News November 7, 2024

డెంగ్యూ వ్యాప్తిని నివారించేందుకు కొత్త పద్ధతి

image

డెంగ్యూ, జికా, వైరల్ ఫీవర్ వ్యాప్తిని నివారించేందుకు పరిశోధకులు కొత్త మార్గాన్ని కనుగొన్నారు. ఈడిస్ ఈజిప్టి అనే దోమల ద్వారా ఈ వ్యాధులు వ్యాపిస్తాయి. వీటిల్లో మగ దోమల వినికిడి శక్తిని దెబ్బతీస్తే అవి ఆడవాటితో జతకట్టలేవని ప్రొఫెసర్ క్రైగ్ మాంటెల్ ల్యాబ్‌లోని పరిశోధకులు తెలిపారు. ఆడ దోమలు రెక్కలతో చేసే చప్పుడు సంభోగానికి సంకేతమని, వినికిడి శక్తిని కోల్పోతే మగవి సంభోగానికి ఆసక్తి చూపవని చెప్పారు.

News November 7, 2024

IPL: రూ.2 కోట్ల బేస్‌ప్రైజ్‌లో మనోళ్లు వీరే

image

IPL మెగా వేలంలో ఈసారి భారత్ నుంచి 23 మంది ఆటగాళ్లు రూ.2 కోట్ల బేస్ ప్రైజ్‌తో బరిలోకి దిగుతున్నారు. వీరిలో రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అశ్విన్, చాహల్, వెంకటేశ్ అయ్యర్, ఇషాన్ కిషన్, పడిక్కల్, కృనాల్ పాండ్య, షమీ, సిరాజ్, అర్ష్‌దీప్, వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, అవేశ్ ఖాన్, ముకేశ్, ప్రసిద్ధ్ కృష్ణ, నటరాజన్, హర్షల్ పటేల్, భువనేశ్వర్, ఉమేశ్ యాదవ్ ఉన్నారు.

News November 7, 2024

అమెరికా ఎన్నికల్లో ‘భారతీయం’.. ఆరుగురి గెలుపు

image

2020 US ఎన్నికల్లో ఐదుగురు ఇండో-అమెరికన్లు గెలవగా, ఈసారి ఆ సంఖ్య ఆరుకు చేరింది. వీరంతా డెమొక్రటిక్ పార్టీ నుంచే విజయ కేతనం ఎగురవేశారు. వారిలో కాలిఫోర్నియా నుంచి అమీ బెరా, రో ఖన్నా(మూడోసారి), మిచిగాన్ నుంచి థానే దార్, ఇల్లినాయిస్ నుంచి రాజాకృష్ణమూర్తి(థర్డ్ టైమ్), వాషింగ్టన్ నుంచి ప్రమీలా జయపాల్ ఉన్నారు. వర్జీనియా నుంచి తొలిసారి గెలిచిన భారతీయ అమెరికన్‌గా సుహాస్ సుబ్రమణ్యం రికార్డు సృష్టించారు.

News November 7, 2024

మరో వారంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ?

image

AP: మరో వారంలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి జాబితా కంటే రెండు మూడు రెట్ల పదవులు ఎక్కువగా ఉంటాయని సమాచారం. మొత్తం 50 BC కార్పొరేషన్‌లు ఉండగా 35 వరకు భర్తీ చేయాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిలో JSP, BJP నేతలకు కూడా కొన్ని కేటాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కార్పొరేషన్ల ఛైర్మన్లతోపాటు సభ్యులను కూడా నియమిస్తున్నట్లు టాక్.

News November 7, 2024

క్షీణిస్తున్న సునీతా విలియమ్స్ ఆరోగ్యం

image

నాసా ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండటంతో ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది. ఆమె బరువు తగ్గి చిక్కిపోయినట్లు ఉన్న ఓ ఫొటో వైరలవుతోంది. ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని వైద్యులు చెబుతున్నారు. జూన్ 6న బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్సుల్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీత, విల్‌మోర్, సాంకేతిక లోపం కారణంగా తిరిగి రాలేకపోయారు. వచ్చే FEBలో భూమిపైకి తిరిగి వచ్చే అవకాశముంది.

