India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు <<15408903>>రంగరాజన్‌పై దాడి<<>> చేసిన వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. రామరాజ్య స్థాపనకు మద్దతివ్వాలని, ఆలయ బాధ్యతలు అప్పగించాలని కోరారని.. దానికి నిరాకరించడంతో దాడికి పాల్పడ్డారని రంగరాజన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వీరరాఘవరెడ్డిని అరెస్టు చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు.

పశ్చిమ బెంగాల్‌లో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ధీమా వ్యక్తం చేశారు. 2019 నుంచి ఆ రాష్ట్రంలో బీజేపీకి ఓటింగ్ 30-40 శాతంగా ఉంటోందన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు మరో 10శాతం ఓట్లు అవసరమని చెప్పారు. మరోవైపు బెంగాల్‌లో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు సీఎం మమతా బెనర్జీ అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

HYD నార్సింగిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన డా.భూమిక (కర్నూలు) చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్ అయ్యారు. దీంతో జీవన్‌దాన్, అవయవ దానం కోసం వారి కుటుంబసభ్యులను సంప్రదించగా.. తీవ్రమైన దుఃఖంలోనూ వారు అంగీకరించారు. దీంతో భూమిక గుండె, లివర్, రెండు కిడ్నీలు, ఊపిరితిత్తులను ఇతర వ్యక్తులకు అమర్చారు. మరణంలోనూ డాక్టరమ్మ తన వృత్తిధర్మాన్ని నిర్వర్తించారని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు.

TG: కాంగ్రెస్, BRSవి కాంప్రమైజ్ పాలిటిక్స్ అని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ-రేస్ కేసుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తమ నేతలను అరెస్టు చేయకుండా ఉండేందుకు BRS ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉందన్నారు. ఎంఐఎం ఒత్తిడితోనే ముస్లింలను బీసీల్లో కలిపారని, బీసీ సంఘాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

WPLలో యూపీ వారియర్స్ కెప్టెన్‌గా భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మను ఆ ఫ్రాంచైజీ నియమించింది. గత సీజన్‌లో దీప్తి ఆ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నారు. రెగ్యులర్ కెప్టెన్ అలీసా హీలీ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా 27 ఏళ్ల దీప్తి భారత్ తరఫున 124 టీ20లకు ప్రాతినిధ్యం వహించారు. WPLలో 17 మ్యాచులు ఆడి 385 పరుగులు, 19 వికెట్లు సాధించారు.

ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు తాను రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్ కాల్ మాట్లాడానని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ‘మా ఇద్దరి మధ్య ఎన్నిసార్లు ఫోన్ కాల్ సంభాషణ జరిగిందనేది ప్రస్తుతానికి రహస్యం. కానీ అమాయకుల ప్రాణాలు పోకుండా ఆపాలని పుతిన్ కూడా కోరుకుంటున్నారు. యుద్ధాన్ని ఆపేందుకు మంచి ప్రణాళిక ఉంది. వచ్చేవారం ఉక్రెయిన్‌లో పర్యటించి ఆ దేశాధ్యక్షుడితో భేటీ అవుతా’ అని స్పష్టం చేశారు.

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు వెళ్లారు. తన తల్లితో కలిసి ఆయన త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. విజయ్ దేవరకొండ ప్రస్తుతం కొత్త గెటప్‌లో కనిపిస్తున్నారు. షార్ట్ హెయిర్‌తో పూర్తిగా విభిన్నంగా ఉన్నారు. కాగా విజయ్ నటిస్తున్న వీడీ12’(వర్కింగ్ టైటిల్) మూవీ నుంచి ఈ నెల 12న టైటిల్, టీజర్ విడుదల కానున్నాయి.

TG: రాష్ట్రంలో పనుల కోసం వెళ్లిన ఎమ్మెల్యేలను మంత్రులు కమీషన్లు, పర్సంటేజీలు అడుగుతున్నారని BRS నేత హరీశ్ రావు ఆరోపించారు. ‘బిల్లు పాస్ కావాలంటే 10% పర్సంటేజ్ అడుగుతున్నారు. భూ సమస్యలు క్లియర్ కావాలంటే 30% పర్సంటేజ్ డిమాండ్ చేస్తున్నారు. మంత్రుల వైఖరి నచ్చకే ఇటీవల ఆ పార్టీ ఎమ్మెల్యేలు రహస్య మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. రాష్ట్ర సంపదంతా ఢిల్లీకి దోచిపెడుతున్నారు’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఇంగ్లండ్ భారీ స్కోరు నమోదు చేసింది. 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. ఆరంభంలో భారత జట్టు ఫీల్డింగ్ వైఫల్యం ఇంగ్లండ్‌కు కలిసొచ్చింది. ఓపెనర్ డకెట్(65), రూట్(69) అర్ధసెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో జడేజా 3, షమీ, వరుణ్ చక్రవర్తి, హార్దిక్, హర్షిత్ తలో వికెట్ తీశారు. టీమ్ ఇండియా టార్గెట్ 50 ఓవర్లలో 305.

TG: పంచాయితీ పెట్టి పరువు తీసిందనే కోపంతోనే గురుమూర్తి తన భార్యను హతమార్చినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిసింది. ఎలాగైనా భార్య అడ్డు తొలగించుకోవాలని JAN 15న పిల్లలను చెల్లెలి ఇంటి దగ్గర వదిలాడు. 16న భార్య గొంతు నులిమి చంపి, డెడ్ బాడీని ముక్కలుగా చేసి హీటర్‌తో ఉడికించాడు. మిగిలిన ముక్కలను బకెట్లో వేసి పెద్ద చెరువులో పడేశాడు. గురుమూర్తికి అతడి చెల్లెలు, తల్లి, తమ్ముడు సహకరించినట్లు తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.