News October 30, 2025

అభ్యంగ స్నానంతో ఎన్నో ప్రయోజనాలు

image

వారానికోసారి అభ్యంగన స్నానం చేయాలని ఆయుర్వేద శాస్త్రం సూచిస్తుంది. తైలాభ్యంగం ముఖ్యమని చెబుతోంది. స్పర్శేంద్రియమైన చర్మంలోనే ఈ శరీరం ఉంటుంది. అందువల్ల నూనె లేపనం శరీరానికి బలం, కాంతిని ఇస్తుంది. శిరస్సు నందు అభ్యంగనం వల్ల ఇంద్రియాలు తృప్తి చెందుతాయి. దృష్టి దోషాలు తొలగి, శిరో రోగాలు నశిస్తాయి. అవయవాలకు బలం చేకూరుతుంది. పాదాల పగుళ్లు తగ్గుతాయి. నిద్ర బాగా పడుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

News October 30, 2025

ఇంటర్వ్యూతో IRCTCలో 64 ఉద్యోగాలు

image

IRCTC 64 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. BSc(హాస్పిటాలిటీ), BBA/MBA, BSc(హోటల్ మేనేజ్‌మెంట్& క్యాటరింగ్ సైన్స్), MBA(టూరిజం& హోటల్ మేనేజ్‌మెంట్) అర్హతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. అభ్యర్థులు గరిష్ఠ వయసు 28 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. ఇంటర్వ్యూ వివిధ ప్రాంతాల్లో నవంబర్ 8 నుంచి 18 వరకు నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://irctc.com

News October 30, 2025

అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఆఫర్.. సీఎంపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు!

image

TG: మంత్రివర్గ విస్తరణను వెంటనే ఆపేలా ఆదేశించాలని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక వేళ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఆఫర్ చేసి సీఎం రేవంత్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించారంటూ అందులో పేర్కొంది. ​ఇది నియోజకవర్గంలోని ఒక వర్గం ఓటర్లను ప్రభావితం చేసేలా ఉందని ఆరోపించింది. ఎన్నికల నిబంధన ఉల్లంఘించిన సీఎంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

News October 30, 2025

పారిశుద్ధ్య పనులకు మొబైల్ బృందాలు: పవన్

image

AP: మొంథా తుఫాను ప్రభావం ప్రజల ఆరోగ్యంపై పడకుండా చూడాలని Dy.CM పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ‘పకడ్బందీగా పారిశుద్ధ్య పనుల కోసం మొబైల్ బృందాలు, రోడ్ల పునరుద్ధరణకు తక్షణ చర్యలు, తాగునీటి సరఫరాకు ఇబ్బందులున్న చోట్ల ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలి’ అని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం తుఫాను వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేసే పనిలో పడింది. పంట, ఆస్తినష్టం వివరాలను ప్రజల నుంచి వాట్సాప్‌లో సేకరిస్తోంది.

News October 30, 2025

రోజూ లిప్‌స్టిక్ వాడుతున్నారా?

image

పెదాలు అందంగా కనిపించడానికి చాలామంది మహిళలు లిప్‌స్టిక్ వాడుతుంటారు. అయితే వీటిలో ఉండే రసాయనాలతో అనారోగ్యాలు వస్తాయంటున్నారు నిపుణులు. చాలా లిప్‌స్టిక్‌ల తయారీలో కాడ్మియం, సీసం, క్రోమియం, అల్యూమినియం రసాయనాలు వాడతారు. వీటిని దీర్ఘకాలం వాడటం వల్ల శ్వాసకోశ, జీర్ణ వ్యవస్థలు దెబ్బతినడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తాయని హెచ్చరిస్తున్నారు. లెడ్ ఫ్రీ, నాన్ టాక్సిక్ ఉత్పత్తులను వాడాలని సూచిస్తున్నారు.

News October 30, 2025

ఐఐఐటీ బెంగళూరులో ఉద్యోగాలు

image

ఐఐఐటీ బెంగళూరు 5 కాంట్రాక్ట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. Sr రీసెర్చ్ అసోసియేట్, రీసెర్చ్ అసోసియేట్, సాఫ్ట్‌వేర్ డెవలపర్, రీసెర్చ్ ఇంటర్న్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి బీటెక్/ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు నవంబర్ 1వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తును srinivas.vivek@iiib.ac.in మెయిల్‌కు పంపాలి. వెబ్‌సైట్: https://iiitb.ac.in

News October 30, 2025

వర్షాలు – 90 రోజుల పత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు(1/2)

image

పత్తి పూత, కాయ ఏర్పడి, వృద్ది చెందే దశలో ఉంటే ముందుగా పొలంలో మురుగు నీటిని బయటకు తొలగించాలి. పంటలో చాళ్లను ఏర్పాటు చేసి మొక్కల్లో గాలి, కాంతి ప్రసరణ పెంచాలి. 2% యూరియా లేదా 2%పొటాషియం నైట్రేట్ లేదా 2% 19:19:19+ 1% మెగ్నీషియం సల్ఫేట్‌తో పాటు వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి. లీటరు నీటికి 5గ్రా. బోరాక్స్ కలిపి 10-15 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలని ఏపీ వ్యవసాయశాఖ సూచించింది.

News October 30, 2025

వర్షాలు- 90 రోజుల పత్తి పంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు(2/2)

image

కాయకుళ్ళు నివారణకు లీటరు నీటికి 3గ్రా కాపర్ ఆక్సిక్లోరైడ్ +0.1గ్రా స్ట్రెప్టోసైక్లిన్ కలిపి మొక్కల కింది భాగపు కొమ్మలు, పచ్చటి కాయలు తడిచేలా పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు రాకుండా 3గ్రా. మాంకోజెబ్ లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్‌ను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. కాయరాలడం ఎక్కువగా ఉంటే లీటరు నీటికి ప్లానోఫిక్స్(4.5% నాఫ్తలిన్ అసిటిక్ యాసిడ్) 0.25ml కలిపి పిచికారీ చేయాలని ఏపీ వ్యవసాయశాఖ సూచించింది.

News October 30, 2025

‘మహాకాళి’గా భూమికా శెట్టి

image

ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో రానున్న మహాకాళి సినిమా ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో మహాకాళిగా కన్నడ భామ భూమికా శెట్టి నటించనున్నారు. భూమికా శెట్టిని ‘మహా’గా పరిచయం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈమె తెలుగులో ‘షరతులు వర్తిస్తాయి’ అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించారు. PVCUలో తొలి లేడీ సూపర్ హీరోగా ఈమె కనిపించనున్నారు. ఈ మూవీకి పూజా అపర్ణ దర్శకత్వం వహించనున్నారు.

News October 30, 2025

చరిత్రలో భారీ లేఆఫ్స్ ఇవే..

image

కరోనా తర్వాత అగ్రశ్రేణి కంపెనీల్లోనూ లేఆఫ్స్ పెరుగుతున్నాయి. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 14వేల మందిని తొలగించిన అమెజాన్.. మరో 16వేల మందిపై వేటుకు సిద్ధమవుతోంది. అయితే కరోనా కంటే ముందు కూడా కొన్ని సంస్థలు నష్టాల వల్ల భారీ లేఆఫ్స్ ఇచ్చాయి. 1993లో IBM 60వేల జాబ్స్, సిటీ గ్రూప్ 2008-09లో 75K, 2009లో జనరల్ మోటార్స్ 47K, 2012-15లో హ్యూలెట్-ప్యాకర్డ్ 55K ఉద్యోగాలకు కోత పెట్టాయి.