India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను విద్యార్థులు ఇచ్చిన ఫోన్ నంబర్లకే పంపాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఫోన్‌కు వచ్చిన లింక్‌ను క్లిక్ చేసి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫస్టియర్ ఇంటర్నల్ పరీక్షల హాల్ టికెట్లు ఇప్పటికే పంపించామని, ఈనెల 3 నుంచి జరగనున్న సెకండియర్ ప్రాక్టికల్స్‌కూ ఇలానే పంపిస్తామని చెప్పారు. కాగా మార్చి 5 నుంచి వార్షిక పరీక్షలు జరగనున్నాయి.

AP: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన అభ్యంతరం లేని భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. 2019 అక్టోబర్ 15ను కటాఫ్ డేట్‌గా ప్రకటిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆ తేదీ కంటే ముందు ఆక్రమిత స్థలాల్లో నివాసం ఉంటే రెగ్యులరైజేషన్‌కు అవకాశం ఉంటుంది. పేదలకు 150 గజాల వరకు ఉచితంగా, అంతకంటే ఎక్కువ భూమి ఉంటే సాధారణ రిజిస్ట్రేషన్ విలువతోనే క్రమబద్ధీకరిస్తారు.

AP: ఆక్రమిత ప్రభుత్వ స్థలాల్లో 2019 OCT 15 కంటే ముందు ఇళ్లు కట్టుకున్న వారు ఈ ఏడాది DEC 31 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై అధికారులు విచారణ చేసి MRO/RDO/మున్సిపల్ కమిషనర్లకు నివేదికలు ఇస్తారు. వీటిని సబ్ డివిజనల్ కమిటీలో చర్చించి తహశీల్దార్ కన్వేయెన్స్ డీడ్ల రూపంలో క్రమబద్ధీకరణ ఉత్తర్వులు ఇస్తారు. రెండేళ్ల తర్వాత లబ్ధిదారులకు ఆ భూములపై శాశ్వత హక్కులు వస్తాయి.

AP: గ్రామాల్లో నెలకు గరిష్ఠంగా రూ.10,000, పట్టణాల్లో రూ.14,000 ఆదాయం మాత్రమే ఉండాలి. నెలకు రూ.300లోపే విద్యుత్తు ఛార్జీలు చెల్లించి ఉండాలి. మెట్ట, మాగాణి కింద కలిపి 10 ఎకరాలకు మించి ఉండకూడదు. RCC రూఫ్/ఆస్బెస్టాస్ రూఫ్‌ను ఇటుక గోడలతో నిర్మించి ఉండాలి. రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఆస్తిపన్ను చెల్లింపు, విద్యుత్తు బిల్లు, వాటర్ బిల్లులను పరిగణనలోకి తీసుకుని క్రమబద్ధీకరిస్తారు.

TG: 6 నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలకు అంగన్వాడీల్లో ఇచ్చే బాలామృతాన్ని వారానికి 3, 4 ఫ్లేవర్లలో అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. రోజూ ఒకే రకమైన పౌడర్ ఇవ్వడంతో చిన్నారులు తినడం లేదని ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఏమేం కలపాలన్న దానిపై అధికారుల నుంచి నివేదిక వచ్చిన తర్వాత మార్పులు చేయనున్నారు. రాష్ట్రంలో 10 లక్షల మంది చిన్నారులకు ప్రభుత్వం బాలామృతాన్ని ఉచితంగా అందిస్తోంది.

‘పుష్ప-2’తో భారీ విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాను త్రివిక్రమ్‌తో చేయబోతున్నారు. ఈ మూవీని హిందూ పురాణాల ఆధారంగా తెరకెక్కిస్తారని, శివుడి కుమారుడు కార్తికేయుని పాత్రలో బన్నీ కనిపిస్తారని వార్తలొస్తున్నాయి. ‘గాడ్ ఆఫ్ వార్’గా కార్తికేయుని ప్రయాణం, తండ్రి శివుడిని ఆయన తిరిగి కలుసుకోవడం వంటి అంశాలను చూపిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై మూవీ టీమ్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

అక్రమ వలసదారుల నియంత్రణకు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వారందరినీ గ్వాంటనామో బేకు తరలించేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీచేస్తానన్నారు. 30వేల పడకలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ‘కొన్ని దేశాలపై నాకు నమ్మకం లేదు. వారిని మళ్లీ తిరిగిపంపొచ్చు. అందులో కొందరు USకు అత్యంత ప్రమాదకరం. వారు గ్వాంటనామో నుంచి తప్పించుకోలేరు’ అని అన్నారు. సాధారణంగా ఇక్కడ ఉగ్రవాదులను బంధించి టార్చర్ చేస్తుంటారు.

స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా మొదలై రేంజుబౌండ్లో కొనసాగొచ్చు. గిఫ్ట్‌నిఫ్టీ ఫ్లాటుగా చలిస్తుండటం దీనినే సూచిస్తోంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. US ఫెడ్ వడ్డీరేట్లను 4.25-4.5% వద్ద యథాతథంగా ఉంచడంతో మొదట US స్టాక్స్ పతనమయ్యాయి. పాలసీలో మార్పేమీ లేదని ఫెడ్ ఛైర్మన్ చెప్పాక పుంజుకున్నాయి. నిఫ్టీ సపోర్టు 23,029, రెసిస్టెన్సీ 23,187 వద్ద ఉన్నాయి. IT, FIN షేర్లపై ఫోకస్ పెరిగింది.

TG: ‘రైతు భరోసా’ సాయాన్ని మార్చి 31లోగా రైతులందరి ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఒక్క ఏడాదిలోనే రైతుల సంక్షేమం కోసం రూ.54,280 కోట్లు ఖర్చు చేశామన్నారు. రాష్ట్ర బడ్జెట్లో రూ.72వేల కోట్ల నిధులను వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకే కేటాయించామని గుర్తు చేశారు. రైతులకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

తెలంగాణ ప్రభుత్వ ప్రస్తుత చీఫ్ సెక్రటరీ(సీఎస్) శాంతి కుమారి పదవీకాలం ఏప్రిల్ 7న ముగియనుంది. దీంతో తదుపరి సీఎస్ ఎవరనే చర్చ మొదలైంది. ఇప్పటికే పలువురు సీనియర్ ఐఏఎస్‌లు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రేసులో జయేశ్ రంజన్, వికాస్ రాజ్, రామకృష్ణారావు, శశాంక్ గోయల్ తదితరులు ముందు వరుసలో ఉన్నారు. వీరిలో ప్రభుత్వం ఎవరివైపు మొగ్గు చూపుతుందనేది చూడాలి.
Sorry, no posts matched your criteria.