India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు అంత్యక్రియలు రేపు స్వగ్రామం నారావారిపల్లెలో జరుగుతాయి. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు చంద్రబాబు రేపు ఇక్కడకు రానున్నారు. ఆయనతో పాటు కుటుంబసభ్యులు, నందమూరి కుటుంబసభ్యులు కూడా వస్తారు. కాగా గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో రామ్మూర్తి కన్నుమూసిన విషయం తెలిసిందే.
పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ‘మట్కా’ బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. ఈ సినిమా విడుదలైన రెండు రోజుల్లో రూ.1.10 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. విడుదలకు ముందు రూ.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినా బ్రేక్ ఈవెన్ రావాలంటే మరో రూ.19 కోట్లు రావాలని పేర్కొన్నాయి. ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరోగా, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్లుగా నటించారు.
AP: ఒకప్పుడు ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఎన్నికల్లో పోటీకి అనర్హులని ప్రకటించారని సీఎం చంద్రబాబు అన్నారు. కానీ ఇప్పుడు కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీ చేసేలా నిబంధన పెట్టాలని అభిప్రాయపడ్డారు. ‘మన దేశంలో జనాభా పెంచాలి. 30, 40 కోట్ల మంది విదేశాలకు వెళ్లి ఆదాయం తీసుకురావాలి. ఒకప్పుడు బ్రిటిష్ వారు ఏలినట్లు, ఇప్పుడు మనం ఏలాలి. ఇందుకు పాపులేషన్ మేనేజ్‌మెంట్ చేయాలి’ అని ఆయన వ్యాఖ్యానించారు.
AP: గత ప్రభుత్వంలో టిడ్కో ఇళ్లలో జరిగిన అక్రమాలపై మంత్రి నారాయణ విచారణకు ఆదేశించారు. లబ్ధిదారుల కేటాయింపు, డీడీల చెల్లింపుల్లో అవకతవకలపై MLAల ఫిర్యాదులతో విచారణ చేస్తున్నామని మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. అటు 7 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతులు తీసుకొచ్చామని, గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇళ్లు నిర్మిస్తామన్నారు. ముందుగా 4.54 లక్షల ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచామన్నారు.
TG: మూసీ పరీవాహకంలో 30 ఏళ్ల క్రితమే బస్తీలు అభివృద్ధి చెందాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బ్యూటిఫికేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికిప్పుడు పేదల ఇళ్లు కూల్చివేయడం సబబు కాదన్నారు. తాను 3 నెలలు బస్తీల్లో ఉండటానికైనా సిద్ధమని, అవసరమైతే తన ఇంటిని ఇక్కడికి షిఫ్ట్ చేసుకుంటానని పేర్కొన్నారు. సీఎం రేవంత్ మూసీ పునరుజ్జీవం కార్యక్రమాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బంగ్లాదేశ్‌లో హిందువులు, మైనారిటీలపై దాడులను అరికట్టేలా ఆ దేశ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతోపాటు ఆర్థికపరమైన ఆంక్షలు విధించాలని భారతీయ అమెరికన్లు త్వరలో ట్రంప్‌ను కోరనున్నారు. ట్రంప్ ఇటీవల బంగ్లాలో హిందువులపై దాడులను ఖండించిన విషయం తెలిసిందే. దీంతో బంగ్లాపై కఠిన చర్యలకు ట్రంప్ వెనుకాడబోరని ఫిజీషియన్ భరత్ బరాయ్ పేర్కొన్నారు. ఈ విషయమై బంగ్లా స్పందించకపోతే కాంగ్రెస్‌ను కూడా ఆశ్రయిస్తామని పేర్కొన్నారు.
టాలీవుడ్ హీరో సుశాంత్‌తో పెళ్లి జరగనుందనే ప్రచారాన్ని హీరోయిన్ మీనాక్షి చౌదరి కొట్టిపారేశారు. ప్రస్తుతం తాను సింగిల్‌గానే ఉన్నానని, ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తనపై ప్రతిసారి ఏదో ఒక ప్రచారం చేయడం సర్వసాధారణంగా మారిందన్నారు. కాగా వీరిద్దరు కలిసి ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాలో నటించారు.
MH ఎన్నికల్లో 87 చోట్ల ఏది అసలైన పార్టీయో తెలియక ప్రజలు గందరగోళంలో ఉన్నారు. NCP, శివసేన చీలిపోవడంతో కొత్తగా NCP SP, శివసేన UBT ఏర్పడ్డాయి. ఇప్పుడీ 4 పార్టీలు 2 కూటముల్లో ఉన్నాయి. అలా 51 సీట్లలో శివసేన షిండే వర్గం-శివసేన ఉద్ధవ్ వర్గం పోటీపడుతున్నాయి. 36 చోట్ల NCP అజిత్ వర్గం-NCP శరద్ పవార్ వర్గాలు బరిలో ఉన్నాయి. ఈ 87 చోట్ల ఎవరిది ఏ పార్టీయో తెలియక ప్రజలు తికమకపడుతున్నారు.
పితృ వియోగంతో శోకసంద్రంలో మునిగిపోయిన టాలీవుడ్ హీరో నారా రోహిత్‌ను తన పెద్దనాన్న, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. రామ్మూర్తి కుమారులైన గిరీశ్, రోహిత్‌లను హత్తుకుని ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరలవుతున్నాయి. కాగా, రామ్మూర్తికి నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన AIG ఆస్పత్రికి చేరుకుంటున్నారు.
ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఫిర్యాదులపై ECI చర్యలు తీసుకుంది. వెంటనే వివరణ ఇవ్వాలని BJP చీఫ్ జేపీ నడ్డా, INC ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేకు లేఖలు రాసింది. NOV 18వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంట లోపు అధికారికంగా స్పందించాలని ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికల టైమ్‌లోనూ ECI సీరియసైన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో ఈ రెండు పార్టీలు దూకుడుగా విమర్శలు చేసుకుంటున్నాయి.
Sorry, no posts matched your criteria.