India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తేది: ఆగస్టు 19, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 4:45 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:00 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:20 గంటలకు
అసర్: సాయంత్రం 4:47 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:39 గంటలకు
ఇష: రాత్రి 7.54 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
తేది: ఆగస్టు 19, సోమవారం
పౌర్ణమి: రాత్రి 11.55 గంటలకు
శ్రవణం: ఉదయం 08.10 గంటలకు
ధనిష్ఠ: తెల్లవారుజాము 05.45 గంటలకు
వర్జ్యం: ఉదయం 11.46 నుంచి మధ్యాహ్నం 01.12 గంటల వరకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.36 నుంచి 01.26 గంటల వరకు
తిరిగి మధ్యాహ్నం: 03.07 నుంచి 03.57 గంటల వరకు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
* TG: రేపు సింఘ్వీ నామినేషన్: రేవంత్
* అర్హులందరికీ రుణమాఫీ చేస్తాం: ఉత్తమ్
* బీఆర్ఎస్‌ను విలీనం చేసుకున్నా ఉపయోగం లేదు: బండి
* రుణమాఫీని సమగ్రంగా పూర్తి చేయాలి: హరీశ్
* ఏపీ కేంద్రంగా జాతీయ క్రీడలు: ఎంపీ కేశినేని
* టీటీడీలో రూ.100 కోట్లు చేతులు మారాయి: చింతా మోహన్
TG: ప్రజల్లో లేని బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకోవడం అనవసరమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నా ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. హరీశ్, కేటీఆర్ నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్‌కు తక్కువ ఓట్లు వచ్చాయన్నారు. ఇప్పటికే విలీనంపై బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.
మహిళల్లో ఎంత కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ వారిలో పొట్ట వచ్చే వారి సంఖ్య తక్కువే. ఎందుకంటే స్త్రీ పురుష శరీర నిర్మాణంలో కొన్ని తేడాలు ఉంటాయి. మహిళల్లో తొడలు, తుంటి, ఇంకా ఇతర భాగాలకు కొవ్వు నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంటుంది. వాటిలో కొవ్వు చేరిపోయి ఖాళీ లేనప్పుడే పొట్ట దగ్గర చేరుతుంది. కానీ, పురుషుల్లో కేవలం పొట్ట భాగంలో మాత్రమే కొవ్వు నిల్వ ఉండటానికి అవకాశం ఉంది. అందుకే ఎక్కువగా పొట్ట వస్తుంది.
హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న చిత్రంలో ఇమాన్వీ హీరోయిన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. మోడలింగ్, నటనలో అనుభవాన్ని గతంలో ఎక్కువగా పరిగణనలోకి తీసుకునేవారు. కానీ ఇప్పుడు ఈమె ఎంపికతో సోషల్ మీడియాలో నైపుణ్యాలను ప్రదర్శించే వారికీ అవకాశాలు దక్కుతాయని తేలుస్తోంది. దీంతో స్కిన్‌షోపైనే కాకుండా మీలోని టాలెంట్‌ని ప్రదర్శిస్తే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
AP: మాజీ సీఎం వైఎస్ జగన్ దంపతులు శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరయ్యారు. బెంగళూరు మారియట్ హోటల్‌లో ఈ వేడుక జరిగింది. నూతన వధూవరులు పవిత్ర-డా.కౌశిక్‌ను జగన్, ఆయన సతీమణి భారతి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఇండియన్ కోస్టల్ గార్డ్ డీజీ రాకేశ్ పాల్ గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. చెన్నైలో ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయనకు స్ట్రోక్ వచ్చింది. వెంటనే అధికారులు ఆయనను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఆయన మృతిపై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. పాల్ నిబద్ధత గల అధికారి అని పేర్కొన్నారు.
తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వీ రేపు నామినేషన్ వేస్తారని సీఎం రేవంత్ తెలిపారు. సీఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన హామీల అమలు కోసం సింఘ్వీ రాజ్యసభలో గట్టి వాదనలు వినిపిస్తారని పేర్కొన్నారు. తనకు ఈ అవకాశమిచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానానికి, సీఎం రేవంత్‌కు సింఘ్వీ కృతజ్ఞతలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.