News April 21, 2024

ఇండియన్ సినిమాకు 111 ఏళ్లు

image

భారతీయ తొలి సినిమా ‘రాజాహరిశ్చంద్ర’ సరిగ్గా ఇదే రోజు 1913లో విడుదలైంది. దాదాసాహెబ్ ఫాల్కే తెరకెక్కించిన ఈ మూవీని తొలుత ముంబైలో ప్రదర్శించారు. రామాయణ మహాభారతాల్లో పేర్కొన్న రాజు హరిశ్చంద్రుడి గురించి ఇందులో చూపించారు. ఈ మూవీ కంటే ముందు ‘పుండలీక్’ 1912లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లంతా విదేశీయులు కావడంతో ‘రాజాహరిశ్చంద్ర’ భారత తొలి సినిమాగా పరిగణితమవుతోంది.

News April 21, 2024

IPL: గుజరాత్ టార్గెట్ 143 రన్స్

image

గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 142 స్కోరుకే ఆలౌటైంది. ఆ జట్టు బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రాన్ 35, హర్‌ప్రీత్ బ్రార్ 29, సామ్ కరన్ 20 రన్స్‌తో ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. GT బౌలర్లలో సాయి కిశోర్ 4, మోహిత్‌ శర్మ 2, నూర్ అహ్మద్ 2 వికెట్లు తీయగా రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టారు.

News April 21, 2024

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

image

AP: రాష్ట్రానికి సంబంధించిన 9 మంది ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. శ్రీకాకుళం-పెడద పరమేశ్వరరావు, విజయనగరం-బొబ్బిలి శ్రీను, అమలాపురం(SC)- జంగా గౌతమ్, మచిలీపట్నం-గొల్లు కృష్ణ, విజయవాడ-వల్లూరు భార్గవ్, ఒంగోల్-ఈదా సుధాకర్ రెడ్డి, నంద్యాల-జేఎల్ నరసింహ యాదవ్, అనంతపురం-వజ్జల మల్లికార్జున, హిందూపురం-సమద్ షాహీన్‌ల పేర్లతో జాబితా విడుదల చేసింది.

News April 21, 2024

పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో

image

మసూద, జార్జ్ రెడ్డి, పలాస 1978 వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ హీరో తిరువీర్ ఓ ఇంటివాడయ్యారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కల్పనా రావుతో ఆయన వివాహం జరిగింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కొత్త జర్నీని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. పెళ్లి ఫొటోలను షేర్ చేశారు.

News April 21, 2024

నాతో పాటు కోమటిరెడ్డికే సీఎం అర్హత: రేవంత్

image

TG: తనతోపాటు సీఎం అయ్యే అర్హతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కోమటిరెడ్డి పోరాట యోధుడు. తెలంగాణ కోసం ఆయన రాజీనామా చేస్తే.. కేసీఆర్ దొంగ దీక్ష చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కోమటిరెడ్డి బ్రదర్స్ పోరాటం చేసి కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఒప్పించారు. బీఆర్ఎస్‌కు ఒక్క సీటు వచ్చినా బీజేపీలో కలిపేస్తారు. ప్రధాని మోదీతో కేసీఆర్ ఏనాడూ పోరాడలేదు’ అని ఆయన మండిపడ్డారు.

News April 21, 2024

విదేశీ క్రికెటర్లపై సూర్య తాపం

image

ఐపీఎల్‌లో విదేశీ క్రికెటర్లు ఎండ దెబ్బకు గురవుతున్నారు. దేశంలోని కొన్ని స్టేడియాల్లో దాదాపు 40 డిగ్రీలకుపైగా ఎండ ఉండటంతో వారు తాళలేకపోతున్నారు. పెరిగిన ఉష్ణోగ్రతలతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఆట మధ్యలో గొడుగుల కింద సేద తీరుతున్నారు. ఇవాళ కోల్‌కతాలో జరుగుతున్న ఆర్సీబీ-కేకేఆర్ మ్యాచ్‌లోనూ ఈ పరిస్థితి తలెత్తింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

News April 21, 2024

IPL చరిత్రలో తొలి ప్లేయర్

image

ఐపీఎల్‌లో KKR ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ రికార్డు సృష్టించారు. టోర్నీ చరిత్రలో ఒకే జట్టు తరఫున అత్యధిక వికెట్లు (172) పడగొట్టిన ప్లేయర్‌గా నిలిచారు. అతని తర్వాతి స్థానాల్లో వరుసగా లసిత్ మలింగా (170-ముంబై), జస్ప్రీత్ బుమ్రా (158-ముంబై), భువనేశ్వర్ కుమార్ (150-SRH), డ్వేన్ బ్రావో (140-CSK) ఉన్నారు.

News April 21, 2024

సీఏఏను ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదు: రాజ్‌నాథ్

image

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలును ప్రపంచంలో ఏ శక్తీ ఆపలేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తేల్చిచెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘బెంగాల్ సీఎం మమత సీఏఏపై ముస్లింలలో అబద్ధాల్ని ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రాలకు సీఏఏను ఆపే అధికారం లేదు. మమత పార్టీ తీవ్ర అవినీతిలో కూరుకుపోయింది. కానీ పదేళ్ల మా ప్రభుత్వంలో ఒక్క అవినీతి మచ్చ లేదు’ అని పేర్కొన్నారు.

News April 21, 2024

తేజా సజ్జ ‘మిరాయ్‌’లో దుల్కర్ సల్మాన్?

image

తేజా సజ్జ హీరోగా నటిస్తున్న ‘మిరాయ్‌’ సినిమాలో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు దుల్కర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రితిక ఫీమేల్ లీడ్ క్యారెక్టర్ పోషిస్తున్నారు. గౌర హరీశ్ మ్యూజిక్ అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 18న రిలీజ్ చేయనున్నారు.

News April 21, 2024

ఇండియన్ చార్లెస్ శోభరాజ్‌ కన్నుమూత

image

ఇండియన్ చార్లెస్ శోభరాజ్‌గా పేరొందిన ధన్ రామ్ మిట్టల్(85) గుండెపోటుతో మరణించాడు. హరియాణాకు చెందిన అతడు 1960లో రోహ్‌తక్ కోర్టులో క్లర్కుగా విధులు నిర్వర్తించాడు. అక్కడి జడ్జి 2 నెలలు లీవులో ఉండటంతో నకిలీ పత్రాల సాయంతో జడ్జి అవతారమెత్తి 2 వేల మంది నేరస్థులను విడుదల చేయించాడు. తర్వాత ఢిల్లీ, హరియాణా, రాజస్థాన్‌ తదితర ప్రాంతాల్లో వెయ్యికి పైగా కార్లను దొంగతనం చేసి లెక్కలేనన్ని సార్లు జైలుకు వెళ్లాడు.