News August 13, 2024

ఉక్రెయిన్ అధీనంలోకి రష్యాలోని ప్రాంతం: జెలె‌న్‌స్కీ

image

రష్యాలో మిలిటరీ ఆపరేషన్ చేపట్టినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అధికారికంగా వెల్లడించారు. దాదాపు 1000 చ.కి.మీకు పైగా రష్యాలోని కర్క్స్ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్నట్లు ఉక్రెయిన్ మిలిటరీ కమాండర్ తెలిపారు. కాగా ఆ ప్రాంతంలో ఇప్పటికే రష్యా అత్యవసర పరిస్థితిని విధించింది. ఇటీవల ఉక్రెయిన్ సైన్యం వందల సంఖ్యలో రష్యాలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.

News August 13, 2024

అప్పుడు శోభిత స‌మాధానం ఇదే..

image

2013లో ఓ బ్యూటీ కాంటెస్ట్‌లో జ‌డ్జ్ అడిగిన ప్ర‌శ్న‌కు నటి శోభిత ధూళిపాళ్ల చెప్పిన స‌మాధానం వైర‌ల్ అవుతోంది. స్వతంత్ర యువతిగా, డ్రెస్ కోడ్‌ను అమలు చేసే అధికారం ప్రభుత్వాలు లేదా కాలేజీలకు ఉండాలని మీరు అనుకుంటున్నారా? అని ప్రశ్నించగా.. ‘నిర్దిష్ట యూనిఫాం ధరించాలన్న నిబంధనలు అమలు చేయకూడదు. స్వేచ్ఛను హరించే ఏకపక్ష నిబంధనలతో నైతిక ప్రవర్తనను సరిదిద్దలేము’ అని శోభిత బదులిచ్చింది.

News August 13, 2024

ఇండోనేషియాలో రోహిత్ క్రికెట్ అకాడమీ

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇండోనేషియాలో తన క్రిక్‌కింగ్‌డమ్ అకాడమీని లాంచ్ చేశారు. దీనిని రోహిత్ బెస్ట్ ఫ్రెండ్, టీమ్ ఇండియా క్రికెటర్ ధవల్ కులకర్ణి ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా ఇప్పటికే 7 దేశాల్లో క్రిక్‌కింగ్‌డమ్ అకాడమీలు ఉన్నాయి. ఇటీవల అమెరికాలోని డల్లాస్‌లోనూ ఈ అకాడమీ ప్రారంభించారు.

News August 13, 2024

నేడు శ్రీహరికోటకు పవన్ కళ్యాణ్

image

AP: తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం షార్‌‌‌లో ఇవాళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన అక్కడికి చేరుకుని స్పేస్ డే ఈవెంట్‌లో పాల్గొంటారు. ఆ తర్వాత రాకెట్ ప్రయోగ వేదికను సందర్శిస్తారు. అనంతరం ఆయన తిరుగుపయనమవుతారు. కాగా పవన్ పర్యటనకు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ అధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

News August 13, 2024

దాడుల‌ను ఖండించిన విప‌క్షాలు

image

బంగ్లాలో మైనారిటీలపై జ‌రుగుతున్న దాడుల‌ను INDIA BLOC నేత‌లు ఖండించారు. బంగ్లా ప్రభుత్వాధినేత మ‌హ‌హ్మ‌ద్ యూన‌స్ నాయకత్వంలో పరిస్థితి మెరుగుపడవచ్చని NCP(SP) చీఫ్ శరద్ పవార్ అన్నారు. మైనారిటీలపై దాడులు కలిచివేస్తున్నాయని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ చెప్పారు. భారత ప్రభుత్వం అంతర్జాతీయంగా ఈ అంశాన్ని లేవనెత్తాలని SP చీఫ్ అఖిలేశ్ యాదవ్ కోరారు.

News August 13, 2024

‘హర్ ఘర్ తిరంగా’.. జాతీయ జెండా కావాలంటే?

image

TG: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగా-3.0’ కార్యక్రమంలో భాగంగా ప్రతిఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని కేంద్రం సూచించిన విషయం తెలిసిందే. అయితే, జాతీయ జెండా కావాలంటే స్థానికంగా ఉన్న పోస్ట్ ఆఫీస్ కేంద్రాలను సంప్రదించాలి. తెలంగాణలోని 33 జిల్లాల్లోని 6,380 పోస్టాఫీసుల్లో 20X30 సైజులో రూ.25కు జెండాలను కొనుగోలు చేయవచ్చు. <>ఆన్‌లైన్‌లోనూ<<>> బుక్ చేయవచ్చు.

News August 13, 2024

‘రాజాసాబ్’ సెట్‌లో అడుగుపెట్టిన ప్రభాస్

image

ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శంషాబాద్‌లో జరుగుతోంది. ఈ సెట్‌లో హారర్ సీన్స్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ సూపర్ బజ్ క్రియేట్ చేసింది. మారుతి రూపొందిస్తున్న ఈ మూవీలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ ఫీమేల్ రోల్ పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న మూవీ విడుదల కానుంది.

News August 13, 2024

శ్రీనివాసరావు VRSకు సర్కార్ ఓకే

image

TG: ప్రజారోగ్య శాఖ మాజీ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు VRSకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొద్ది రోజుల క్రితం ఆయన VRSకు దరఖాస్తు చేసుకోగా ఈ నెల 8న ఆమోదించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. కాగా ప్రజారోగ్య శాఖలో జేడీ స్థాయిలో ఉన్న శ్రీనివాసరావును రేవంత్ సర్కార్ మహబూబాబాద్ అడిషనల్ డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్‌గా నియమించింది. కానీ ఆ పోస్టులో చేరేందుకు ఆయన ఆసక్తి చూపలేదు.

News August 13, 2024

ఆగస్టు 13: చరిత్రలో ఈ రోజు

image

1888: టెలివిజన్ రూపకర్త జాన్ బైర్డ్ జననం
1899: హాలీవుడ్ డైరెక్టర్ ఆల్‌ఫ్రెడ్ హిచ్‌కాక్ జననం
1926: క్యూబా నియంత ఫిడేల్ కాస్ట్రో రుజ్ జననం
1933: సినీ నటి వైజయంతి మాల జననం
1963: సినీ నటి శ్రీదేవి జననం
1975: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ జననం
1986: డైరెక్టర్ అజయ్ భూపతి జననం
1994: సినీ నటుడు రావు గోపాలరావు మరణం
ప్రపంచ ఎడమచేతి వాటం ప్రజల దినోత్సవం

News August 13, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.