India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మానస సరోవర్ యాత్రను పున:ప్రారంభించాలని భారత్, చైనా కలిసి నిర్ణయించాయి. ఇందుకోసం ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నడపాలని అంగీకరించాయి. ఈ మేరకు భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, చైనా విదేశాంగ ఉప మంత్రి సన్ వెయ్‌డాంగ్ భేటీ అయ్యారు. అంతర్జాతీయ నదులు, జల వనరులకు సంబంధించి డేటాను ఇచ్చిపుచ్చుకునేందుకు నిర్ణయించుకున్నాయి. కాగా కొవిడ్-19 కారణంగా మానస సరోవర్ యాత్రను 2020లో నిలిపివేశారు.

TG: మాజీ సీఎం కేసీఆర్ సొంతంగా ఫోన్ వాడుతున్నారు. సీఎంగా ఉన్నన్ని రోజులు ఆయన ఫోన్ ఉపయోగించలేదు. కుటుంబసభ్యులు, నేతలు, సిబ్బంది ఫోన్లతోనే ఆయన ఇతరులతో మాట్లాడేవారు. ఇప్పుడు ఆయనకు కేటీఆర్ తనయుడు, తన మనవడు హిమాన్ష్ ఫోన్ ఆపరేట్ చేయడం నేర్పించారు. కేటీఆర్, హరీశ్, కవితతోపాటు పార్టీ ముఖ్య నేతలు, సన్నిహితుల ఫోన్ నంబర్లను సేవ్ చేసుకున్నారు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు.

AP: పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సెలవుల్లోనూ వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు విద్యార్థులకు భోజనం అందించాలని విద్యాశాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 10 వరకు రెండు రెండో శనివారాలు, ఆరు ఆదివారాలు ఉన్నాయి. ఆ రోజుల్లో విద్యార్థులకు భోజనం అందించాలని ఇప్పటికే ఉత్తర్వులు వెలువడ్డాయి.

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుుడు బీజేపీలో చేరతారని తెలుస్తోంది. ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఏబీవీపీ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఆ సదస్సులో ఆయన బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. దేశం కోసం పని చేసే పార్టీ బీజేపీ ఒక్కటేనని ఆకాశానికెత్తారు. అప్పటి నుంచి ఆయన కాషాయ పార్టీ గూటికి చేరతారని వార్తలు వస్తున్నాయి. కాగా రాయుడు గతంలో వైసీపీలో చేరారు. అనంతరం ఆ పార్టీని వీడి జనసేన పార్టీతో కనిపించారు.

భారత్, ఇంగ్లండ్ మధ్య ఇవాళ మూడో టీ20 జరగనుంది. రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా 5 మ్యాచుల సిరీస్‌లో టీమ్ ఇండియా వరుస విజయాలతో దూసుకెళ్తూ ఇప్పటికే 2-0తో ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచులో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని సూర్య సేన భావిస్తోంది. మరోవైపు ఇవాళ గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని ఇంగ్లండ్ పట్టుదలతో ఉంది. ఈ మ్యాచులో టాస్ కీలకంగా మారనుంది.

TG: సీఎం రేవంత్ ఇవాళ రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూర్‌లో పర్యటించనున్నారు. అక్కడ 150 ఎకరా విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ‘ఎక్స్‌పీరియం పార్కు’ను ఆయన ప్రారంభిస్తారు. ఇదే కార్యక్రమంలో సినీ నటుడు చిరంజీవి కూడా పాల్గొంటారు. కాగా రూ.450 కోట్ల వ్యయంతో రామ్‌దేవ్ రావు ఈ పార్కును ఏర్పాటు చేశారు. ఇందులో 85 దేశాల నుంచి అనేక రకాల జాతుల మొక్కలు, చెట్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు.

మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో ‘SSMB 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం నుంచి ఎలాంటి లీక్‌లు బయటకు రాకుండా మేకర్స్ జాగ్రత్తలు పడ్డట్లు టాక్. మహేశ్‌తో సహా ఎవరూ సెట్‌లోకి ఫోన్ తీసుకురాకూడదట. అందరితో నాన్-డిస్‌క్లోజ్ అగ్రిమెంట్(NDA)చేసుకున్నట్లు తెలుస్తోంది. లీక్ చేస్తే భారీ మూల్యం చెల్లించాలి.

భార్య వేధింపులతో మరో భర్త సూసైడ్ చేసుకున్నారు. KAలోని హుబ్లీలో పీటర్, ఫిబీ(పింకీ)లకు రెండేళ్ల కిందట పెళ్లి కాగా, మనస్పర్థలతో 3నెలలుగా విడిగా ఉంటున్నారు. ‘నా భార్య నన్ను చంపుతోంది. నేను చనిపోవాలని ఆమె కోరుకుంది’ అని పీటర్ రాసిన సూసైడ్ నోట్ వైరలవుతోంది. విడాకుల కోసం ఫిబీ సోదరుడు రూ.20 లక్షలు డిమాండ్ చేశాడని, ఆఫీస్ మీటింగ్‌లో ఉండగా భార్య గొడవపడటంతో పీటర్ జాబ్ పోయిందని మృతుడి తండ్రి చెప్పారు.

కొందరికి మధ్యాహ్న భోజనం అనంతరం నిద్ర ముంచుకు వస్తుంది. పని చేసేందుకు శరీరం ఏమాత్రం సహకరించదు. కానీ కొన్ని పద్ధతులు పాటిస్తే నిద్రను కట్టడి చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజూ ఖచ్చితంగా ఒకే సమయానికి నిద్ర పోవాలి. రాత్రి వేళల్లో టీ, కాఫీ తాగితే సరిగా నిద్ర పట్టదు. దీంతో మధ్యాహ్నం నిద్ర వస్తుంది. అందుకే వాటికి దూరంగా ఉండటం మంచిది. ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి. టీవీ, ఫోన్లు చూడటం తగ్గించడం ఉత్తమం.

పురుషులతో పోలిస్తే మహిళలే చలికి ఎక్కువగా వణుకుతుంటారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత, నెలసరి, జీవక్రియ రేటు కారణంగా శరీరంలో తక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. ఉష్ణోగ్రత తగ్గడం వల్ల వారు మరింత చలి ఫీల్ అవుతారు. అలాగే వారి శరీరంలోని కొవ్వు అంతర్గత వేడిని ప్రసరింపజేసే రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. దీంతో ఆడవాళ్లు మరింత చలిని అనుభవిస్తారు.
Sorry, no posts matched your criteria.