రపక్షం ఎల్జేపీ మద్దతు తెలిపింది. ప్రభుత్వ నియామకాల్లో రిజర్వేషన్ నిబంధనలు తప్పనిసరిగా ఉండాలని ఎల్జేపీ చీఫ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ అన్నారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు లేవని, ప్రభుత్వ నియామకాల్లో కూడా అమలు చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఇది ఆందోళనకర అంశమన్నారు.
నిందితుడు నిజాలు చెబుతున్నారా? లేదా? అనేది తెలుసుకోవడానికి <<13892681>>ఈ టెస్టు<<>> చేస్తారు. ఔషధాలు వాడకుండా అతని శరీరానికి కార్డియో-కఫ్/ఎలక్ట్రోడ్‌లను అమర్చుతారు. నిందితుడు మాట్లాడేటప్పుడు BP, శ్వాసరేటును పరిశీలిస్తారు. అబద్ధమాడితే వాటిలో మార్పులు కనిపిస్తాయి. ఈ ప్రక్రియలో అతను తెలివితో నిజాలను దాచే ఆస్కారం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరీక్షను 19వ శతాబ్దంలో తొలిసారి ఓ ఇటలీ క్రిమినాలజిస్ట్ వినియోగించారు.
కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం చేసిన నిందితుడికి పాలీగ్రాఫ్ టెస్టు చేయడానికి కోర్టు అనుమతించింది. గత ఏడాది శ్రద్ధా వాకర్ <<9480068>>హత్య<<>> కేసు నిందితుడికి ఈ టెస్టు చేశారు. 2002లో గుజరాత్ అల్లర్ల కేసు, అబ్దుల్ కరీం తెల్గీ స్టాంపు పేపర్ల స్కామ్, 2006లో నోయిడా సీరియల్ హత్యలు, 26/11 ముంబై ఉగ్రదాడి నిందితులకు నార్కో పరీక్షలు చేశారు. ఈ పరీక్షలకు వ్యక్తి అంగీకారం తప్పనిసరని సుప్రీంకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది.
ఈ పరీక్షలో భాగంగా నిందితుని శరీరంలోకి సోడియం పెంటోథాల్, స్కోపలామైన్, సోడియం అమైథాల్ కాంబినేషన్‌లో ఔషధాన్ని ఎక్కిస్తారు. దీన్నే ట్రూత్ సీరమ్ అంటారు. వ్యక్తి వయసు, ఆరోగ్యం ఆధారంగా డోసు ఇస్తారు. అతను స్పృహ కోల్పోగానే వైద్యులు నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తారు. ఆ సమయంలో అడిగే ప్రశ్నలకు నిందితుడు స్వేచ్ఛగా నిజాలు చెబుతాడు. అయితే వీటిని కోర్టులు సాక్ష్యాలుగా పరిగణించవు. ఓ ఆధారంగా మాత్రమే తీసుకుంటాయి.
రికవరీ చేయడానికి కష్టతరమైన బకాయిల మొత్తం గత ఏడాదితో పోలిస్తే 4% పెరిగి ₹76,293 కోట్లకు చేరుకున్నట్టు సెబీ తెలిపింది. 807 కేసుల్లో 95% (విలువ ఆధారంగా) కోర్టులలో లేదా కోర్టు నియమించిన కమిటీల ముందు పెండింగ్‌లో ఉన్నందున వీటిని రికవరీకి కష్టమైన బకాయిలుగా వర్గీకరించినట్టు తెలిపింది. సెబీ చట్టాలను ఉల్లంఘించిన సంస్థలు, వ్యక్తులు, మధ్యవర్తులపై నియంత్రణ సంస్థ జరిమానాలు విధిస్తుంటుంది.
AP: ఫుడ్‌పాయిజన్‌తో విశాఖ KGHలో చికిత్స పొందుతున్న చిన్నారులను హోంమంత్రి అనిత పరామర్శించారు. బయటి నుంచి తెచ్చిన ఆహారం తినడం వల్లే పిల్లలు అస్వస్థతకు గురయ్యారని చెప్పారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న హాస్టళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాంటివాటిని గుర్తించి, వెంటనే మూసేయించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు చెప్పారు. ఘటనపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఆరా తీశారని వెల్లడించారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 21, 22 తేదీల్లో పోలాండ్‌లో, 23న ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. 45 ఏళ్ల తర్వాత భారత ప్రధాని పోలాండ్‌లో పర్యటిస్తుండడం గమనార్హం. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాల స్థాపనకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ పర్యటన జరుగుతుందని MEA కార్యదర్శి (వెస్ట్) తన్మయ లాల్ తెలిపారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశంలో పర్యటిస్తారని తెలిపారు.
AP: తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుంచి 12 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు TTD వెల్లడించింది. 4న ధ్వజారోహణం, పెద్దశేష వాహనం, 5న చిన్నశేష వాహనం, హంస వాహనం, 6న సింహ వాహనం, ముత్యపు పందిరి వాహనం, 7న కల్పవృక్ష వాహనం, భూపాల వాహనం, 8న మోహినీ అవతారం, గరుడ వాహనం, 9న స్వర్ణ రథం, గజ వాహనం, 10న సూర్యప్రభ వాహనం, 11న రథోత్సవం, 12న చక్రస్నానం, ధ్వజావరోహణం ఉంటుందని తెలిపింది.
Sorry, no posts matched your criteria.