News February 15, 2025

బీజేపీ భూస్థాపితం కాక తప్పదు: అద్దంకి

image

TG: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కులమేంటో తెలియని దుస్థితిలో బీజేపీ నాయకులు ఉన్నారని అద్దంకి దయాకర్ విమర్శించారు. సబ్బండ వర్గాల కోసం రాహుల్ చేస్తున్న పోరాటం వారికి నచ్చట్లేదని మండిపడ్డారు. కాబోయే ప్రధాని రాహుల్ అని తెలిసి నెహ్రూ కుటుంబాన్ని బీజేపీ నేతలు కించపరుస్తున్నారని దుయ్యబట్టారు. కుల, మత రాజకీయాలు చేసే బీజేపీ భూస్థాపితం కాక తప్పదని హెచ్చరించారు.

News February 15, 2025

చిన్నారులపై అత్యాచారాలు దురదృష్టకరం: అనిత

image

AP: సమాజంలో దొంగలు తెలివి మీరిపోయారని, ప్రతి వ్యక్తీ తనపై తాను నిఘా పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని హోంమంత్రి అనిత చెప్పారు. టెక్నాలజీ సాయంతో నేరాలను నియంత్రించాలని పోలీసులకు సూచించారు. విజయవాడలో నిర్వహించిన డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ సదస్సులో ఆమె మాట్లాడారు. చిన్నారులపై అత్యాచారాలు దురదృష్టకరమని, నిందితులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు.

News February 15, 2025

MLAపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

image

AP: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల వైసీపీ నేత కారు డ్రైవర్‌ను తాను దూషిస్తూ దురుసుగా ప్రవర్తించిన ఘటనపై చింతమనేని సీఎంకు వివరణ ఇచ్చారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం, తిట్టడం వంటి పనులతో పార్టీ, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని CM ఆయనపై అసహనం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని, సహనంతో వ్యవహరించాలని సూచించారు.

News February 15, 2025

కేసీఆర్‌కు పట్టిన గతి రేవంత్‌కు పడుతుంది: ఎంపీ లక్ష్మణ్

image

TG: ప్రధాని మోదీ కులంపై సీఎం <<15461493>>రేవంత్‌ చేసిన వ్యాఖ్యలపై<<>> బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ భాష చూసి తెలంగాణ సమాజం సిగ్గుపడుతోందని మండిపడ్డారు. గతంలో కేసీఆర్ ఇలాగే మాట్లాడి ఇంటికి వెళ్లారని దుయ్యబట్టారు. రేవంత్‌కు కేసీఆర్‌కు పట్టిన గతే పడుతుందని విమర్శించారు.

News February 15, 2025

ఈనెల 26న ‘ఓయ్’ రీరిలీజ్

image

సిద్ధార్థ్, షామిలీ జంటగా నటించిన రొమాంటిక్ డ్రామా ‘ఓయ్’ మరోసారి థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈనెల 26న ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రేపు హైదరాబాద్‌లోని RTC క్రాస్ రోడ్ థియేటర్లలో బుకింగ్స్ ఓపెన్ అవుతాయని పేర్కొన్నారు. శివరాత్రి సందర్భంగా ఈ చిత్రంతో పాటు మాస్ మహారాజా రవితేజ నటించిన ‘నా ఆటోగ్రాఫ్’ సినిమా కూడా రీరిలీజ్ కానుంది. ఏ సినిమాకు వెళ్తున్నారు? COMMENT

News February 15, 2025

పెన్సిల్ ఎత్తినా వర్కౌట్‌లా ఉంటుంది.. సునీత, విల్మోర్‌కు ఇబ్బందులు

image

సుమారు 8 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఎట్టకేలకు వచ్చేనెల భూమిపైకి రానున్నారు. అయితే జీరో గ్రావిటీ ఉండే స్పేస్‌ నుంచి గురుత్వాకర్షణ కలిగిన భూమిపైకి వచ్చాక వారికి అనేక ఇబ్బందులు ఎదురవనున్నాయి. చిన్న పెన్సిల్ ఎత్తినా అది వర్కౌట్‌తో సమానమవుతుందని విల్మోర్ తెలిపారు. ఇక్కడి వాతావరణానికి అలవాటు పడటం చాలా కష్టంగా ఉంటుందని సునీత చెప్పారు.

News February 15, 2025

రోహిత్ శర్మకు షాక్.. WTCలో బుమ్రానే కెప్టెన్?

image

రోహిత్ శర్మను ఇకపై టెస్టులకు BCCI పరిగణనలోకి తీసుకోకపోవచ్చని PTI వర్గాలు తెలిపాయి. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ప్రారంభమయ్యే కొత్త WTC సీజన్‌లో బుమ్రానే కెప్టెన్‌గా ఎంపిక చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. జూన్-జులైలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఆయనే సారథ్యం వహిస్తారని తెలుస్తోంది. బుమ్రా స్కాన్ రిపోర్టుల్లో ఎలాంటి సమస్యా లేదని, ముందు జాగ్రత్తగానే NCAకి పంపినట్లు వార్తలు వస్తున్నాయి.

News February 15, 2025

రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీ

image

TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా పరిస్థితులు, కులగణన, 42శాతం బీసీ రిజర్వేషన్లు, కార్పొరేషన్ పదవులు, MLA కోటా MLC పదవులు సహా మరికొన్ని అంశాలపై ఆయనతో సీఎం చర్చిస్తున్నట్లు సమాచారం.

News February 15, 2025

వంశీ ఫోన్ కోసం ఇంట్లో సోదాలు

image

హైదరాబాద్ రాయదుర్గంలోని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నివాసంలో ఏపీ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. కేసులో ఆయన ఫోన్ కీలకం కావడంతో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అది చేతికి వస్తేనే ఆయన ఎవరెవరితో మాట్లాడారో తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. కాగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సత్యవర్ధన్ అనే వ్యక్తిని వంశీ బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే కేసులో ఆయనను అరెస్టు చేశారు.

News February 15, 2025

ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ ఫీచర్!

image

సోషల్ మీడియా దిగ్గజం ‘ఇన్‌స్టాగ్రామ్’లో త్వరలో ఇంట్రెస్టింగ్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. రెడ్డిట్‌లో అప్‌ఓట్, డౌన్‌ఓట్ ఉన్నట్లు ఇన్‌స్టాలోనూ పోస్టు కింద చేసిన కామెంట్ నచ్చకపోతే డిస్ లైక్ చేసే ఫీచర్ తీసుకొచ్చేందుకు ‘మెటా’ యోచిస్తోంది. యూజర్ అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి దీనిని తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఇన్‌స్టా కామెంట్ సెక్షన్‌లో లవ్(లైక్) బటన్ మాత్రమే ఉంది.