India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఆరోగ్యం విషమంగా ఉంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రామోజీరావు పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో వెంటిలేటర్‌పై ఉంచినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ నటి, నూతన MP కంగనా రనౌత్‌ను ఎయిర్‌పోర్టులో <<13392151>>చెంప దెబ్బ<<>> కొట్టిన CISF జవాన్‌పై మొహాలీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెపై 323, 341 సెక్షన్ల కింద కేసులు పెట్టినట్లు, ఆ రెండు బెయిలబుల్ సెక్షన్లేనని తెలుస్తోంది. అయితే CISF కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్‌ను ప్రస్తుతానికి అరెస్ట్ చేయలేదని సమాచారం.
TG: నైరుతి పవనాలు విస్తరిస్తున్న నేపథ్యంలో నేటి నుంచి రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నేడు, రేపు ఓ మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. 10, 11 తేదీల్లో నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని సూచించింది.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో 99 MP స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ గత 10ఏళ్లలో మొదటిసారి పార్లమెంటులో ప్రధాన ప్రతిపక్ష హోదా పొందనుంది. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ హోదాను స్వీకరించాలని పార్టీలోని ఓ వర్గం బలంగా కోరుతోంది. నేడు జరిగే CWC, పార్లమెంటరీ పార్టీ భేటీల్లో ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఫలితాలు, భవిష్యత్తు ప్రణాళికలపై చర్చించేందుకు ఢిల్లీలో నేడు CWC భేటీ జరగనుంది. ఉ.11గంటలకు ఇది మొదలుకానుంది. ఈ భేటీకి సోనియా, ప్రియాంక, రాహుల్‌తో పాటు ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకులు, పీసీసీ అధ్యక్షులు హాజరవుతారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అందరికీ విందు ఇవ్వనున్నారు. సాయంత్రం 5.30గంటలకు పార్లమెంటరీ పార్టీ సమావేశం ఉంటుంది.
ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావు గుండె సంబంధిత సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈనెల 5న ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆయనకు స్టెంట్ అమర్చారు. ప్రస్తుతం రామోజీరావు ఐసీయూలో కోలుకుంటున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
TG: గ్రూప్-1 వాయిదాకు సింగిల్ జడ్జి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఈ దశలో నిర్ణయం తీసుకోలేమన్న సింగిల్ జడ్జి తీర్పును సమర్థించింది. ఇప్పుడు వాయిదా వేస్తే లక్షల మంది ఇబ్బందులకు గురవుతారనే వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్-1, ఎగ్జిక్యూటివ్ పోస్టులకూ జూన్ 9నే పరీక్ష ఉండటంతో పలువురు కోర్టును ఆశ్రయించారు.
TG: భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం రెవెన్యూ చట్టాల్లో మార్పులు చేయాలని ధరణి కమిటీ భావిస్తోంది. రాష్ట్రంలో అమల్లో ఉన్న రెవెన్యూ యాక్ట్, 2020లో పలు లోపాలు ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ఇందుకు సంబంధించి కమిటీ ఓ నివేదికను కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం. ఆ నివేదిక ఆధారంగా చట్టంలో మార్పులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.
ఎన్నికల ఫలితాల సందర్భంగా జూన్ 4న స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంపై సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలైంది. అదానీ హిండెన్‌బర్గ్ కేసు రిట్ పిటిషన్‌కు అనుబంధంగా ఈ పిటిషన్ ఫైల్ అయింది. మార్కెట్లు ఆ స్థాయిలో క్రాష్ కావడంపై విచారణ జరిపి సెబీ, కేంద్రం నివేదికలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. అదానీ-హిండెన్‌బర్గ్ వివాదంపైన కూడా సెబీ తన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ సమర్పించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు.
టీ20 ప్రపంచకప్‌లో నేడు నాలుగు గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు జరగనున్నాయి. న్యూజిలాండ్-అఫ్గానిస్థాన్ (గ్రూప్ సీ) మధ్య ఉదయం 5 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. మరోవైపు శ్రీలంక-బంగ్లాదేశ్ (గ్రూప్ డీ) మ్యాచ్ ఉదయం 6 గంటలకు, నెదర్లాండ్స్-సౌతాఫ్రికా (గ్రూప్ డీ) మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానున్నాయి. గ్రూప్ బీ జట్లు అయిన ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ కూడా రాత్రి 10.30 గంటలకు మ్యాచ్ జరగనుంది.
Sorry, no posts matched your criteria.