India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
IPL వేలంలో ఆర్సీబీ ఏ ఆటగాళ్లపై దృష్టి పెట్టాలనేదానిపై ఆ జట్టు మాజీ ఆటగాడు AB డివిలియర్స్ తన అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ‘లెగ్ స్పిన్నర్ చాహల్‌ను RCB టార్గెట్ చేయాలి. తను ఒకప్పుడు ఆర్సీబీకి అద్భుతంగా ఆడారు. అశ్విన్ లేదా వాషింగ్టన్ ఇద్దరిలో ఒకర్ని కొనాలి. రబాడ, భువనేశ్వర్, షమీ, అర్ష్‌దీప్‌ను కొనేందుకు చూడాలి. వీళ్లలో సగంమంది దక్కినా బెంగళూరు దుర్భేద్యమైన బౌలింగ్ టీమ్ అవుతుంది’ అని పేర్కొన్నారు.
HCL టెక్నాలజీస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ అసలైన శ్రీమంతుడిగా నిలిచారు. ఆయన 2024లో రోజుకు రూ.5.9 కోట్లు విరాళంగా అందించినట్లు హురున్ ఇండియా నివేదిక పేర్కొంది. దీంతో ఇండియాలోని దాతృత్వ జాబితాలో మరోసారి అగ్రస్థానంలో నిలిచారని తెలిపింది. శివ్ నాడార్ తన ఫౌండేషన్ ద్వారా రూ.2,153 కోట్లు వార్షిక విరాళమిచ్చి మూడోసారి అత్యధికంగా విరాళమిచ్చిన వ్యక్తిగా నిలిచారు. ఆయన ఎక్కువగా విద్య కోసమే అందించారు.
బాలీవుడ్ స్టార్ యాక్టర్ సునీల్‌శెట్టి షూటింగ్‌లో తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. ‘హంటర్’ సెట్లో ఫైట్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా ప్రమాదం జరిగి ఆయన పక్కటెముకలకు గాయమైనట్లు సమాచారం. అటు ఆయనకు తీవ్ర గాయం కాలేదని తలకు స్వల్పంగా దెబ్బ తగిలినట్లు కొందరు అంటున్నారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ట్వీట్లు చేస్తున్నారు.
AP: గ్రామీణ స్థాయి నుంచి క్రికెట్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. మంగళగిరి అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో ఎంపీ అధ్యక్షతన ఏసీఏ కౌన్సిల్ సమావేశమైంది. ప్రపంచ స్థాయి మౌలిక వసతుల కల్పనపై చర్చించినట్లు పేర్కొన్నారు. విశాఖ, మంగళగిరి క్రికెట్ మైదానాల్లో మార్పులు చేయనున్నట్లు చెప్పారు. 35 ఎకరాలు కావాలని సీఆర్డీఏకు లేఖ రాసినట్లు వెల్లడించారు.
పంజాబ్‌లో ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ స్టేట్ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తనకు మరొకరిని భార్యగా తీసుకురావాలంటూ ఆయన మద్దతుదారులను కోరారు. ‘నా భార్య ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి లిప్‌స్టిక్ పెట్టుకొని బయలుదేరి మళ్లీ అర్ధరాత్రి తిరిగి వస్తుంది. కాబట్టి ఆమె వల్ల ఎలాంటి ఉపయోగం లేదు’ అని చెప్పడం తీవ్ర దుమారం రేపుతోంది. మహిళలకు వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేపీ పట్టుబట్టింది.
ఇండియా, సౌతాఫ్రికా మధ్య 4 మ్యాచుల టీ20 సిరీస్ రేపటి నుంచి జరగనుంది. 2024 టీ20 WC ఫైనల్ తర్వాత ఇరు జట్లు తలపడటం ఇదే తొలిసారి. ఈ ఫార్మాట్‌లో ఇప్పటివరకూ రెండు జట్ల మధ్య 27 మ్యాచులు జరిగాయి. భారత్ 15, దక్షిణాఫ్రికా 11 మ్యాచుల్లో గెలవగా, ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. తొలి టీ20 రేపు రా.8.30 గంటలకు డర్బన్ వేదికగా ప్రారంభం అవుతుంది. జియో సినిమా యాప్, స్పోర్ట్స్ 18 టీవీ ఛానల్‌లో లైవ్ చూడొచ్చు.
NZ క్రికెటర్ రచిన్ రవీంద్రను CSK అకాడమీలో ప్రాక్టీస్ చేసేందుకు అనుమతించడం కరెక్ట్ కాదని మాజీ క్రికెటర్ ఊతప్ప అభిప్రాయపడ్డారు. ‘ప్రాంచైజీలు దేశానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. మన జట్టుకు ప్రత్యర్థిగా ఆడే విదేశీ ప్లేయర్లకు ఇక్కడ ప్రాక్టీస్ చేసే అవకాశం ఇవ్వొద్దు’ అని తన యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడారు. IPLలేని సమయంలోనూ రచిన్ చెన్నైలో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇటీవల INDతో టెస్టుల్లో బ్యాట్‌తో రాణించారు.
FEMA ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా ED దేశవ్యాప్తంగా ఒకే సారి సోదాలు నిర్వహిస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఇ-కామర్స్ సెల్లర్స్ కేంద్రాలు, ఇళ్లలో దాడులు చేపట్టింది. ఢిల్లీ, గురుగ్రామ్, హైదరాబాద్, బెంగళూరులో సోదాలు ఇంకా కొనసాగుతున్నట్టు అధికార వర్గాల సమాచారం. సెల్లర్స్‌లో కొందరు విదేశాలకు అక్రమంగా నగదు పంపినట్టు ED అనుమానిస్తోందని తెలిసింది. దాడులపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
TG: ప్రభుత్వం చేస్తోన్న సమగ్ర కుటుంబ సర్వే దేని కోసమో ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని BJP MP డీకే అరుణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం రూపొందించిన ప్రశ్నావళి కులగణనకు విరుద్ధంగా ఉందన్నారు. ఆస్తులు, అప్పులు, భూములు, ఏ పార్టీ అనే విషయాలు అడుగుతున్నారని, అవన్నీ ప్రభుత్వానికి ఎందుకు చెప్పాలని ఆమె ప్రశ్నించారు.
చాలా మంది హెల్మెట్ ధరిస్తే జుట్టు రాలిపోతుందనుకుని బాధపడుతుంటారు. కానీ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల జుట్టు రాలదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దాన్ని సరిగ్గా శుభ్రం చేయకుండా ధరిస్తే చుండ్రు, దురద వంటి సమస్యలు తలెత్తుతాయి. ఫ్రిక్షన్ వల్ల తల చర్మంపై రంధ్రాలు మూసుకుపోయి కొంత జుట్టు రాలే ప్రమాదం ఉంది. హెల్మెట్ పెట్టుకోవడానికి ముందు తలకు కర్చీఫ్ కట్టుకోవాలి. అలాగే సరైన సైజ్ హెల్మెట్ కొనుక్కోవాలి.
Sorry, no posts matched your criteria.