India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

బుచ్చిబాబు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న RC16 షూటింగ్ రెండు షెడ్యూల్స్ పూర్తయ్యింది. రేపటి నుంచి HYDలో కీలమైన మూడో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇందులో రామ్ చరణ్, జాన్వీ పాల్గొంటారని సమాచారం. గుండె ఆపరేషన్ తర్వాత కోలుకుంటున్న కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా త్వరలో జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో ఓ ఆటతో ముడిపడి ఉన్న కథాంశంతో ఈ మూవీ ఉంటుందని, ‘పెద్ది’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని టాక్.

TG: సూర్యాపేటలో ఓ యువకుడి పరువు హత్య కలకలం రేపుతోంది. అన్నారానికి చెందిన మాల బంటి (32), పిల్లలమర్రికి చెందిన నవీన్ ప్రాణ స్నేహితులు. నవీన్ చెల్లెలు భార్గవితో బంటికి పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 6 నెలల క్రితం వీరిద్దరూ కులాంతర వివాహం చేసుకున్నారు. నిన్న బంటి హత్యకు గురయ్యాడు. నవీన్, కుటుంబ సభ్యులే హత్య చేశారని బంటి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతుడు, నిందితులు కలిసి రియల్ ఎస్టేట్ చేసేవారు.

TG: కాళేశ్వర క్షేత్రం వద్ద గోదావరి, ప్రాణహిత నదులతో పాటు <<15282909>>సరస్వతి నది<<>> కలుస్తుందని భక్తులు నమ్ముతారు. రెండు నదులు ఎక్కడ కలిసినా అక్కడ సరస్వతి నది అంతర్వాహినిగా ప్రవహిస్తుందని పురాణాలు చెబుతున్నాయని పండితులు పేర్కొన్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని సరస్వతి నదిని, ఇక్కడి సరస్వతి నదిని ఒకటిగానే భావిస్తుంటారని తెలిపారు. ఇక్కడ సరస్వతి ఆలయం ఉండటం వల్ల కూడా సరస్వతి నది ఉన్నట్టుగా భావిస్తారని చెప్పారు.

తిరుమలలో భక్తుల రద్దీ నిన్నటితో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటలు పడుతోంది. ప్రస్తుతం 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 65,278మంది భక్తులు దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. 22,077మంది తలనీలాలు సమర్పించారని, హుండీకి రూ.3.70 కోట్ల ఆదాయం సమకూరిందని వెల్లడించారు.

గ్లోబల్ టెక్ కంపెనీలకు చైనా డీప్‌సీక్ AI చుక్కలు చూపిస్తోంది. ఇండస్ట్రీస్‌కు తక్కువ ధర, ప్రజలకు ఫ్రీగా లభిస్తుండటమే ఇందుకు కారణం. తాజా R1 వెర్షన్‌కు కాంపిటీటివ్ ఎడ్జ్ ఉండటం సిలికాన్ వ్యాలీలో ప్రకంపనలు రేపింది. MON నాస్‌డాక్ ఫ్యూచర్స్, సీమెన్స్ ఎనర్జీ, టోక్యో ఎలక్ట్రాన్, EU టెక్ స్టాక్స్, మైక్రోసాఫ్ట్, ASML షేర్లు క్రాష్ అయ్యాయి. Nvidia ఏకంగా $593b సంపద కోల్పోయింది. నేడూ బ్లడ్‌బాత్‌కు ఆస్కారముంది.

TG: ‘అభయహస్తం’ పథకం కింద 2009-2016 మధ్య మహిళా సంఘాల సభ్యులు జమ చేసిన డబ్బుల్ని తిరిగి చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామాల వారీగా లబ్ధిదారుల లిస్టును రెడీ చేస్తోంది. 60 ఏళ్లు దాటిన మహిళలకు రూ.500 పెన్షన్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్‌ను తీసుకురాగా, మహిళలు ఏడాదికి రూ.365 ప్రీమియం చెల్లించారు. 2018లో ఈ స్కీమ్ నిలిచిపోయింది. దీంతో వడ్డీతో కలిపి ఆ డబ్బును తిరిగి మహిళల ఖాతాల్లో జమ చేయనుంది.

ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ ఓటమి అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను తప్పించాలన్న డిమాండ్లు వినబడ్డాయి. అయితే, బీసీసీఐ గంభీర్‌కు మరింత సమయం ఇవ్వొచ్చని వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డారు. ‘భారత్ ఈ ఏడాది ఇంగ్లండ్‌లో ఆడే టెస్టు సిరీస్ వరకు గంభీర్‌ను BCCI కొనసాగించొచ్చు. ఒకవేళ ఆ సిరీస్ కూడా కోల్పోతే ఇక భారత కోచ్‌గా ఆయనకు అదే ఆఖరి సిరీస్ అయ్యే అవకాశం ఉంది’ అని పేర్కొన్నారు.

TG: అన్ని ప్రభుత్వ విద్యా సంస్థల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ఒకే విధమైన కామన్ మెనూను అమలు చేయాలని విద్యా కమిషన్ ప్రతిపాదించింది. అన్ని కేటగిరీల వారికి మెస్ ఛార్జీలను రూ.2 పెంచాలని, ఒకే మెస్ ఛార్జీలను అమలు చేయాలని సీఎస్‌కు నివేదిక ఇచ్చింది. వంట సహా తాగేందుకు బోర్ నీళ్లకు బదులు మిషన్ భగీరథ నల్లా నీళ్లు వాడాలని పేర్కొంది. భోజనాన్ని కట్టెల పొయ్యిలపై కాకుండా గ్యాస్‌పై వండించాలని సూచించింది.

AP: దావోస్ పర్యటనలో కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఒప్పందమూ చేసుకోకపోవడంపై వస్తున్న విమర్శలకు మంత్రి లోకేశ్ కౌంటరిచ్చారు. CBN 1997 నుంచి దావోస్‌కు వెళ్తున్నారని, అక్కడ ఎప్పుడూ MOUలు జరగవని చెప్పారు. చర్చలు మాత్రమే జరుగుతాయన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే రాష్ట్రానికి రూ.6.33 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని తెలిపారు. వీటి వల్ల 4.1 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు.

TG: రైతులకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేదని నిరసిస్తూ ఇవాళ నల్గొండలో బీఆర్ఎస్ రైతు మహా ధర్నా నిర్వహించనుంది. క్లాక్ టవర్ వేదికగా KTR నాయకత్వంలో ఆ పార్టీ నేతలతో పాటు పలువురు రైతులు నిరసన తెలపనున్నారు. ఉ.11 నుంచి మ.2 గంటల వరకు మాత్రమే ధర్నాను నిర్వహించాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.
Sorry, no posts matched your criteria.