India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట నేపథ్యంలో మహా కుంభమేళాపై ఒక లాయర్ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. మేళా వద్ద అన్ని రాష్ట్రాలు ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసేలా, భక్తుల భద్రతకు భరోసా కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అన్ని రాష్ట్రాలు కలిసి పనిచేసేలా ఆదేశించాలన్నారు. తొక్కిసలాటకు UP ప్రభుత్వం, అధికారుల అలసత్వం, నిర్లక్ష్యానికి సంబంధం ఉందని ఆరోపించారు. దానిపై స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని కోరారు.

టెస్టుల్లో 35వ సెంచరీ పూర్తి చేసుకున్న స్టీవ్ స్మిత్‌పై రికీ పాంటింగ్ ప్రశంసలు కురిపించారు. ఈ జనరేషన్‌లో అతడే బెస్ట్ ప్లేయర్ అని కొనియాడారు. అతడితో పాటు జో రూట్ (ENG), విలియమ్సన్(NZ) అత్యుత్తమంగా రాణిస్తున్నారని పేర్కొన్నారు. అయితే ‘ఫ్యాబ్ 4’ లిస్టులో ఉన్న విరాట్ కోహ్లీ పేరును ఆయన ప్రస్తావించకపోవడం గమనార్హం. గత 2, 3 ఏళ్లుగా టెస్టుల్లో పరుగులు చేయడంలో విరాట్ తడబడుతున్న సంగతి తెలిసిందే.

TG: భార్యను హత్య చేసి ముక్కలుగా నరికిన గురుమూర్తి ప్రస్తుతం చర్లపల్లి జైల్లో ఉన్నాడు. కోర్టులో హాజరుపర్చినప్పుడు లాయర్‌ను పెట్టుకుంటావా అని జడ్జి అడగ్గా ‘నాకు న్యాయవాది అవసరం లేదు. జైల్లోనే ఉంటా’ అని చెప్పాడు. దీంతో పోలీసులు ఆయనను జైలుకు తీసుకెళ్లారు. కాగా భార్యను ముక్కలుగా చేసిన చోటే పిల్లలకు ఆన్‌లైన్‌లో ఫుడ్ తెప్పించి తినిపించాడు. ఇంట్లో దుర్వాసన వస్తోందని పిల్లలు అడగ్గా రూమ్ స్ప్రే కొట్టాడు.

ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట నేపథ్యంలో UP ప్రభుత్వం 5 మార్పులు చేసింది. మహాకుంభ్ ఏరియాను నో వెహికల్ జోన్‌గా ప్రకటించింది. మినహాయింపులు సహా VVIP పాస్‌లు, వాహనాల ఎంట్రీని రద్దు చేసింది. భక్తులు సాఫీగా సాగిపోయేందుకు వన్‌వే ట్రాఫిక్ సిస్టమ్‌ను అమలు చేస్తోంది. ప్రయాగకు పొరుగు జిల్లాల నుంచి వచ్చే వాహనాలను సరిహద్దుల వద్దే ఆపేస్తోంది. FEB 4 వరకు ఫోర్ వీలర్లకు సిటీలోకి అనుమతి లేదు.

పాన్ కార్డు వెబ్‌సైట్, సంబంధిత వివరాలను తమిళ భాషలోనూ అందుబాటులోకి తీసుకురావాలని సినీ హీరో విజయ్ సేతుపతి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పాన్ వెబ్‌సైట్ హిందీ, ఇంగ్లిష్ భాషల్లో మాత్రమే ఉండటంతో తమిళ్ మాట్లాడేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. సమాచారం ప్రజలకు అర్థమయ్యే భాషలో ఉండాలని, అలా ఉంటేనే ఎలాంటి సమస్యలు ఉండవని అభిప్రాయపడ్డారు.

ఢిల్లీలోని ఫోర్టీస్ ఎస్కార్ట్స్ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ డాక్టర్లు అద్భుతం చేశారు. ఒక్కరోజు వయసున్న UP, బరేలీ నవజాత శిశువుకు విజయవంతంగా గుండె ఆపరేషన్ చేశారు. 20 వారాల ప్రెగ్నెన్సీ స్కాన్‌లో డాక్లర్లు కడుపులోని బిడ్డకు TGA గుండెజబ్బును గుర్తించారు. అంటే రంధ్రంతో పాటు ధమనులు తిరగేసి ఉంటాయి. శిశువు జన్మించగానే వారు 3 గంటలు శ్రమించి సర్జరీ చేశారు. 16 రోజుల తర్వాత ఇంటికి పంపించారు.

TG: ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను విద్యార్థులు ఇచ్చిన ఫోన్ నంబర్లకే పంపాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఫోన్‌కు వచ్చిన లింక్‌ను క్లిక్ చేసి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫస్టియర్ ఇంటర్నల్ పరీక్షల హాల్ టికెట్లు ఇప్పటికే పంపించామని, ఈనెల 3 నుంచి జరగనున్న సెకండియర్ ప్రాక్టికల్స్‌కూ ఇలానే పంపిస్తామని చెప్పారు. కాగా మార్చి 5 నుంచి వార్షిక పరీక్షలు జరగనున్నాయి.

AP: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆక్రమణకు గురైన అభ్యంతరం లేని భూముల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది. 2019 అక్టోబర్ 15ను కటాఫ్ డేట్‌గా ప్రకటిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఆ తేదీ కంటే ముందు ఆక్రమిత స్థలాల్లో నివాసం ఉంటే రెగ్యులరైజేషన్‌కు అవకాశం ఉంటుంది. పేదలకు 150 గజాల వరకు ఉచితంగా, అంతకంటే ఎక్కువ భూమి ఉంటే సాధారణ రిజిస్ట్రేషన్ విలువతోనే క్రమబద్ధీకరిస్తారు.

AP: ఆక్రమిత ప్రభుత్వ స్థలాల్లో 2019 OCT 15 కంటే ముందు ఇళ్లు కట్టుకున్న వారు ఈ ఏడాది DEC 31 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై అధికారులు విచారణ చేసి MRO/RDO/మున్సిపల్ కమిషనర్లకు నివేదికలు ఇస్తారు. వీటిని సబ్ డివిజనల్ కమిటీలో చర్చించి తహశీల్దార్ కన్వేయెన్స్ డీడ్‌ల రూపంలో క్రమబద్ధీకరణ ఉత్తర్వులు ఇస్తారు. రెండేళ్ల తర్వాత లబ్ధిదారులకు ఆ భూములపై శాశ్వత హక్కులు వస్తాయి.

AP: గ్రామాల్లో నెలకు గరిష్ఠంగా రూ.10,000, పట్టణాల్లో రూ.14,000 ఆదాయం మాత్రమే ఉండాలి. నెలకు రూ.300లోపే విద్యుత్తు ఛార్జీలు చెల్లించి ఉండాలి. మెట్ట, మాగాణి కింద కలిపి 10 ఎకరాలకు మించి ఉండకూడదు. RCC రూఫ్/ఆస్‌బెస్టాస్ రూఫ్‌ను ఇటుక గోడలతో నిర్మించి ఉండాలి. రిజిస్టర్డ్ డాక్యుమెంట్, ఆస్తిపన్ను చెల్లింపు, విద్యుత్తు బిల్లు, వాటర్ బిల్లులను పరిగణనలోకి తీసుకుని క్రమబద్ధీకరిస్తారు.
Sorry, no posts matched your criteria.