News February 16, 2025

మళ్లీ వస్తున్నాం: తెలుగులో Delhi Capitals ట్వీట్

image

IPL-2025లో Delhi Capitals 2 మ్యాచ్‌లు విశాఖపట్నంలో ఆడనుంది. ఈ నేపథ్యంలో ‘మళ్లీ వస్తున్నాం. వైజాగ్‌కు మాకు ప్రత్యేక అనుబంధం ఉంది’ అని తెలుగులో ట్వీట్ చేసింది. APలోని రాజాంకు చెందిన GMR గ్రూప్ అధినేత గ్రంధి మల్లికార్జునరావు కుమారుడే ఢిల్లీ జట్టు కోఓనర్ కిరణ్ కుమార్. ఆయన ప్రస్తుతం GMR ఎయిర్‌పోర్ట్స్‌కు కార్పొరేట్ ఛైర్మన్‌గా ఉన్నారు. సొంత రాష్ట్రంపై అభిమానంతో 2వ హోం వెన్యూగా వైజాగ్‌ను ఎంచుకున్నారు.

News February 16, 2025

రేపు తిరుపతికి సీఎం చంద్రబాబు

image

AP: తిరుపతిలో రేపు అంతర్జాతీయ దేవాలయాల సమ్మేళనం జరగనుంది. సీఎం చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా వీరు ముగ్గురు టెంపుల్ ఎక్స్‌పోను ప్రారంభిస్తారు. ఎక్స్‌పోలో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్‌షాపులు నిర్వహించనున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో 100 ఆలయాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు.

News February 16, 2025

G-PAY వాడే వారికి శుభవార్త

image

గూగుల్ పేలో త్వరలోనే AI ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా యూజర్లు వాయిస్ కమాండ్లతోనే UPI లావాదేవీలు చేయవచ్చు. ప్రస్తుతం సంస్థ దీనిపై ప్రయోగాలు చేస్తుండగా, త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్ ద్వారా చదువులేని వారు కూడా సులభంగా లావాదేవీలు చేయవచ్చని సంస్థ అంచనా వేస్తోంది. అన్ని భారతీయ భాషలను ఇందులో ఇంక్లూడ్ చేసేలా గూగుల్ ప్రయత్నాలు చేస్తోంది.

News February 16, 2025

GBSపై ఆందోళన వద్దు: GGH సూపరింటెండెంట్

image

AP: GBSతో మహిళ <<15482663>>మృతి చెందడంపై<<>> గుంటూరు GGH సూపరింటెండెంట్ స్పందించారు. తీవ్ర జ్వరం, కాళ్లు చచ్చుపడిపోయిన స్థితిలో ఆమె ఆస్పత్రిలో చేరారన్నారు. ఇప్పటికే కమలమ్మకు 2సార్లు కార్డియాక్ సమస్య వచ్చిందని, మరోసారి అదే పరిస్థితి తలెత్తడంతో చనిపోయారని చెప్పారు. మరో GBS బాధితురాలు ICUలో ఉన్నారని తెలిపారు. ఈ వ్యాధిపై ఆందోళన వద్దని, సోకిన వారిలో మరణాలు 5% లోపేనని వివరించారు.

News February 16, 2025

తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమే: KTR

image

తెలంగాణ అప్పుల్లో <<15451481>>కూరుకుపోయిందన్న <<>>కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు మాజీ మంత్రి KTR లేఖ రాశారు. ‘మా పదేళ్ల పాలన తర్వాత కూడా తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రమే. మా ప్రభుత్వం చేసిన అప్పులతో ఆస్తులు సృష్టించాం. దేశ చరిత్రలోనే అత్యధిక అప్పులు చేసిన మీరా మమ్మల్ని అనేది? మీరు అప్పులు చేసి కార్పొరేట్ల లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారు. రూ.లక్షల కోట్ల అప్పులతో పదేళ్లలో ఏం చేశారు?’ అని లేఖలో KTR ప్రశ్నించారు.

