India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డా.యల్లాప్రగడ <<14550601>>సుబ్బారావు<<>> భీమవరంలో 1895లో జన్మించారు. రాజమండ్రిలో మెట్రిక్యులేషన్, మద్రాస్ మెడికల్ కాలేజీలో వైద్య విద్య పూర్తి చేశారు. హార్వర్డ్ వర్సిటీ నుంచి PhD పొందారు. కణాల్లో ATP పనితీరును కనుగొన్నారు. క్యాన్సర్ చికిత్సకు మెథోట్రెక్సేట్‌ను అభివృద్ధి చేశారు. హెట్రోజెన్, టెట్రాసైక్లిన్ వంటి యాంటీ బయోటిక్స్‌ను ప్రపంచానికి అందించారు. వండర్ డ్రగ్స్ మాంత్రికుడిగా పేరొందిన ఆయన 1948లో కన్నుమూశారు.
క్రికెట్ ఆడేందుకు తన శరీరం సహకరించడం లేదని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వృద్ధిమాన్ సాహా తెలిపారు. అందుకే రిటైర్మెంట్ పలికానని ఆయన చెప్పారు. ‘నాకెంతో ఇష్టమైన క్రికెట్‌ను ఆస్వాదించలేకపోతున్నా. అందుకే గతేడాదే వీడ్కోలు పలుకుదామనుకున్నా. కానీ సౌరవ్ గంగూలీ, నా భార్య నన్ను మార్చారు. ఈ సీజన్‌లో రంజీల్లో ఆడాలని సూచించారు. ఈడెన్ గార్డెన్స్‌లో నా చివరి మ్యాచ్ ఆడేందుకు ప్రయత్నిస్తా’ అని ఆయన పేర్కొన్నారు.
AP: రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెంచే ప్రసక్తే లేదని CM చంద్రబాబు స్పష్టం చేశారు. పేదలపై విద్యుత్ భారానికి గత ప్రభుత్వమే కారణమని, ఆ రంగంపై రూ.1.25 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. ‘1998లోనే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చా. తలసరి కరెంట్ వినియోగం పెంచా. సోలార్ విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించా. ప్రస్తుతం ఎలాంటి విద్యుత్ సమస్యలు తలెత్తకుండా సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకీ పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు జరిమానా విధించేలా ‘ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్-2023’ చట్టంలో సవరణలు చేసింది. 2 ఎకరాలలోపు రూ.5,000, 2-5 ఎకరాల మధ్య రూ.10,000, 5 ఎకరాల పైన రూ.30,000 ఫైన్ వేయనుంది.
బాధితులు, నిందితుడు రాజీ కుదుర్చుకున్నప్పటికీ లైంగిక వేధింపుల కేసును రద్దు చేయలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిందితుడికి అనుకూలంగా రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది. అతనిపై విచారణను కొనసాగించాలని ఆదేశించింది. 2022లో ఓ టీచర్‌పై మైనర్ బాలిక లైంగిక వేధింపుల కేసు పెట్టింది. ఆ తర్వాత వారిమధ్య రాజీ కుదరడంతో FIRను హైకోర్టు రద్దు చేసింది. ఈ తీర్పును ఓ వ్యక్తి సుప్రీంలో సవాల్ చేశారు.
AP: వికసిత్ భారత్, వికసిత్ ఏపీ నినాదంతో ముందుకెళ్తున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు. అమరావతి విట్ వర్సిటీలో అంతర్జాతీయ ఉన్నత విద్యపై సదస్సులో ఆయన మాట్లాడారు. తాను కూడా హయ్యర్ స్టడీస్ కోసం విదేశాలకు వెళ్లానని గుర్తుచేసుకున్నారు. మనకు, విదేశాల్లో విద్యకు తేడాలు ఉన్నాయని చెప్పారు. సీఎం చంద్రబాబు చేసిన కృషి వల్లే ఐటీలో అద్భుత ఫలితాలు వచ్చాయని, మన విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నారని పేర్కొన్నారు.
AP: వాలంటీర్ల వ్యవస్థపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్పంచ్ సంఘాలతో ఆయన అమరావతిలో భేటీ అయ్యారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచ్‌ల విజ్ఞప్తిపై పవన్ స్పందించారు. ‘వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది. కానీ గత ప్రభుత్వం వారిని మోసం చేసింది. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయవచ్చు. కానీ వాళ్లు అసలు వ్యవస్థలోనే లేరు. ఇదో సాంకేతిక సమస్య’ అని ఆయన మాట్లాడారు.
స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి. US FED వడ్డీరేట్ల కోతపై నిర్ణయం, US బాండ్ యీల్డుల పెరుగుదల, డాలర్ బలపడటం, FIIల పెట్టుబడుల ఉపసంహరణ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం సెన్సెక్స్ 79,638 (-739), నిఫ్టీ 24,218 (-265) వద్ద ట్రేడవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు రూ.3.5లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. హిందాల్కో 8%, ట్రెంట్, గ్రాసిమ్ 3%, Adanient, TechM 2.5% మేర నష్టపోయాయి.
సమంత, వరుణ్ ధవన్ నటించిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ రిలీజైంది. అమెజాన్ ప్రైమ్‌లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సెలబ్రిటీల కోసం నిన్న ముంబైలో ప్రివ్యూ షో వేయగా షాహిద్ కపూర్, అర్జున్ కపూర్, కృతిశెట్టి, సందీప్ కిషన్ తదితరులు వీక్షించారు. అద్భుతమైన యాక్షన్ థ్రిల్లర్ అంటూ కితాబిచ్చారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌లో కేకే మేనన్, సిమ్రన్, సోహమ్ మజుందార్ తదితరులు నటించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపొందడంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను పొందాయి. దీంతో ఐదుగురు బిలియనీర్లు దాదాపు 53 బిలియన్ డాలర్లు లాభపడ్డారు. ముఖ్యంగా ట్రంప్‌కు మద్దతుగా ప్రచారానికి $119 మిలియన్లు విరాళమిచ్చిన ఎలాన్ మస్క్ ఒక్కరోజులో $26.5 బిలియన్లు (రూ.2.2లక్షల కోట్లు) లాభపడ్డారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం మస్క్ నికర విలువ $26.5B పెరిగి $290 బిలియన్లకు చేరింది.
Sorry, no posts matched your criteria.