News November 7, 2024

శ్రీశైలంలో నీటి నిల్వ తగ్గడంపై ఆందోళన

image

శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ తగ్గడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. <<14540990>>KRMB <<>>హెచ్చరించినప్పటికీ జల విద్యుత్ ఉత్పత్తి కోసం బుధవారం 19,820 క్యూసెక్కులను తెలుగు రాష్ట్రాలు తరలించాయి. మరో 16 వేల క్యూసెక్కులను పోతిరెడ్డిపాడు నుంచి AP తరలించింది. శ్రీశైలంలో ప్రస్తుతం 182.99(215.81) TMCల నీరు ఉంది. ఆల్మట్టి నుంచి ఆశించిన స్థాయిలో ఇన్‌ఫ్లో లేకున్నా విద్యుత్ ఉత్పత్తి చేయడంపై నిపుణులు ఆక్షేపిస్తున్నారు.

News November 7, 2024

‘మేరుగు’పై నాతో తప్పుడు ఫిర్యాదు చేయించారు: పద్మావతి

image

AP: మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై నమోదైన లైంగిక వేధింపుల <<14511104>>కేసులో<<>> ట్విస్ట్ చోటుచేసుకుంది. తనపై ఆయన ఎలాంటి దాడి చేయలేదని, కొందరు రాజకీయ నేతల ఒత్తిడితోనే ఫిర్యాదు చేసినట్లు పద్మావతి హైకోర్టుకు నివేదించారు. కేసును ఉపసంహరించుకుంటున్నానని, పోలీసులకు ఈ విషయం చెప్పినా పట్టించుకోలేదని చెప్పారు. దీంతో కేసు వివరాలను తమ ముందుంచాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.

News November 7, 2024

కులగణన సర్వే.. ఎవరు ఎక్కడ నమోదు చేయించుకోవాలి?

image

TG: పలు కారణాల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు సర్వేలో తమ పేరును ఎక్కడ నమోదు చేయించుకోవాలనే దానిపై అయోమయం నెలకొంది. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతానికి డోర్ నంబర్, యజమాని పేరు మాత్రమే నమోదు చేస్తున్నారు. ఎల్లుండి నుంచి సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభంకానుంది. ఈలోపు మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఉన్నతాధికారులు అంటున్నారు. ఆధార్‌లో అడ్రస్ ఉన్నచోటే వివరాలు నమోదు చేయించుకోవాలని సమాచారం.

News November 7, 2024

KTRపై FIR నమోదుకు గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం!

image

TG: ఫార్ములా ఈ-రేసింగ్ కేసులో KTR కార్నర్ కాబోతున్నట్లు మీడియా, రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఆయనపై FIR నమోదుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్‌కు ప్రభుత్వం లేఖ రాసినట్లు తెలుస్తోంది. దీనిపై గవర్నర్ న్యాయసలహా కోరినట్లు సమాచారం. ఈ అంశంపై విచారణ జరపాలని ఇప్పటికే ACBకి MAUD లేఖ రాసింది. అప్పటి పురపాలక శాఖ స్పెషల్ CS అర్వింద్ కుమార్‌పైనా చర్యలకు అనుమతి కోరగా ప్రభుత్వం అంగీకరించినట్లు తెలుస్తోంది.

News November 7, 2024

అగ్రరాజ్య అధ్యక్షుడికి సకల సౌకర్యాలు!

image

అమెరికా నూతన అధ్యక్షుడికి సకల సౌకర్యాలు లభిస్తాయి. ఆయనపై ఈగ వాలకుండా చూసుకునే సీక్రెట్ సర్వీస్ భద్రత ఉంటుంది. అధికారంలో ఉన్న నాలుగేళ్లు వైట్‌హౌస్‌కు అధిపతిగా ఉంటారు. ఇదే కాకుండా బ్లెయిర్ హౌస్, క్యాంప్ డేవిడ్ అనే మరో 2 గెస్ట్ హౌసుల్లో బస చేయొచ్చు. ఆయన విందుల కోసం నిత్యం ఐదుగురు చెఫ్‌లు పనిచేస్తుంటారు. ప్రయాణించడానికి ఎయిర్ ఫోర్స్ వన్ విమానం, మెరైన్ వన్ హెలికాప్టర్, బీస్ట్ కారు అందుబాటులో ఉంటాయి.