India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
NZతో టెస్టు సిరీస్‌లో ఓటమితో టీమ్ ఇండియా పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది.
*3 టెస్టుల సిరీస్‌లో భారత్ తొలిసారి క్లీన్‌స్వీప్ అయింది.
*ఈ సిరీస్ ముందు వరకు NZ భారత గడ్డపై ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు.
*టెస్టుల్లో భారత గడ్డపై టీమ్ ఇండియా ఇప్పటివరకు 3 సార్లు (1980, 2000, 2024లో)వైట్‌వాష్ అయింది.
*ముంబై వాంఖడేలో 12 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఓడిపోయింది.
US అధ్యక్ష ఎన్నికల్లో ఓ వైపు డొనాల్డ్ ట్రంప్ కమలా హారిస్‌తో హోరాహోరీ తలపడుతుంటే ఆయన కూతురు ఇవాంక ట్రంప్ మాత్రం ఎన్నికల ప్రచారాల్లో కనిపించడం లేదు. కాగా కమలకు మద్దతిచ్చిన అమెరికన్ పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ నిర్వహించిన కన్సర్ట్‌కు ఇవాంక భర్త కుష్నర్ తన పిల్లల్ని తీసుకొని వెళ్లడం రకరకాల ఊహాగానాలకు దారి తీసింది. అయితే ఇవాంక త్వరలోనే రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారని రిపబ్లికన్ వర్గాలంటున్నాయి.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టుకు తాను అందుబాటులో ఉంటానో లేదో ఇప్పుడే చెప్పలేనని రోహిత్ శర్మ అన్నారు. న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్ అనంతరం ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. తన కెరీర్‌లో ఇదే లోయెస్ట్ పాయింట్ అని పేర్కొన్నారు. కాగా AUSతో తొలి టెస్ట్ ఈనెల 22నుంచి పెర్త్‌లో జరగనుంది. ఇదే సమయంలో రోహిత్ వైఫ్ రితిక రెండో బిడ్డకు జన్మనివ్వనున్నారని, అందుకే ఆయన తొలి టెస్టులో ఆడకపోవచ్చని సమాచారం.
TG: నల్గొండ జిల్లాలోని యాదాద్రి పవర్ ప్లాంట్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి సందర్శించారు. ప్లాంట్‌లోని యూనిట్ వన్ ట్రయల్ రన్‌ను ప్రారంభించారు. ప్లాంట్ విద్యుత్ పనుల పురోగతిపై సమీక్షించారు. త్వరలోనే నూతన ఎనర్జీ పాలసీని ప్రకటిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.
తమిళ హీరో సూర్య నటించిన ‘కంగువ’ ఈనెల 14న రిలీజ్ కానుంది. టాలీవుడ్ టైర్-1 హీరో మూవీ రిలీజ్ మాదిరిగానే భారీస్థాయిలో ఇక్కడ విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. 4AM షోస్‌కు, టికెట్ ధరల పెంపునకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో డబ్బింగ్ మూవీకి హైక్ ఇవ్వడమేంటని కొందరు Xలో ప్రశ్నిస్తున్నారు. మన సినిమాలకు అక్కడ కనీసం థియేటర్లు కూడా ఇవ్వట్లేదని మండిపడుతున్నారు. మీ కామెంట్?
సొంతగడ్డపై టీమ్ఇండియాను క్లీన్‌స్వీప్ చేయడంపై న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లుక్సాన్ స్పందించారు. తమ జట్టు అపురూప విజయాన్ని అందుకుందని ఆయన కొనియాడారు. ‘బ్లాక్ కాప్స్ చాలా బాగా ఆడారు. న్యూజిలాండ్ సాధించిన అత్యుత్తమ టెస్టు సిరీస్‌లలో ఇది ప్రత్యేకం’ అని ట్వీట్ చేశారు.
TG: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే రోడ్డుపై ధర్నాలకు దిగుతామని హెచ్చరించారు. ‘క్వింటా వడ్లకు ₹2320 మద్దతు ధర, ₹500 బోనస్ కలిపి ₹2820 ఇవ్వాలి. కానీ రైతులు ₹1800కే అమ్ముకోవాల్సి వస్తోంది. దీంతో క్వింటాకు ₹1000 నష్టపోతున్నారు’ అని ప్రెస్‌మీట్‌లో వ్యాఖ్యానించారు.
AP: టెట్ ఫలితాలను మంత్రి నారా లోకేశ్ రేపు విడుదల చేయనున్నారు. గత నెల 3 నుంచి 21 వరకు టెట్ పరీక్షలను ప్రభుత్వం నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 3,68,661 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇటీవల టెట్ ఫైనల్ కీని కూడా విద్యాశాఖ విడుదల చేసింది. కాగా త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీని ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది.
పార్లమెంట్ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ ఈనెల 5న హైదరాబాద్‌కు వస్తారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌లో కుల గణనపై జరిగే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారని తెలిపారు. అయితే, ఎన్నికల సమయంలో రాహుల్ అశోక్‌నగర్ చేరుకొని ఉద్యోగార్థులతో మాట్లాడారని, ఇప్పుడు కూడా తమ సమస్యలు వినేందుకు ఆయన అక్కడకి రావాలని TGPSC అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
AP: తిరుపతి జిల్లా వడమాలపేటలో అత్యాచారం, హత్యకు గురైన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చెక్కును మంత్రి అనిత అందజేశారు. అలాగే వారింట్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. కుటుంబసభ్యులను పరామర్శించి ఆమె ధైర్యం చెప్పారు. చిన్నారి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.