News November 19, 2024

‘కంగువ’ సినిమా రన్ టైమ్ తగ్గింపు

image

తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘కంగువ’ సినిమా రన్ టైమ్‌ను మేకర్స్ 12 నిమిషాలు తగ్గించారు. తొలుత సినిమా నిడివి 2 గంటల 34 నిమిషాలు ఉండగా, ఇప్పుడు మళ్లీ సెన్సార్ చేయించి 2 గంటల 22 నిమిషాలకు తగ్గించినట్లు సినీ వర్గాలు తెలిపాయి. గోవా బ్యాక్ డ్రాప్‌లో జరిగే కొన్ని సీన్లను తొలగించినట్లు సమాచారం. ఈనెల 14న విడుదలైన ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే.

News November 19, 2024

13.13లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

image

TG: రాష్ట్రంలో 13.13లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలంగాణ పౌరసరఫరాల కమిషనర్ చౌహాన్ తెలిపారు. మరో 57లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 7,532 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జరుగుతోందన్నారు. ఓపెన్ మార్కెట్ వల్ల సన్నరకం ధాన్యం సేకరణ తగ్గిందని వివరించారు. ఈ నెల 23వరకు 90శాతం బోనస్ చెల్లిస్తామని చౌహాన్ వెల్లడించారు.

News November 19, 2024

మాజీ హోంమంత్రిపై రాళ్ల దాడి.. తలకు గాయాలు

image

మహారాష్ట్ర మాజీ హోమ్ మినిస్టర్, NCP-SP నేత అనిల్ దేశ్‌ముఖ్‌పై రాళ్ల దాడి జరిగింది. కటోల్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్న తన కుమారుడు సలీల్ దేశ్‌ముఖ్ తరఫున ప్రచారం నిర్వహించి తిరిగి వస్తుండగా ఆయన కారుపై దుండగులు రాళ్లు విసిరారు. దీంతో ఆయన తలకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News November 19, 2024

డ్రాగా ముగిసిన ఇండియా, మలేషియా మ్యాచ్

image

HYDలోని గచ్చిబౌలి స్టేడియంలో ఇండియా, మలేషియా మధ్య జరిగిన ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. టైమ్ ముగిసే సరికి ఇరు జట్లు 1-1 గోల్స్‌తో సమంగా నిలిచాయి. భారత ఫుట్‌బాల్ జట్టుకు ఈ ఏడాది ఇదే లాస్ట్ మ్యాచ్ కాగా, ఈ ఏడాదిలో ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. మనోలో మార్క్వెజ్ (స్పెయిన్) హెడ్ కోచ్‌గా నియామకం అయినప్పటి నుంచి 4 మ్యాచులు జరగగా, ఒక్క దాంట్లోనూ IND గెలవకపోవడం గమనార్హం.

News November 19, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 19, 2024

నవంబర్ 19: చరిత్రలో ఈ రోజు

image

1828: స్వాతంత్య్ర పోరాట యోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి జననం
1917: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జననం
1960: సినీ నటుడు శుభలేఖ సుధాకర్ జననం
1975: మాజీ విశ్వ సుందరి, నటి సుష్మితా సేన్ జననం
* అంతర్జాతీయ పురుషుల దినోత్సవం
* ప్రపంచ టాయిలెట్ దినోత్సవం

News November 19, 2024

ప్రజలే మాకు బ్రాండ్ అంబాసిడర్లు: మంత్రి శ్రీధర్

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే బ్రాండ్ అంబాసిడర్లు అని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రచారానికి తక్కువ ఖర్చు, సంక్షేమానికి ఎక్కువ ఖర్చు పెట్టేందుకే తాము ప్రయత్నిస్తామని తెలిపారు. వరంగల్‌లో జరగనున్న బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. BRS ఒక్క రూపాయి అభివృద్ధి చేస్తే వంద రూపాయల ప్రచారం చేసుకుందని, తాము వంద రూపాయల అభివృద్ధి చేసినా ఒక్క రూపాయి ప్రచారం కూడా చేసుకోలేకపోతున్నామని పేర్కొన్నారు.

News November 19, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: నవంబర్ 19, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున 5:08
సూర్యోదయం: ఉదయం 6:23
దుహర్: మధ్యాహ్నం 12:02
అసర్: సాయంత్రం 4:04
మఘ్రిబ్: సాయంత్రం 5:40
ఇష: రాత్రి 6.55
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 19, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News November 19, 2024

శుభ ముహూర్తం

image

తేది: నవంబర్ 19, మంగళవారం
చవితి: సా.5.28 గంటలకు
ఆరుద్ర: మ.2.55 గంటలకు
వర్జ్యం: రా.2.52-తె.4.28 గంటల వరకు
దుర్ముహూర్తం: ఉ.8.29-9.14 గంటల వరకు
తిరిగి రా.10.36-11.27 గంటల వరకు
రాహుకాలం: మ.3.00-సా.4.30 గంటల వరకు