News April 21, 2024

రేపు జగన్ కీలక భేటీ

image

AP: మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ రేపు పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. మేనిఫెస్టోకు తుదిరూపు ఇచ్చేందుకు జరిగే ఈ సమావేశంలో పార్టీ హామీలను ఫైనల్ చేయనున్నారు. అనంతరం ఈ నెల 26, 27 తేదీల్లో మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉంది. రైతులు, మహిళలు, యువత కేంద్రంగా వైసీపీ హామీలు ఉండనున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది.

News April 21, 2024

రోహిత్ తర్వాత కెప్టెన్ అతనే: రైనా

image

మాజీ క్రికెటర్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత జట్టుకు రోహిత్ శర్మ తర్వాత శుభమన్ గిల్ కెప్టెన్ కావొచ్చని రైనా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ జట్టుకు గిల్ సారథ్యం వహిస్తున్నారు. రోహిత్‌తో కలిసి ఈ యంగ్ ఓపెనర్ భారత జట్టుకు వన్డేల్లో అద్భుతమైన ఆరంభాలు ఇస్తున్న సంగతి తెలిసిందే.

News April 21, 2024

నాగేశ్వరరావుకు వైసీపీ కౌంటర్

image

AP: సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావుపై వైసీపీ మండిపడింది. ‘కరుడు గట్టిన అధికార దాహం ఎంత క్రూరంగా ఉంటుందో? మహానుభావుడు YSR గారు చచ్చి బతికిపోయారు గానీ.. బతికుంటే తన తమ్ముడి కంటే దారుణంగా చంపబడే వారేమో!’ అని నాగేశ్వరరావు ట్వీట్ చేశారు. దీనికి ‘లంచం తీసుకుంటూ దొరికిపోయిన నువ్వు కూడా నీతులు చెప్పడమేనా. ఎవరికి చెంచాగిరి చేయడం కోసం ఈ కబుర్లు చెప్తున్నావో అందరికీ తెలుసు’ అంటూ వైసీపీ కౌంటర్ ఇచ్చింది.

News April 21, 2024

ఇవాళ టీవీల్లోకి ‘సలార్’

image

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘సలార్’. ఈ సినిమా డిసెంబర్‌లో థియేటర్లలో విడుదలై రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో ఇవాళ టీవీల్లో ప్రసారం కానుంది. స్టార్ మా ఛానల్‌లో సాయంత్రం 5.30 గంటలకు టెలికాస్ట్ కానుంది. సినిమా విడుదలైన నాలుగు నెలలకు టీవీల్లోకి రావడం గమనార్హం.

News April 21, 2024

విశాఖ నార్త్: మరోసారి బీజేపీ వశమవుతుందా?

image

AP: విశాఖ నార్త్ నియోజకవర్గం 2008లో ఏర్పడింది. 2009లో కాంగ్రెస్, 2014లో BJP, 19లో TDP ఇక్కడ నెగ్గాయి. పొత్తులో భాగంగా ఇక్కడ BJP పోటీ చేస్తోంది. ఈసారి కూడా 2014లో పోటీ చేసి గెలిచిన బీజేపీ నేత విష్ణుకుమార్ రాజే మళ్లీ బరిలోకి దిగారు. టీడీపీ, జనసేన మద్దతుతో గెలుస్తానని విష్ణు ధీమాగా ఉన్నారు. ఇటు గత ఎన్నికల్లో గంటాపై పోటీ చేసి ఓడిపోయిన కమ్ముల కన్నపరాజుని YCP మరోసారి యుద్ధానికి దింపింది.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 21, 2024

కూటమిలో దెందులూరు, అనపర్తి స్థానాలపై సందిగ్ధం

image

AP: NDAలో 2 స్థానాలపై సందిగ్ధత కొనసాగుతోంది. దెందులూరు, అనపర్తి స్థానాలపై BJP, TDP మధ్య చిక్కుముడి కొనసాగుతోంది. పొత్తులో BJPకి అనపర్తి సీటు కేటాయించగా.. కమలం గుర్తుపై పోటీ చేయాలని TDP నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చంద్రబాబు సూచించారు. నల్లమిల్లి అంగీకరిస్తే దెందులూరులో ఇప్పటికే టికెట్ ప్రకటించిన చింతమనేనికి ఇబ్బంది ఉండదు. లేదంటే అనపర్తి TDP తీసుకుని.. BJPకి దెందులూరు కేటాయించే ఛాన్సుంది.