News February 16, 2025

తొలిసారి 5 స్టార్ హోటల్‌లో మోనాలిసా భోజనం

image

తన కళ్లతో కుంభమేళాలో అందరినీ ఆకర్షించి రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయింది మోనాలిసా. ఇటీవల తొలిసారి ఫ్లైట్ ఎక్కిన ఆమె, తాజాగా ఫస్ట్ టైం 5 స్టార్ హోటల్‌కు వెళ్లింది. తన కుటుంబ సభ్యులతో కలిసి అందులో భోజనం చేసింది. ఆమె నటిస్తున్న మూవీ డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాను ఇక్కడకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కుటుంబంతో కలిసి 5 నక్షత్రాల హోటల్‌లో మోనాలిసా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

News February 16, 2025

₹9L Crకు వస్త్ర ఎగుమతులు.. అదే మా టార్గెట్: మోదీ

image

ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద టెక్స్‌టైల్ ఎగుమతిదారుగా భారత్ ఉందని PM మోదీ చెప్పారు. ప్రస్తుతం ₹3L Cr కోట్లుగా ఉన్న వార్షిక ఎగుమతులను 2030కి ₹9L Crకు పెంచడమే తమ లక్ష్యమన్నారు. వస్త్ర రంగానికి బ్యాంకులు సహకరించాలని కోరారు. ఢిల్లీలో జరుగుతున్న ‘భారత్ టెక్స్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హైగ్రేడ్ కార్బన్ ఫైబర్ తయారీలోనూ ఇండియా దూసుకెళ్తోందన్నారు. కాగా ఈ సదస్సులో 120కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి.

News February 16, 2025

‘సచివాలయ’ ఉద్యోగుల రేషనలైజేషన్‌పై రేపు కీలక భేటీ

image

AP: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల రేషనలైజేషన్‌పై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే ఈ విషయంపై ఉత్తర్వులు జారీ చేయగా ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో రేపు ఆయా సంఘాల నేతలతో మంత్రి డోలా వీరాంజనేయస్వామి భేటీ కానున్నారు. <<15268707>>క్రమబద్ధీకరణ<<>> తర్వాత మిగిలిపోయే 40వేల మందిని ఏ శాఖల్లోకి కేటాయించాలి? అనే అంశంపై వారి సూచనలు తీసుకోనున్నారు.

News February 16, 2025

ప్రముఖ నటి కన్నుమూత

image

ప్రముఖ సౌత్ కొరియన్ నటి కిమ్ సె రాన్(24) ఇవాళ కన్నుమూశారు. సియోల్‌లోని తన ఇంట్లో ఆమె శవమై కనిపించారు. పోస్టుమార్టం తర్వాత నటి మరణానికి గల కారణాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు. ఆమె 2009లో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ది బ్రాండ్ న్యూ లైఫ్, ది నైబర్స్, సీక్రెట్ హీలర్, ది విలేజర్స్, బ్లడ్ హౌండ్స్ తదితర చిత్రాలు, టీవీ షోలు, వెబ్‌సిరీస్‌లలో కీలక పాత్రలు పోషించారు.

News February 16, 2025

మారిషస్ మాజీ ప్రధాని జగన్నాథ్‌ అరెస్ట్

image

మనీ లాండరింగ్ కేసులో మారిషస్ మాజీ PM ప్రవింద్ జగన్నాథ్‌(63)ను ఆ దేశ ఆర్థిక నేరాల కమిషన్ అరెస్ట్ చేసింది. ఆయన నివాసంలో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు, లగ్జరీ వాచ్‌లు, నగదును స్వాధీనం చేసుకుంది. ప్రవింద్ 2017-24 మధ్య PMగా పనిచేశారు. ఆయన చేసుకున్న కొన్ని ఒప్పందాల్లో స్కామ్స్ జరిగాయని, వాటిపై ఆడిట్ నిర్వహిస్తామని కొత్త ప్రధాని నవీన్ రామ్ అప్పట్లో ప్రకటించారు. అన్నట్లుగానే చర్యలు తీసుకున్నారు.