India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలకు శ్రీకారం చుట్టనుంది. ఇవాళ మంత్రి నారా లోకేశ్ దీనిని అధికారికంగా ప్రారంభిస్తారు. తొలి విడతలో భాగంగా విద్యుత్, దేవదాయ, ఆర్టీసీ, రెవెన్యూ, మున్సిపల్ వంటి 161 శాఖల్లో సేవలు మొదలవుతాయి. వాట్సాప్ గవర్నెన్స్‌లో భాగంగా ప్రభుత్వ అధికారిక వాట్సాప్ నంబర్ ప్రకటిస్తారు. దీని ద్వారా పౌరులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రభుత్వ సేవలు పొందనున్నారు.

డిజిటల్ మోసాలను అరికట్టేందుకు బ్యాంకులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆర్బీఐ ఆదేశించింది. నష్టాలను తగ్గించుకునేందుకు థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లపై మెరుగైన పర్యవేక్షణ ఉండాలని సూచించింది. అలాగే లిక్విడిటినీ పెంచుకునేందుకు సెంట్రల్ బ్యాంక్ రూ.60 వేల కోట్ల విలువైన ప్రభుత్వ సెక్యూరిటీలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది.

AP: మార్చిలో జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి ఫీజు గడువు ఇవాళ్టితో ముగియనుంది. జనరల్, ఒకేషనల్, ఫస్ట్, సెకండ్ ఇంటర్ విద్యార్థులకు తత్కాల్ స్కీం కింద రూ.3 వేల ఫైన్‌తో నేటి వరకు ఫీజు చెల్లించవచ్చని బోర్డు ప్రకటించింది. ఇకపై ఎలాంటి పొడిగింపు ఉండదని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి కృతికా శుక్లా గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే.

భారతీయ సంస్కృతిలో ఉదయాన్నే 3 నుంచి 5 గంటల మధ్య నిద్రలేవడం మంచిది. ఈ సమయంలో మేల్కొంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వేకువలో ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా పాజిటివ్‌గా ఉంటుంది. ఈ సమయంలో మేల్కొంటే సృజనాత్మకంగా, ఎనర్జిటిక్‌గా ఉంటారు. చదువు, ఇతర విషయాలను సులభంగా గుర్తుంచుకోవచ్చు. కుటుంబంతో గడిపేందుకు తగినంత సమయం దొరుకుతుంది. యోగా, వ్యాయామానికి కావాల్సిన సమయం లభిస్తుంది.

AP: సీఎం చంద్రబాబు కొవ్వూరు పర్యటన రద్దు అయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఈ టూర్ రద్దైనట్లు ప్రభుత్వం తెలిపింది. కాగా ఈ నెల 1న తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో సీఎం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. మరోవైపు ఇదే కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లాకు మార్చినట్లు తెలుస్తోంది.

భారత క్రికెట్‌లోకి మరో కొత్త ఫార్మాట్ వచ్చి చేరింది. ఫిబ్రవరి 6 నుంచి లెజెండ్స్ 90 లీగ్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో 90-90 బాల్ మ్యాచులు జరుగుతాయి. ఛత్తీస్‌గఢ్ వారియర్స్, హరియాణా గ్లాడియేటర్స్, దుబాయ్ జెయింట్స్, గుజరాత్ సాంప్ ఆర్మీ, ఢిల్లీ రాయల్స్, ఢిల్లీ బిగ్ బాయ్స్, రాజస్థాన్ కింగ్స్ జట్లు పాల్గొంటాయి. రైనా, రాయుడు, ధవన్, గప్టిల్, టేలర్, డ్వేన్ బ్రావో, షకీబ్ వంటి ప్లేయర్లు టోర్నీలో ఆడనున్నారు.

భారత మహిళా క్రికెటర్ దీప్తి శర్మకు ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగం కల్పించింది. ఆమెను డీఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రూ.3 కోట్ల నగదు రివార్డు కూడా అందజేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర డీజీపీ ప్రశాంత్ శర్మ ఆమెను సత్కరించారు. కాగా డీఎస్పీ పోస్టుతో తన చిన్ననాటి కల నెరవేరిందని దీప్తి శర్మ సోషల్ మీడియాలో తెలిపారు.

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 420 రోజులవుతున్నా ఇచ్చిన 420 హామీలను నెరవేర్చలేదంటూ BRS ఆందోళనకు దిగుతోంది. ఇవాళ ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న రీతిలో నిరసనలు, ధర్నాలు చేపట్టనున్నాయి. అలాగే గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు నివాళులు అర్పించడంతో పాటు వినతిపత్రాలు ఇవ్వాలని నిర్ణయించింది.

TG: ఉస్మానియా కొత్త ఆస్పత్రిని ప్రపంచస్థాయిలో నిర్మిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. 26.3 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తామన్నారు. ‘అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకొస్తాం. ఆస్పత్రిలో 2 వేల పడకలు ఉంటాయి. ప్రతి గదిలో గాలి, వెలుతురు వచ్చేలా నిర్మిస్తాం. విశాలమైన రోడ్లు, పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తాం. లేటెస్ట్ టెక్నాలజీతో మార్చురీ నిర్మిస్తాం’ అని చెప్పారు.

TG: కుంభమేళా తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలకు మాజీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. తొక్కిసలాటలో భక్తులు మరణించడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్నారని, సరైన ఏర్పాట్లు కల్పించి, రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
Sorry, no posts matched your criteria.