News April 21, 2024

చల్లారని అసంతృప్తి జ్వాలలు.. అందుకే అభ్యర్థుల మార్పు!

image

AP: మడకశిరలో అభ్యర్థిని TDP <<13094674>>మార్చింది<<>>. అక్కడ Ex MLA ఈరన్న కుమారుడు సునీల్‌కు టికెట్ ఇవ్వడాన్ని మాజీ MLC తిప్పేస్వామి వర్గం తీవ్రంగా వ్యతిరేకించింది. ఇటు పాడేరులో TDP నేతల మధ్య వర్గ విభేదాలతో కొత్త వ్యక్తి రమేశ్‌ని తొలుత TDP ప్రకటించింది. దీనిపై మాజీ MLA ఈశ్వరి వర్గం భగ్గుమంది. నియోజకవర్గంపై పూర్తి పట్టు ఉండటంతో తిరిగి ఆమెనే అభ్యర్థిగా నిలబెట్టినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

News April 21, 2024

స్టైలిష్ లుక్‌లో ప్రభాస్

image

రెబల్ స్టార్ ప్రభాస్ స్టైలిష్ లుక్‌లో మెరిశారు. కల్కి, రాజాసాబ్ సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉన్న ఆయన సౌండ్ ఇంజినీర్‌ పప్పు కూతురు, కుమారుడి హాఫ్‌ శారీ, ధోతీ ఫంక్షన్‌కు హాజరయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో బ్లాక్‌ షర్ట్‌, క్యాప్‌, గాగుల్స్‌లో మెరిసిపోతూ ఆకర్షణగా నిలిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.

News April 21, 2024

రిషభ్ పంత్‌పై ఫ్యాన్స్‌లో ఆందోళన

image

SRHపై మ్యాచ్‌లో రిషభ్ పంత్ ప్రదర్శన పట్ల టీమ్ ఇండియా అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అతడి ఆటతీరు మునుపటిలా లేకపోవడమే ఇందుక్కారణం. ఫిట్‌నెస్ పరంగానూ మోకాలి గాయం నుంచి ఇంకా కోలుకున్నట్లు కనిపించడం లేదంటున్నారు. పలు షాట్లు ఆడినప్పుడు పంత్ కింద పడిపోతుండటం గమనార్హం. రానున్న టీ20 వరల్డ్ కప్‌నకు అతడిని సెలక్ట్ చేస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో పంత్ ఎలా ఆడతారోనంటూ నెట్టింట చర్చ నడుస్తోంది.

News April 21, 2024

పాతపట్నంలో వైసీపీ హ్యాట్రిక్ కొట్టేనా?

image

AP: శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ చైతన్యం కలిగిన అసెంబ్లీ స్థానాల్లో పాతపట్నం ఒకటి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు 7 సార్లు, TDP 5, YCP 2సార్లు, స్వతంత్రులు ఒకసారి గెలిచారు. 1996లో జరిగిన బై పోల్‌లో NTR సతీమణి లక్ష్మీపార్వతి ఇక్కడి నుంచి గెలిచారు. 2014,19 పాతపట్నంలో జెండా ఎగరేసిన YCP.. పట్టు నిలుపుకోవాలని చూస్తోంది. మరోసారి రెడ్డిశాంతిని బరిలోకి దింపింది. TDP తరఫున మామిడి గోవిందరావు పోటీలో నిలిచారు.<<-se>>#ELECTIONS2024<<>>