News August 4, 2024

ఎమ్మెల్యే సబితతో కేసీఆర్ చర్చలు!

image

TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో ఆ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ <<13746535>>వ్యాఖ్యలతో<<>> సబిత ఆవేదనకు గురైన నేపథ్యంలో ఆమెతో కేసీఆర్ మాట్లాడారు. ఈ అంశంలో భవిష్యత్ కార్యాచరణపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. సబిత వెంట ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి కూడా ఉన్నారు.

News August 4, 2024

ఏపీ టెట్‌కు 3.20 లక్షల దరఖాస్తులు

image

AP: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు 3.20 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. SEP 19 నుంచి ఆన్‌లైన్ మాక్ టెస్టులు ప్రారంభం కానున్నాయి. టెట్ హాల్ టికెట్లు సెప్టెంబర్ 22 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అక్టోబర్ 27న ఫైనల్ ఆన్సర్ కీ, నవంబర్ 2న ఫలితాలను విడుదల చేస్తారు. గతంలో మాదిరిగానే ఆన్‌లైన్‌ విధానంలో ఎగ్జామ్ నిర్వహించనున్నారు.

News August 4, 2024

VIRAL: అటు హిజాబ్.. ఇటు బికినీ!

image

పారిస్: మహిళల బీచ్ వాలీబాల్ పోటీల్లో ఈజిప్ట్ ప్లేయర్లు హిజాబ్ ధరించి ఆడటం చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన ఈజిప్ట్ vs స్పెయిన్ మ్యాచ్‌లో ఈజిప్ట్ ప్లేయర్లు హిజాబ్‌, స్పెయిన్ ప్లేయర్లు బికినీ ధరించి ఆడారు. ఈజిప్ట్ ప్లేయర్ల వస్త్రధారణను కొందరు విమర్శించగా మరికొందరు వారికి మద్దతు పలికారు. రెండు భిన్న సంస్కృతులు ఒకే వేదికపైకి రావడం మంచి పరిణామం అని, వారి సంస్కృతిని గౌరవించాలని చెబుతున్నారు. <<-se>>#Olympics2024<<>>

News August 4, 2024

రేపు సా.5:04కు ‘దేవర’ సెకండ్ సింగిల్

image

‘దేవర’ సినిమా నుంచి రెండో పాటను రేపు సా.5:04 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. Jr.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ మూవీని కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రాగా, రేపు రిలీజయ్యే లవ్ సాంగ్‌ కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.

News August 4, 2024

రేపు తెరుచుకోనున్న ‘సాగర్’ గేట్లు

image

శ్రీశైలం నుంచి భారీ వరద కొనసాగుతుండటంతో రేపు నాగార్జునసాగర్ జలాశయం గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 3.21 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 575 అడుగులుగా ఉంది. జలాశయం ఫుల్ కెపాసిటీ 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 269 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాలువల ద్వారా 38వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.

News August 4, 2024

రెండో వన్డే: భారత్ టార్గెట్ ఎంతంటే?

image

భారత్‌తో రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 240/9 స్కోర్ చేసింది. ఆ జట్టు బ్యాటర్లలో ఆవిష్క ఫెర్నాండో 40, వెల్లలాగే 39, కమిందు మెండిస్ 40, కుశాల్ 30 రన్స్ చేశారు. భారత బౌలర్లలో సుందర్ 3, కుల్దీప్ 2 వికెట్లు పడగొట్టగా, సిరాజ్, అక్షర్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచులో గెలవాలంటే IND 50 ఓవర్లలో 241 రన్స్ చేయాలి.

News August 4, 2024

ఈ ఫోన్లలో వాట్సాప్ సేవలు బంద్!

image

ఆండ్రాయిడ్ 4, IOS 11, KAI OS 2.4 వెర్షన్లతో పాటు వాటికంటే పాత వెర్షన్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. యాపిల్, సాంసంగ్, హువాయి, మోటరోలా కంపెనీలకు చెందిన 35 ఫోన్లు ఈ <>లిస్టులో<<>> ఉన్నాయి. సాంసంగ్ గాలక్సీ S ప్లస్, కోర్, ఎక్స్‌ప్రెస్ 2, గ్రాండ్, S 19500, S4 జూమ్, ఐఫోన్ 5, 6, 6S ప్లస్, 6S, SE, హువాయి C199, హువాయి GX1s, Y625, MOTO G, MOTO X తదితర ఫోన్లలో ఇక నుంచి వాట్సాప్ సపోర్ట్ చేయదు.

News August 4, 2024

బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన హింస.. 32 మంది మృతి

image

రిజర్వేషన్లపై చెలరేగిన <<13679462>>హింస<<>> చల్లారిందనుకున్న తరుణంలో మరోసారి బంగ్లాదేశ్‌లో ఘర్షణలు మొదలయ్యాయి. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది రోడ్డెక్కారు. ఈ క్రమంలో హసీనా మద్దతుదారులకు, నిరసనకారులకు మధ్య హింస చెలరేగింది. ఈ అల్లర్లలో ఇప్పటివరకు 32 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఈరోజు సా.6.30 నుంచి బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఇది అమలు కానుంది.

News August 4, 2024

పాండ్యను ముంబై వదులుకుంటుందా?

image

IPL-2025 మెగా వేలానికి ముందు కెప్టెన్ హార్దిక్ పాండ్యను వదులుకోవాలని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో అతడి కెప్టెన్సీలో MI లీగ్ స్టేజ్ కూడా దాటలేకపోయింది. ప్లేయర్‌గా, కెప్టెన్‌గా హార్దిక్ విఫలమయ్యారు. దీంతో అతడిని రిటైన్ చేసుకోకూడదని MI నిర్ణయించుకున్నట్లు సమాచారం. అతడి స్థానంలో SKYను కెప్టెన్‌గా నియమించుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

News August 4, 2024

BADMINTON: ఇక మిగిలింది కాంస్యమే

image

బ్యాడ్మింటన్ మెన్స్ సెమీస్‌లో లక్ష్యసేన్ ఓటమి భారత అభిమానులను నిరాశపర్చింది. అయితే సేన్ ఒలింపిక్ మెడల్ సాధించేందుకు మరో అవకాశం ఉంది. రేపు జరిగే మ్యాచ్‌లో మలేషియా ఆటగాడు లీ జీపై గెలిస్తే కాంస్య పతకం లక్ష్యసేన్‌ను వరిస్తుంది. రేపు సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. కాగా సెమీస్‌లో లక్ష్యసేన్‌పై గెలిచిన విక్టర్ అక్సెల్‌సెన్, విటిడ్‌సార్న్‌తో (థాయ్‌లాండ్‌) ఫైనల్‌లో తలపడనున్నారు. <<-se>>#Olympics2024<<>>