News February 9, 2025

బెంగళూరులో మెట్రో ఛార్జీలు 50% పెంపు!

image

బెంగళూరులో మెట్రో ట్రైన్ ఛార్జీలు పెరిగాయి. టికెట్ ధర కనిష్ఠంగా రూ.10, గరిష్ఠంగా రూ.90గా ఉంది. గరిష్ఠ టికెట్ ధరను రూ.60 నుంచి రూ.90కి పెంచారు. ఈ పెంపు నేటి నుంచి అమల్లోకి రానుంది. 0-2kmsకి రూ.10, 2-4kmsకి 20, 6-8kms 40, 8-10kms 50, 20-25kms 80, 25-30kmsకి 90 ఛార్జ్ చేస్తారు. స్మార్ట్ కార్డులపై 5% డిస్కౌంట్‌ను కొనసాగించనున్నారు. కాగా ఇటీవల కర్ణాటకలో ఆర్టీసీ ఛార్జీలను 15% పెంచిన సంగతి తెలిసిందే.

News February 9, 2025

రేషన్ కార్డులపై ఎలాంటి ఆదేశాలివ్వలేదు: ఈసీ

image

TG: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి బ్రేక్ వేసినట్లు జరుగుతున్న ప్రచారంపై ఈసీ వివరణ ఇచ్చింది. రేషన్ కార్డుల జారీని నిలిపివేయాలని తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని స్పష్టం చేసింది. ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని తెలిపింది.

News February 9, 2025

ఫోన్ స్క్రీన్ టైమ్ ఇలా తగ్గించుకోండి!

image

* అనవసరమైన యాప్‌ల నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి.
* 30minకి ఒకసారి స్క్రీన్ బ్రేక్ తీసుకోండి. వారంలో ఒక రోజు ఫోన్ వాడకండి.
* బుక్స్ చదవడం, వ్యాయామం, పెయింటింగ్ వంటివి చేయండి
* బాత్రూమ్, బెడ్ రూమ్‌లోకి ఫోన్ తీసుకెళ్లొద్దు
* ఫోన్ వాడకాన్ని తగ్గిస్తున్నట్లు మీ ఫ్రెండ్స్‌కు చెప్పండి. మెసేజ్‌లకు లేట్‌గా రిప్లై ఇచ్చినా ఏం కాదు
* ఫోన్‌ ఎక్కువగా వాడొద్దన్న విషయాన్ని పదే పదే గుర్తుచేసుకోండి.

News February 9, 2025

బంగ్లాదేశ్‌లో హిందువులపై 2 నెలల్లో 76 దాడులు

image

బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు జరగడంపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నవంబర్ 26, 2024 నుంచి జనవరి 25, 2025 వరకు బంగ్లాలో హిందువులపై మొత్తం 76 దాడులు జరిగాయని పార్లమెంటులో వెల్లడించింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఇప్పటివరకు 23 మంది హిందువులు చనిపోయారని, 152 దేవాలయాలపైనా దాడులు జరిగినట్లు పేర్కొంది. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయాక ఆ దేశంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

News February 9, 2025

రోజుకు 2-3 గంటలే నిద్రపోతా: సల్మాన్ ఖాన్

image

తాను రోజుకు 2-3 గంటలే నిద్రపోతానని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తెలిపారు. నెలలో 2-3 సార్లు మాత్రమే 7-8 గంటలు నిద్రపోతానని తన తమ్ముడి కొడుకు అర్హాన్ ఖాన్ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. ‘షూటింగ్ గ్యాప్‌లో కూడా చిన్న కునుకు తీస్తా. విమానం కుదుపులకు గురైనా హాయిగా నిద్రపోతా. జైలులో ఉన్నప్పుడు మాత్రం నిద్రకు ఎక్కువ సమయం కేటాయించా’ అని చెప్పుకొచ్చారు. కాగా సల్మాన్ ప్రస్తుతం ‘సికందర్’ సినిమాలో నటిస్తున్నారు.

News February 9, 2025

SA20 టోర్నీ విజేతగా MI కేప్‌టౌన్

image

SA20-2025 టైటిల్‌ను MI కేప్‌టౌన్ గెలుచుకుంది. సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌తో జరిగిన ఫైనల్‌లో 76 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత MI 181-8 స్కోర్ చేయగా, ఛేదనలో తడబడిన సన్‌రైజర్స్ 105 పరుగులకే పరిమితమైంది. ఈ టోర్నీ చరిత్రలో MIకి ఇదే తొలి టైటిల్. కాగా తొలి రెండు సీజన్లలో సన్ రైజర్స్ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

News February 9, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 9, 2025

CCL: తెలుగు వారియర్స్ ఓటమి

image

సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో కర్ణాటక బుల్డోజర్స్‌తో మ్యాచులో తెలుగు వారియర్స్ 46 రన్స్ తేడాతో ఓటమిపాలైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక తొలి ఇన్నింగ్స్‌లో 113/3 స్కోర్ చేయగా, తెలుగు టీమ్ 99/5 చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బుల్డోజర్స్ 123/3 స్కోర్ సాధించగా, వారియర్స్ 91/9కే పరిమితమై పరాజయం పాలైంది. KA జట్టులో డార్లింగ్ కృష్ణ 38 బంతుల్లోనే 80 రన్స్ చేసి రాణించారు.

News February 9, 2025

ఫిబ్రవరి 9: చరిత్రలో ఈరోజు

image

1966: బాలీవుడ్ నటుడు రాహుల్ రాయ్ జననం
1969: బోయింగ్-747 విమానాన్ని మొదటిసారి పరీక్షించారు
1975: సినీ నటుడు సుమంత్ జననం
2008: సంఘ సేవకుడు, పద్మశ్రీ, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత మురళీధర్ దేవదాస్ ఆమ్టే మరణం
2021: సంగీత దర్శకుడు సుసర్ల దక్షిణామూర్తి మరణం (ఫొటోలో)

News February 9, 2025

ఈరోజు నమాజ్ వేళలు

image

✒ తేది: ఫిబ్రవరి 09, ఆదివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.32 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.45 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.39 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6.15 గంటలకు
✒ ఇష: రాత్రి 7.29 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.