News November 4, 2024

త్వరలో FMCG ఉత్పత్తుల ధరల పెంపు?

image

షాంపూలు, సబ్బులు, బిస్కెట్లు వంటి రోజువారీ వాడుకునే FMCG ఉత్పత్తుల ధరలు త్వరలోనే పెరిగే అవకాశం ఉంది. ఆహార ద్రవ్యోల్బణం కారణంగా SEPలో సంస్థల మార్జిన్లు తగ్గడం, పామాయిల్, కాఫీ, కోకో వంటి ఇన్‌పుట్ ఖర్చులు పెరగడంతో సంస్థలు ధరల పెంపు సిగ్నల్స్ పంపాయి. పట్టణాల్లో HUL, గోద్రెజ్,మారికో, ITC, టాటా FMCG ప్రొడక్ట్స్ వినియోగం తగ్గడంపై పరిశ్రమ ఆందోళన వ్యక్తం చేస్తోంది. త్వరలో ధరల పెంపుపై ప్రకటన చేసే ఛాన్సుంది.

News November 4, 2024

‘స్పిరిట్’లో ప్రభాస్ హీరోయిన్ ఈమేనా?

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్న ‘స్పిరిట్’ ప్రీ పొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది నుంచి చిత్రీకరణ మొదలవనుంది. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ విషయం గురించి చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నయనతార నటిస్తారనే వార్త చక్కర్లు కొడుతోంది. ‘స్పిరిట్’ స్క్రిప్టు నయన్‌కు నచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 2007లో వీరిద్దరూ కలిసి ‘యోగి’లో నటించారు.

News November 4, 2024

గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తోంది: కిషన్ రెడ్డి

image

TG: డిక్లరేషన్లు, గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేయడం లేదని, కనీసం వాటి గురించి సమాచారం కూడా ఇవ్వడం లేదని అన్నారు. TG ప్రభుత్వం 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి మోసం చేసిందని మండిపడ్డారు. ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని వ్యాఖ్యానించారు.

News November 4, 2024

ఓడిపోతే మా కులానికి చెడ్డపేరు వస్తుంది: మరాఠా కోటా యాక్టివిస్ట్

image

మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీచేయడం లేదని మరాఠా కోటా యాక్టివిస్ట్ మనోజ్ పాటిల్ అన్నారు. 10-15 మంది అభ్యర్థులకు మద్దతిస్తానని ప్రకటించిన కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకున్నారు. ‘ఒకే కులం బలంతోనే గెలవలేం. పైగా రాజకీయాలకు మేం కొత్త. ఒకవేళ మేం పోటీచేసి ఓడిపోతే మా కులానికి చెడ్డపేరు వస్తుంది’ అని తెలిపారు. ఆయన నిర్ణయంతో శివసేన UBT, కాంగ్రెస్, పవార్ NCPకి లబ్ధి కలుగుతుందని విశ్లేషకులు అంటున్నారు.

News November 4, 2024

APPSC ఛైర్మన్‌కు MLC చిరంజీవి వినతులు

image

AP: నిరుద్యోగులకు చెందిన పలు అభ్యర్థనలను APPSC దృష్టికి MLC వేపాడ చిరంజీవి తీసుకెళ్లారు. ‘గ్రూప్-2 మెయిన్స్ కోసం 90 రోజుల గడువు, గ్రూప్-1 ప్రిలిమ్స్ కోసం 1:100 నిష్పత్తిలో ఎంపిక, Dy.EO,JL,DL నోటిఫికేషన్లు, UPSC మాదిరిగా జాబ్ క్యాలెండర్ అమలు, AEE ఖాళీల భర్తీ, 2018 గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకన విధానంపై విచారణ’ వంటి అంశాలను తాను APPSC ఛైర్మన్‌తో చర్చించినట్లు ఆయన వెల్లడించారు.

