News January 28, 2025

Stock Markets: బ్యాంకు, ఫైనాన్స్ షేర్ల జోరు

image

స్టాక్‌మార్కెట్లు మోస్తరు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ 22,894 (+67), సెన్సెక్స్ 75,696 (+329) వద్ద ట్రేడవుతున్నాయి. బ్యాంకు, ఫైనాన్స్, ఐటీ షేర్లకు డిమాండ్ ఉంది. ఫార్మా, హెల్త్‌కేర్, మీడియా, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లపై సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. INFY, శ్రీరామ్ ఫిన్, యాక్సిస్ BANK, ICICI BANK, HDFC BANK టాప్ గెయినర్స్. సన్ ఫార్మా, NTPC, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్, కోల్ ఇండియా టాప్ లూజర్స్.

News January 28, 2025

సనాతన్ పరిరక్షణ బోర్డు వచ్చేనా!

image

మహా కుంభమేళా జరుగుతున్న వేళ ‘సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు’పై మళ్లీ చర్చ మొదలైంది. నిన్న ప్రయాగ్‌రాజ్‌లో నాగ, వివిధ అఖాడాల సాధువులతో HM అమిత్‌షా సుదీర్ఘంగా చర్చించారు. వారు సనాతన్ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని కోరినట్టు తెలిసింది. అలాగే ఆలయాలు, దేవుడి మాన్యాలు, ఆస్తులను ప్రభుత్వ పరిధి నుంచి తప్పించాలని కోరారు. గతంలో పవన్ కళ్యాణ్‌ సైతం ఇదే డిమాండ్ చేశారు. మరి కేంద్రం ఈ మొర ఆలకించేనా? మీ కామెంట్.

News January 28, 2025

తగ్గిన చలి.. పెరగనున్న ఉష్ణోగ్రతలు

image

తెలంగాణలో వచ్చే వారం రోజులపాటు పగలు, రాత్రి ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల వరకు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉదయం పొగమంచు తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. పగటి ఉష్ణోగ్రతలు, రాత్రివేళ కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగడంతో చలి తీవ్రత తగ్గిందని వివరించింది. అటు ఏపీలో మన్యం సహా పలు ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది.

News January 28, 2025

ఓటీటీలోకి ‘మార్కో’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

image

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘మార్కో’ ఓటీటీ హక్కులను సోనీ లివ్ దక్కించుకుంది. ఫిబ్రవరి 27 లేదా మార్చి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు HT వెల్లడించింది. హనీఫ్ అదేనీ డైరెక్షన్‌లో ఉన్ని ముకుందన్ నటించిన ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదలై రూ.110 కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది. మలయాళ ఇండస్ట్రీలోనే మోస్ట్ వయలెంట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీగా నిలిచింది.

News January 28, 2025

ఫిబ్రవరిలో మోదీ అమెరికాకు రావొచ్చు: ట్రంప్

image

ప్రధాని నరేంద్రమోదీ ఫిబ్రవరిలో వైట్‌హౌస్‌కు రావొచ్చని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. సోమవారం ఉదయం (US Time) ఆయనతో సుదీర్ఘంగా మాట్లాడినట్టు తెలిపారు. ‘మోదీ వైట్‌హౌస్‌కు వస్తారు. వచ్చే నెల్లో అంటే ఫిబ్రవరిలో రావొచ్చు. మాకు భారత్‌తో మంచి అనుబంధం ఉంది. చాలా అంశాలపై మోదీతో ఫోన్లో చర్చించాను’ అని ట్రంప్ మీడియాకు చెప్పారు.

News January 28, 2025

కడియం అంతుచూసేవరకూ నిద్రపోను: తాటికొండ రాజయ్య

image

TG: MLA కడియం శ్రీహరిపై BRS మాజీ మంత్రి తాటికొండ రాజయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘కడియం అంతు చూసేవరకూ నేను నిద్రపోను. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో ఏ అభివృద్ధీ లేదు. అవకాశవాదైన కడియం పప్పులు కాంగ్రెస్‌లో ఉడకవు. ఆ పార్టీ మంత్రులు సొంత దుకాణాలు తెరుచుకున్నారు. భట్టి విక్రమార్క భార్య సహా ఆ పార్టీ క్యాబినెట్ రాష్ట్రాన్ని దోచుకుంటోంది. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి అవినీతిమయం’ అని ఆరోపించారు.

News January 28, 2025

250 DEE పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్

image

AP: రాష్ట్రంలో 250 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల(DEE) పోస్టుల భర్తీకి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ ఖాళీలపై APPSCకి జలవనరుల శాఖ ప్రతిపాదనలు పంపనుంది. త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు సమాచారం. ఇటీవల ఈ శాఖలో 266 మంది ఉద్యోగులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. త్వరలోనే మరికొందరికి ప్రమోషన్లు ఇవ్వడంపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ దృష్టిసారించారు.

News January 28, 2025

మిస్టర్ 360 ఫామ్‌లోకి వస్తాడా?

image

టీమ్ ఇండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ రాణిస్తున్నా బ్యాటింగ్‌లో మాత్రం విఫలమవుతున్నారు. చివరి 5 టీ20 ఇన్నింగ్స్‌లలో 12, 0, 1, 4, 21 రన్స్ మాత్రమే చేశారు. దీంతో ఇవాళ ENGతో జరిగే మూడో టీ20లోనైనా ఆయన ఫామ్‌లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. గత ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు SKY 19 ఇన్నింగ్స్‌లలో 441 రన్స్ చేశారు. యావరేజ్ 24.50గా ఉంది.

News January 28, 2025

దేనికైనా సిద్ధమేనా అని అడిగాడు: ‘దంగల్’ నటి

image

తన కెరీర్‌లో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను ‘దంగల్’ నటి ఫాతిమా సనా షేక్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ‘ఓ సినిమా కోసం ఆడిషన్‌కు వెళ్లగా మీరు ఏం చేయడానికైనా సిద్ధమా అని ఓ డైరెక్టర్ నన్ను అడిగాడు. నా పాత్ర కోసం ఏది అవసరమో అది చేస్తానన్నాను. సౌత్‌లో అయితే క్యాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్‌గా మాట్లాడుకుంటారు. నేరుగా చెప్పకుండా మీరు కొందరిని కలవాల్సి ఉంటుంది అని చెప్పేవారు’ అంటూ ఆమె పేర్కొన్నారు.

News January 28, 2025

అసలేంటీ DeepSeek

image

ఇదొక చైనీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేథ) కంపెనీ. హై ఫ్లయర్ హెడ్జ్ ఫండ్ కంపెనీ ఫౌండర్ లియాంగ్ వెన్‌ఫాంగ్ దీనిని నెలకొల్పారు. కమర్షియల్ రిటర్న్ లేకుండా ఓపెన్ సోర్స్ విధానంలో AIమోడల్‌ను డెవలప్ చేశారు. ఇందులో లక్షలాది స్టూడెంట్స్, యూత్ పాల్గొన్నారు. ఓపెన్ సోర్స్ కావడంతో దీనినెవరైనా ఫ్రీగా వాడుకోవచ్చు. గుత్తాధిపత్యం ఉండదు. ఇది ChatGPT లాంటిదే. US ఆంక్షలున్నా DeepSeekను రూపొందించారు.