News August 10, 2024

మీకు విశ్వసనీయత ఉందా?

image

భార‌త్‌కు సంబంధించి మ‌రో ప్ర‌క‌ట‌న చేస్తామన్న హిండెన్‌బ‌ర్గ్‌ను భార‌తీయులు టార్గెట్ చేశారు. అస‌లు మీకు విశ్వ‌స‌నీయత ఉందా అంటూ కామెంట్లు ఎక్కుపెట్టారు. అదానీ స్టాక్స్ విష‌యంలో చేసిన ఆరోప‌ణ‌లు త‌ప్ప‌ని తేల‌డంతో హెండెన్‌బ‌ర్గ్ ప్ర‌క‌ట‌న‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో చేసిన ప్ర‌క‌ట‌న త‌రువాత ఇప్పటివరకు సెన్సెక్స్ 20,000 పాయింట్లు గెయిన్ చేసింది.

News August 10, 2024

కేరళ చేరుకున్న పీఎం మోదీ

image

ప్రధాని మోదీ కేరళలోని కన్నూర్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్, గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ఆయనకు స్వాగతం పలికారు. వయనాడ్‌లో పీఎం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం సహాయక శిబిరాలను సందర్శించి బాధితులతో మాట్లాడతారని తెలుస్తోంది. సీఎం, ఉన్నతాధికారులతో ఈరోజు మధ్యాహ్నం ఆయన సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. కేంద్రం నుంచి రూ.2వేల కోట్ల ఆర్థిక సాయాన్ని కేరళ ఆశిస్తోంది.

News August 10, 2024

మహేశ్ బాబు మనసు బంగారం

image

మహేశ్‌బాబు మరోసారి మంచి మనసు చాటుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా సొంతూరు బుర్రిపాలెంలో నిన్న మహేశ్‌బాబు ఫౌండేషన్ మల్టీ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ నిర్వహించింది. 155 మందికి డాక్టర్లు వైద్యం చేసి, మందులు పంపిణీ చేశారు. ఇది 41వ క్యాంపు అని నిర్వాహకులు తెలిపారు. దీంతో సూపర్ స్టార్ మనసు బంగారమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఆయన ఎంతో మంది పిల్లలకు గుండె సర్జరీలు <<13811914>>చేయించిన<<>> విషయం తెలిసిందే.

News August 10, 2024

మిథున్‌రెడ్డికి భద్రత పెంపు

image

AP: వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి భద్రత పెంచారు. తనకు భద్రత తక్కువగా ఉందని ఆయన కోరడంతో కేంద్ర హోంశాఖ Y కేటగిరీ సెక్యూరిటీని కల్పించింది. 4+4 CRPF సిబ్బంది నిత్యం మిథున్‌కు భద్రతగా ఉండనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక తనకు భద్రతను తగ్గించారని పలుమార్లు ఆరోపించిన ఆయన ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.

News August 10, 2024

రేవంత్ సర్కార్ వైఫల్యం.. తగ్గిన సాగు విస్తీర్ణం: BRS

image

TG: వానాకాలం సీజన్ అయిపోవస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రైతుబంధు, కొత్త పంట రుణాలు ఇవ్వలేదని బీఆర్ఎస్ విమర్శించింది. ఈ కారణంగానే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా తగ్గిందని ట్వీట్ చేసింది. విత్తనాలు అందుబాటులో ఉంచడంలోనూ రేవంత్ సర్కార్ వైఫల్యం చెందిందని, దీంతో పత్తి సహా ఇతర ఆరుతడి పంటల సాగు తగ్గిందని పేర్కొంది. దీనిపై మీ కామెంట్?