News November 4, 2024

కేంద్రంలోకి CBN.. లోకేశ్‌ను సీఎం చేసే ప్రయత్నమా?: ఎంపీ VSR

image

AP: జమిలి ఎన్నికలు 2027లోనే వస్తాయనే ప్రచారం నేపథ్యంలో రాష్ట్రాన్ని దోచుకోవడంలో TDP నిమగ్నమైందా? అని MP విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ‘అవినీతి సొమ్ము పంచుకోవడంలో కూటమి నేతల మధ్య కుమ్ములాటలతో 5 నెలల్లోనే ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. మతిమరుపు వ్యాధితో సతమతమవుతున్న చంద్రబాబు కొడుకు లోకేశ్‌ను CM చేసే ప్రయత్నంలో ఉన్నారా? చంద్రబాబు కేంద్రంలోకి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారా?’ అని Xలో రాసుకొచ్చారు.

News November 4, 2024

గుడ్‌న్యూస్.. వారికి వచ్చేనెల 2 పెన్షన్లు!

image

AP: ఒకేసారి 3 నెలల పింఛన్ తీసుకోవచ్చన్న CM చంద్రబాబు <<14507352>>ప్రకటన<<>> నేపథ్యంలో అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. ఇకపై ఒకనెల పింఛన్ తీసుకోకపోతే మరుసటి నెలలో 2, రెండు నెలలు తీసుకోకపోతే మూడో నెలలో మొత్తం కలిపి అందజేస్తారు. డిసెంబర్ నుంచే దీన్ని అమలు చేయాలని చూస్తున్నారు. నవంబర్‌లో పింఛన్ తీసుకోనివారికి డిసెంబర్‌ 1న రెండు నెలలది కలిపి ఇస్తారు. NOVలో వివిధ కారణాలతో 45వేల మంది పెన్షన్ తీసుకోలేదని గుర్తించారు.

News November 4, 2024

టెట్ ఫలితాలు.. సందేహాలుంటే ఈ నంబర్లకు కాల్ చేయండి

image

AP: రాష్ట్రంలో టెట్‌కు 3,68,661 మంది హాజరవగా 1,87,256 మంది <<14524941>>ఉత్తీర్ణత<<>> సాధించారు. వారందరికీ మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే మెగా డీఎస్సీ విడుదల చేస్తామని ప్రకటించారు. అభ్యర్థులకు సందేహాలుంటే ఉ.11.30 నుంచి సా.5.30 వరకు 9398810958, 7995649286, 6281704160, 7995789286 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.

News November 4, 2024

బీటెక్ సీట్లలో ఈ మూడు రాష్ట్రాలదే అధిక వాటా!

image

ఇంజినీరింగ్ చదివే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. డిగ్రీ కంటే బీటెక్ చదివేందుకే విద్యార్థులు మొగ్గుచూపుతున్నారు. 2024-25లో దేశవ్యాప్తంగా 14.90 లక్షల బీటెక్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా తమిళనాడులో 3,08,686 సీట్స్, ఆంధ్రప్రదేశ్‌లో 1,83,532 & తెలంగాణలో 1,45,557 సీట్లున్నాయి. ఇలా చూస్తే దేశంలోని ఇంజినీరింగ్ సీట్లలో ఈ మూడు రాష్ట్రాలే 40శాతం వాటా కలిగి ఉన్నాయి.

News November 4, 2024

BREAKING: టెట్ ఫలితాలు విడుదల

image

AP: గత నెల 3 నుంచి 21 వరకు నిర్వహించిన టెట్ ఫలితాలను మంత్రి లోకేశ్ విడుదల చేశారు. <>https://cse.ap.gov.in/ <<>>వెబ్‌సైట్‌లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఈ పరీక్షలకు 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా 3,68,661 మంది హాజరయ్యారు. అందులో 1,87,256 (50.79 శాతం) మంది అర్హత సాధించారు. డీఎస్సీలో టెట్‌ మార్కులకు 20% వెయిటేజీ ఉంటుంది. కాగా త్వరలోనే 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కానుంది.