India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ప్రభుత్వ స్కూళ్లలో స్పెషల్ క్లాసులకు హాజరయ్యే టెన్త్ విద్యార్థులకు ఈవెనింగ్ స్నాక్స్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 20వ తేదీ వరకు దీనిని అమలు చేయనుంది. ఉడకబెట్టిన పెసర్లు, బొబ్బర్లు, పల్లి పట్టీ, మిల్లెట్ బిస్కెట్లు, ఆనియన్ పకోడీ, శనగలు అందించాలని ఆదేశించింది. ఒక్కో స్టూడెంట్‌కు రోజుకు రూ.15 చొప్పున ఖర్చు చేయనుంది. MAR 21 నుంచి టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో Jr.NTR నటించబోయే సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశకు చేరుకుందని పేర్కొన్నాయి. ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ‘ఎంటర్ ది డ్రాగన్’, ‘NTR ది డ్రాగన్’ అనే టైటిళ్లను కూడా మూవీ టీమ్ పరిశీలిస్తోందని వార్తలొస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

27 ఏళ్ల క్రితం తప్పిపోయిన తన భర్తను ఓ భార్య కుంభమేళాలో గుర్తించారు. ఝార్ఖండ్‌కు చెందిన గంగాసాగర్ 1998లో భార్య ధన్వా దేవి, పిల్లలను వదిలేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన కోసం వారు వెతుకుతూనే ఉన్నారు. కుంభమేళాకు వెళ్లిన కుటుంబసభ్యులకు ఆయన అఘోరాగా కనిపించారు. అతడి నుదుటిపై మచ్చ, ఎత్తు పళ్లు, మోకాలిపై దెబ్బలు గుర్తించి తన భర్తేనని ధన్వా దేవి గుర్తించారు. కానీ వారితో వచ్చేందుకు ఆయన నిరాకరించారు.

AP: రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలకు శ్రీకారం చుట్టనుంది. ఇవాళ మంత్రి నారా లోకేశ్ దీనిని అధికారికంగా ప్రారంభిస్తారు. తొలి విడతలో భాగంగా విద్యుత్, దేవదాయ, ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ వంటి 161 శాఖల్లో సేవలు మొదలవుతాయి. వాట్సాప్ గవర్నెన్స్‌లో భాగంగా ప్రభుత్వ అధికారిక వాట్సాప్ నంబర్ ప్రకటిస్తారు. దీని ద్వారా పౌరులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వ సేవలు పొందనున్నారు.

డిజిటల్ మోసాలను అరికట్టేందుకు బ్యాంకులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ ఆదేశించింది. నష్టాలను తగ్గించుకునేందుకు థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లపై మెరుగైన పర్యవేక్షణ ఉండాలని సూచించింది. అలాగే లిక్విడిటినీ పెంచుకునేందుకు సెంట్రల్ బ్యాంక్ రూ.60 వేల కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది.

AP: మార్చిలో జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు గడువు ఇవాళ్టితో ముగియనుంది. జనరల్, ఒకేషనల్, ఫస్ట్, సెకండ్ ఇంటర్ విద్యార్థులకు తత్కాల్ స్కీం కింద రూ.3 వేల ఫైన్‌తో నేటి వరకు ఫీజు చెల్లించవచ్చని బోర్డు ప్రకటించింది. ఇకపై ఎలాంటి పొడిగింపు ఉండదని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

భారతీయ సంస్కృతిలో ఉదయాన్నే 3 నుంచి 5 గంటల మధ్య నిద్రలేవడం మంచిది. ఈ సమయంలో మేల్కొంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వేకువలో ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా పాజిటివ్‌గా ఉంటుంది. ఈ సమయంలో మేల్కొంటే సృజనాత్మకంగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. చదువు, ఇతర విషయాలను సులభంగా గుర్తుంచుకోవచ్చు. కుటుంబంతో గడిపేందుకు తగినంత సమయం దొరుకుతుంది. యోగా, వ్యాయామానికి కావాల్సిన సమయం లభిస్తుంది.

AP: సీఎం చంద్రబాబు కొవ్వూరు పర్యటన రద్దు అయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈ టూర్ రద్దైనట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా ఈ నెల 1న తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో సీఎం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. మరోవైపు ఇదే కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లాకు మార్చినట్లు తెలుస్తోంది.

భారత క్రికెట్‌లోకి మరో కొత్త ఫార్మాట్ వచ్చి చేరింది. ఫిబ్రవరి 6 నుంచి లెజెండ్స్ 90 లీగ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో 90-90 బాల్ మ్యాచులు జరుగుతాయి. ఛత్తీస్‌గఢ్ వారియర్స్, హరియాణా గ్లాడియేటర్స్, దుబాయ్ జెయింట్స్, గుజరాత్ సాంప్ ఆర్మీ, ఢిల్లీ రాయల్స్, ఢిల్లీ బిగ్ బాయ్స్, రాజస్థాన్ కింగ్స్ జట్లు పాల్గొంటాయి. రైనా, రాయుడు, ధవన్, గప్టిల్, టేలర్, డ్వేన్ బ్రావో, షకీబ్ వంటి ప్లేయర్లు టోర్నీలో ఆడనున్నారు.

భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మకు ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. ఆమెను డీఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రూ.3 కోట్ల నగదు రివార్డు కూడా అందజేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర డీజీపీ ప్రశాంత్ శర్మ ఆమెను సత్కరించారు. కాగా డీఎస్పీ పోస్టుతో తన చిన్ననాటి కల నెరవేరిందని దీప్తి శర్మ సోషల్ మీడియాలో తెలిపారు.
Sorry, no posts matched your criteria.