News August 10, 2024

మాల్దీవ్స్‌తో భార‌త్ చ‌ర్చ‌లు

image

ద్వైపాక్షిక‌ సంబంధాల‌ బలోపేతానికి భార‌త్ – మాల్దీవులు చ‌ర్చ‌లు ప్రారంభించాయి. భార‌త విదేశాంగ మంత్రి జైశంక‌ర్ ఇప్పటికే మాలే చేరుకొని ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జ‌మీర్‌తో భేటీ అయ్యారు. భార‌త ‘నైబ‌ర్‌హుడ్‌ ఫ‌స్ట్’ పాల‌సీలో మాల్దీవ్స్‌ కీల‌క‌మ‌ని, ఈ చ‌ర్చ‌లు ఇరు దేశాల మ‌ధ్య సత్సంబంధాల‌ను బ‌లోపేతం చేయ‌డానికి ఉప‌కరిస్తాయ‌ని జైశంక‌ర్ ఆశాభావం వ్య‌క్తం చేశారు.

News August 10, 2024

మాల్దీవ్స్‌తో వివాదం ఏంటి?

image

చైనా అనుకూలుడైన మాల్దీవ్స్ అధ్య‌క్షుడు మొయిజ్జు ఇటీవ‌ల‌ భార‌త వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంబిస్తున్నారు. డ్రాగ‌న్ దేశంతో వాణిజ్య‌-వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యాన్ని పెంచుకుంటున్నారు. ఇటీవ‌ల మోదీని ఉద్దేశించి ఆ దేశ మంత్రులు చేసిన వ్యాఖ్య‌లపై ఆగ్రహించిన భార‌తీయులు బాయ్‌కాట్ మాల్దీవ్స్‌కు పిలుపునిచ్చారు. అనంత‌రం ఆ దేశ ప్ర‌భుత్వం భార‌త సైన్యాన్ని వెన‌క్కి పంపడం వంటివి వివాదాన్ని మ‌రింత పెంచాయి.

News August 10, 2024

భార్య.. అమ్మగా మారిన వేళ

image

TG: భార్యాభర్తలు, తల్లిదండ్రులు-బిడ్డల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న రోజులివి. ఇలాంటి సమాజంలో ఓ మహిళ తన భర్తకు అమ్మగా మారింది. ఆదిలాబాద్(D) ఏసాపూర్‌కు చెందిన విజయ్, లక్ష్మి దంపతులు. వారికి ఇద్దరు పిల్లలు. 2018లో విజయ్ 2 కిడ్నీలు చెడిపోయాయి. దీంతో భార్య ఆరేళ్లుగా కూలీ పనులకు వెళ్తూ, భర్తకు 36KMల దూరంలో ఉన్న ఆస్పత్రిలో చికిత్స అందిస్తూ ప్రాణాలు కాపాడుకుంటోంది. ఎవరైనా సాయం చేయాలని వేడుకుంటోంది.

News August 10, 2024

ఉచిత బస్సు ప్రయాణంపై ఎల్లుండి ప్రకటన!

image

AP: రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు అమలు తేదీని ఈ నెల 12న సీఎం నిర్వహించే సమీక్షలో ప్రకటించే అవకాశముందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీలో రద్దీకి తగినట్లుగా కొత్త బస్సులను పెంచనున్నట్లు తెలిపారు. RTCలో 7వేల మంది సిబ్బంది కొరత ఉందని, ఖాళీల భర్తీపై సీఎంతో చర్చిస్తామన్నారు. కారుణ్య నియామకాల్లో ఆలస్యాన్ని తగ్గిస్తామని పేర్కొన్నారు.

News August 10, 2024

క్యాన్సర్‌తో యూట్యూబ్ మాజీ సీఈవో మృతి

image

యూట్యూబ్ మాజీ సీఈవో సుసాన్ డయాన్ వోజ్‌కికీ(56) క్యాన్సర్‌తో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె భర్త డెన్నిస్ ట్రాపర్ వెల్లడించారు. యూఎస్‌కు చెందిన సుసాన్ 2014 నుండి 2023 వరకు యూట్యూబ్‌ సీఈవోగా పనిచేశారు. ఆమె మృతిపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె రెండేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారని పేర్కొన్నారు.