News August 4, 2024

మహ్మద్ సిరాజ్ అరుదైన ఘనత

image

శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అరుదైన ఘనత సాధించారు. ఈ మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి బంతికే పథుమ్ నిస్సంక వికెట్ తీశారు. దీంతో వన్డేల్లో ఈ ఘనత సాధించిన భారత నాలుగో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కారు. గతంలో దేబశిష్ మహంతి(1999), జహీర్ ఖాన్(2001, 2002, 2007, 09), ప్రవీణ్ కుమార్(2010) తొలి బంతికే వికెట్ తీశారు.

News August 4, 2024

డిగ్రీ అర్హతతో 102 బ్యాంక్ ఉద్యోగాలు

image

రూరల్ బ్యాంకుల్లో 102 అసిస్టెంట్ మేనేజర్(గ్రేడ్-ఏ) పోస్టులకు నాబార్డ్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. రెండు దశల్లో రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలుంటాయి. ఫేజ్-1 ఎగ్జామ్ సెప్టెంబర్ 1న జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 15 వరకు <>వెబ్‌సైట్‌లో<<>> దరఖాస్తు చేసుకోవాలి. https://www.nabard.org/

News August 4, 2024

అతడు చేసిన పని ఎప్పటికీ మర్చిపోను: కీర్తి సురేశ్

image

ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ ఈవెంట్ సందర్భంగా తాను లైఫ్‌లో ఎప్పటికీ మర్చిపోని ఓ సంఘటన గురించి హీరోయిన్ కీర్తి సురేశ్ మీడియాతో చెప్పారు. ‘నా ఫ్యాన్ ఒకరు ఓ రోజు డైరెక్ట్‌గా మా ఇంటికి వచ్చాడు. నన్ను పెళ్లి చేసుకుంటానని అన్నాడు. అతడి తీరు చూసి నేను షాకయ్యాను’ అని తెలిపారు. దసరా సినిమాకు గాను ఆమె ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే.

News August 4, 2024

ప్లాట్‌ఫామ్ ఫీజు రూ.83 కోట్లు.. రాత్రి ఎక్కువ ఆర్డర్లు ఎక్కడి నుంచంటే?

image

ప్లాట్‌ఫామ్ ఫీజు, ఆర్డర్లు పెరగడంతో జొమాటో లాభాలు నమోదు చేస్తోంది. ఈ ఏడాది మార్చి నాటికి PF ఫీజు రూ.83 కోట్లు వసూలు చేసింది. గతేడాది AUGలో రూ.2తో ఈ ఫీజును ప్రారంభించిన జొమాటో ఇప్పుడు రూ.6 వసూలు చేస్తోంది. గత ఆర్థిక ఏడాదిలో జొమాటో సర్దుబాటు ఆదాయం 27% పెరిగి రూ.7,792 కోట్లుగా ఉంది. మరోవైపు గతేడాది రాత్రి పొద్దుపోయాక ఎక్కువ ఆర్డర్లు ఢిల్లీ నుంచి, బ్రేక్‌ఫాస్ట్ ఆర్డర్లు బెంగళూరు నుంచి అందాయి.

News August 4, 2024

ఫోన్ హ్యాంగ్ అవుతోందా? ఇలా చేయండి!

image

➣స్టోరేజీ ఫుల్ అయితే ఫోన్ హ్యాంగ్ అవుతుంది. అందుకే అవసరం లేని మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోలు, యాప్‌లు డిలీట్ చేయండి.
➣యాప్‌లు నిక్షిప్తం చేసుకునే క్యాచీ క్లియర్ చేయాల్సిందే.
➣సాప్ట్‌వేర్‌ను అప్‌డేట్ చేసుకుంటుంటే ఫోన్ వేగం పెరుగుతుంది.
➣హోం స్క్రీన్‌పై ఉండే విడ్జెట్‌లనూ తొలగించాలి. వైరస్ డిటెక్టింగ్ యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
➣హ్యాంగ్ అవుతున్నప్పుడు రీస్టార్ట్ చేస్తే అప్లికేషన్స్ రీసెట్ అవుతాయి.

News August 4, 2024

ఎమ్మెల్యే సబితతో కేసీఆర్ చర్చలు!

image

TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్‌తో ఆ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ <<13746535>>వ్యాఖ్యలతో<<>> సబిత ఆవేదనకు గురైన నేపథ్యంలో ఆమెతో కేసీఆర్ మాట్లాడారు. ఈ అంశంలో భవిష్యత్ కార్యాచరణపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం. సబిత వెంట ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి కూడా ఉన్నారు.

News August 4, 2024

ఏపీ టెట్‌కు 3.20 లక్షల దరఖాస్తులు

image

AP: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్‌కు 3.20 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. SEP 19 నుంచి ఆన్‌లైన్ మాక్ టెస్టులు ప్రారంభం కానున్నాయి. టెట్ హాల్ టికెట్లు సెప్టెంబర్ 22 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అక్టోబర్ 27న ఫైనల్ ఆన్సర్ కీ, నవంబర్ 2న ఫలితాలను విడుదల చేస్తారు. గతంలో మాదిరిగానే ఆన్‌లైన్‌ విధానంలో ఎగ్జామ్ నిర్వహించనున్నారు.

News August 4, 2024

VIRAL: అటు హిజాబ్.. ఇటు బికినీ!

image

పారిస్: మహిళల బీచ్ వాలీబాల్ పోటీల్లో ఈజిప్ట్ ప్లేయర్లు హిజాబ్ ధరించి ఆడటం చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన ఈజిప్ట్ vs స్పెయిన్ మ్యాచ్‌లో ఈజిప్ట్ ప్లేయర్లు హిజాబ్‌, స్పెయిన్ ప్లేయర్లు బికినీ ధరించి ఆడారు. ఈజిప్ట్ ప్లేయర్ల వస్త్రధారణను కొందరు విమర్శించగా మరికొందరు వారికి మద్దతు పలికారు. రెండు భిన్న సంస్కృతులు ఒకే వేదికపైకి రావడం మంచి పరిణామం అని, వారి సంస్కృతిని గౌరవించాలని చెబుతున్నారు. <<-se>>#Olympics2024<<>>

News August 4, 2024

రేపు సా.5:04కు ‘దేవర’ సెకండ్ సింగిల్

image

‘దేవర’ సినిమా నుంచి రెండో పాటను రేపు సా.5:04 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. Jr.ఎన్టీఆర్, జాన్వీ కపూర్ నటిస్తున్న ఈ మూవీని కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ రాగా, రేపు రిలీజయ్యే లవ్ సాంగ్‌ కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 27న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది.

News August 4, 2024

రేపు తెరుచుకోనున్న ‘సాగర్’ గేట్లు

image

శ్రీశైలం నుంచి భారీ వరద కొనసాగుతుండటంతో రేపు నాగార్జునసాగర్ జలాశయం గేట్లు ఎత్తాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం 3.21 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 575 అడుగులుగా ఉంది. జలాశయం ఫుల్ కెపాసిటీ 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 269 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కాలువల ద్వారా 38వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.