India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో ఇచ్చిన గ్యారంటీల్లో మహిళలకు నెలకు రూ.2500 ముఖ్యమైంది. ఈ పథకంపై తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ హామీని కూడా త్వరలోనే అమలు చేస్తామని ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో అన్నారు. ఇక మార్చి 31లోపు వంద శాతం రైతు భరోసా డబ్బులను రైతుల అకౌంట్లలో జమ చేస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎకరానికి రూ.10వేలు ఇస్తే, తాము రూ.12వేలు ఇస్తున్నామని చెప్పారు.

నిన్న రాత్రి ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో 18 మంది దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు గజిబిజి అనౌన్స్‌మెంట్ కారణమని తెలుస్తోంది. 12వ ప్లాట్‌ఫామ్ నుంచి 16వ ప్లాట్‌ఫామ్‌కు రైలు వస్తుందని అకస్మాత్తుగా ప్రకటించడంతో ఈ దుర్ఘటన జరిగినట్లు సమాచారం. రైళ్ల ఆలస్యం, రద్దు వదంతులతోనూ తోపులాట జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. రైల్వే నిర్లక్ష్యంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని విమర్శలు వస్తున్నాయి.

ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని రాహుల్ గాంధీ అన్నారు. రైల్వేశాఖ నిర్లక్ష్యం, ప్రభుత్వ అసమర్థతకు ఈ ఘటన అద్దం పడుతోందని ట్వీట్ చేశారు. మహా కుంభమేళాకు పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తున్నారని తెలిసి కూడా స్టేషన్లో ఎందుకు సౌకర్యాలు కల్పించలేదని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు పోకుండా చూడాల్సిన బాధ్యత వ్యవస్థలపై ఉందన్నారు.

ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట ఘటనకు బాధ్యత వహిస్తూ రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజీనామా చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఆయన హయాంలో రైల్వే ప్రమాదాలు పెరిగిపోయాయని, రద్దీకి అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. జనరల్ బోగీల సంఖ్యను చాలా వరకు తగ్గించారని, సాధారణ ప్రయాణికుల కష్టాలను పట్టించుకోవట్లేదని ఫైరవుతున్నారు. ఈ డిమాండ్లపై మీ కామెంట్?

ఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాట బాధితులకు భారత రైల్వే నష్టపరిహారం ప్రకటించింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి తలో రూ.2.5 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి రూ.లక్ష చొప్పున ఇస్తామని పేర్కొంది.

TG: ములుగులో నాలుగు రోజుల పాటు కొనసాగిన మినీ మేడారం జాతర ముగిసింది. భక్తులు భారీ సంఖ్యలో హాజరై వనదేవతలను దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. వచ్చే బుధవారం నుంచి తిరుగువారం పండగ నిర్వహిస్తారు. కాగా, వచ్చే ఏడాది మహా జాతర జరగనుంది.

శబరిమల అయ్యప్ప భక్తులకు ఆలయ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. 18 మెట్లు ఎక్కగానే దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మేరకు ఆలయం సమీపంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిని తొలగించాలని నిర్ణయించారు. భక్తులు ఈ మెట్లను ఎక్కగానే సన్నిధికి చేరుకోవడానికి ఎడమ వైపునకు మళ్లించేవారు. దీంతో దర్శనానికి 500 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జిని దాటుకొని వెళ్లాల్సి వచ్చేది. మార్చి 14 నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది.

గుజరాత్‌కు చెందిన ప్రధాని నరేంద్ర మోదీది ‘మోద్ ఘాంచి’ కులం. మోదీ జన్మించినప్పుడు ఆయన కులం ఓసీ జాబితాలో ఉండేది. మండల్ కమిషన్ సిఫారసుతో గుజరాత్ ప్రభుత్వం 1994లో ఆయన కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చింది. అప్పటికి మోదీ ఎమ్మెల్యే కూడా కాలేదు. కానీ మోదీ సీఎం అయ్యాకే తన కులాన్ని బీసీల్లో చేర్చారని సీఎం రేవంత్ అన్నారు. దీంతో రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

ఫాస్టాగ్ లావాదేవీలకు సంబంధించి NPCI రేపటి నుంచి కొత్త నిబంధనల్ని తీసుకొస్తోంది. బ్లాక్‌లిస్టులో ఉన్న ఫాస్టాగ్ యూజర్లు టోల్ ప్లాజాకు వచ్చే 70 నిమిషాల్లోపు ఆ లిస్టు నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. లేని పక్షంలో రెండింతల ఛార్జి చెల్లించాల్సిందే. కేవైసీ అసంపూర్తిగా ఉన్నా, తగిన బ్యాలెన్స్ లేకపోయినా ఫాస్టాగ్ బ్లాక్‌లిస్ట్ అవుతుంది. కాబట్టి బయలుదేరే ముందుగానే ఫాస్టాగ్ సరిచూసుకోవడం మంచిది.

రోజుని ఉల్లాసంగా ప్రారంభించేందుకు ఉదయాన్నే నిద్ర లేవడం చాలా ముఖ్యం. కొన్ని అలవాట్లతో ఫిట్‌గా ఉండటమే కాకుండా ఒత్తిడిని జయిస్తారని నిపుణులు చెబుతున్నారు.
* వేకువజామునే నిద్రలేవడం
* యోగా/వ్యాయామం/ధ్యానం చేయడం
* లేచిన వెంటనే నీరు తాగడం(కుదిరితే గోరువెచ్చని నీరు)
* ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్
* సానుకూలమైన ఆలోచనలు
* రోజులో ఏం చేయాలో ప్లాన్ చేసుకోవాలి.
Sorry, no posts matched your criteria.