News April 20, 2024

కుంగిపోతున్న చైనా.. ప్రమాదంలో ప్రజలు!

image

చైనాలోని భూభాగం ఏడాదికి 10mm చొప్పున కుంగిపోతోందని UKకి చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. శాటిలైట్ నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ‘చైనాలో 3వ వంతు ప్రజలు ప్రమాదంలో ఉన్నారు. ప్రస్తుతం సముద్ర మట్టానికి దిగువన ఉన్న చైనాలోని పట్టణ ప్రాంతం 2120 నాటికి 3 రెట్లు పెరిగి.. మరింత కుంగిపోతుంది. దీని వల్ల 55 నుంచి 128 మిలియన్ల మంది ప్రభావితమవుతారు’ అని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

News April 20, 2024

పొలిటికల్ టర్న్ తీసుకున్న యువతి హత్య

image

కర్ణాటకలో కాంగ్రెస్ కార్పొరేటర్ కూతురు నేహా హిరేమఠ్(23) <<13080714>>హత్య<<>> రాజకీయ రంగు పులుముకుంది. ఇది ‘లవ్ జిహాది’ పనేనని కేంద్రమంత్రి, బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. అయితే ఈ వ్యాఖ్యలను రాష్ట్రమంత్రి, కాంగ్రెస్ నేత పరమేశ్వర కొట్టిపారేశారు. ఫయాజ్‌ను నేహా దూరం పెట్టడంతోనే అతడు చంపేశాడని చెప్పారు. మరోవైపు నిందితుడిని కఠినంగా శిక్షించి, నేహాకు న్యాయం చేయాలని తోటి విద్యార్థులు ఆందోళనకు దిగారు.

News April 20, 2024

రేపు మటన్, చికెన్ షాపులు బంద్

image

జైన మత ప్రచారకుడు మహావీర్ జయంతిని పురస్కరించుకొని GHMC కీలక ఆదేశాలు జారీ చేసింది. రేపు గ్రేటర్ HYD వ్యాప్తంగా మాంసం దుకాణాలు బంద్ చేయాలని ఆదేశించింది. చికెన్, మటన్ అమ్మకాలను నిషేధించింది. ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. మరోవైపు నగరంలో తక్కువ సంఖ్యలో ఉన్న జైనుల కోసం ఆదివారం గ్రేటర్ వ్యాప్తంగా షాపులు బంద్ చేయడం ఏంటని మాంసం ప్రియులు ప్రశ్నిస్తున్నారు.

News April 20, 2024

పేదరికం లేని రాష్ట్రంగా మార్చేందుకు కృషి: CBN

image

AP: సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు అన్నారు. తిరుపతి జిల్లా గూడూరులో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అందరిని మోసం చేసి ఒక్కడే ఉండాలని కోరుకునే దుర్మార్గుడు జగన్ అని దుయ్యబట్టారు. ఇలాగే కొనసాగితే అంతా బానిసలుగా బతికే పరిస్థితి వస్తుందన్నారు. ఏపీని పేదరికం లేని రాష్ట్రంగా మార్చడమే తన జీవితాశయమని.. తప్పక సాధిస్తానని చెప్పారు.

News April 20, 2024

సివిల్స్ టాపర్‌కు సీఎం సత్కారం

image

TG: సివిల్స్ ఫలితాల్లో మెరిసిన దోనూరు అనన్య రెడ్డి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లిన ఆమెను సీఎం శాలువాతో సత్కరించి అభినందించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన అనన్య రెడ్డి అసాధారణ ప్రతిభతో తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే.

News April 20, 2024

కొత్త క్రిమినల్ చట్టాలపై సీజేఐ ప్రశంసలు

image

కొత్త క్రిమినల్ చట్టాలపై సీజేఐ చంద్రచూడ్ ప్రశంసల వర్షం కురిపించారు. నేర న్యాయవ్యవస్థలో సవరణలకు సిద్ధంగా భారతదేశం ఉందని చెప్పారు. ‘నేర న్యాయవ్యవస్థ పరిపాలనలో భారత పురోగతి’పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పౌరులుగా మనమంతా ఈ చట్టాలను స్వీకరిస్తే విజయవంతమవుతాయని చెప్పారు. జులై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రానున్న సంగతి తెలిసిందే.

News April 20, 2024

ధోనీ వస్తుంటే బౌలర్లు భయపడ్డారు: రాహుల్

image

LSGvsCSK మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్‌కు వస్తుంటే తమ బౌలర్లు భయపడ్డారని కెఎల్.రాహుల్ అన్నారు. అతడు బ్యాటింగ్‌కు రావడం చూసి స్టేడియంలోని ప్రేక్షకులు భారీ శబ్దాలు చేయడంతో బౌలర్లు ఒత్తిడికి లోనయ్యారని వెల్లడించారు. ఇదే మ్యాచ్‌లో ధోనీ వస్తున్నప్పుడు తనకు వచ్చిన సౌండ్ అలర్ట్‌ మెసేజ్‌ను LSG బ్యాటర్ డికాక్ భార్య సైతం ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. కాగా ఈ మ్యాచ్‌లో ధోనీ 9బంతుల్లో 28 రన్స్ చేశారు.

News April 20, 2024

జనసేన అభ్యర్థి ఆస్తి రూ.894 కోట్లు!

image

AP: తనకు రూ.894.92 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం మాధవి అఫిడవిట్‌లో వెల్లడించారు. మిరాకిల్ సాఫ్ట్‌వేర్ కంపెనీ, విద్యాసంస్థలు, భూములు, నగలు, బ్యాంకుల్లో డిపాజిట్ల వంటి రూపంలో ఆస్తులున్నాయి. బ్యాంకులో రూ.4.42 కోట్లు, చేతిలో రూ.1.15 లక్షల నగదు ఉన్నాయి. చరాస్తులు రూ.856.57 కోట్లు, స్థిరాస్తులు రూ.15.70 కోట్లు, రూ.2.69 కోట్ల అప్పు ఉన్నట్లు మాధవి తెలిపారు.

News April 20, 2024

జైలు వ్యానులో మహిళా ఖైదీపై అత్యాచారం

image

హరియాణాలో ఇద్దరు ఖైదీలు దారుణానికి ఒడిగట్టారు. జైలు వ్యానులో మహిళా ఖైదీపై అత్యాచారానికి పాల్పడ్డారు. రోహ్‌తక్ జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీ, మరో ఇద్దరు పురుష ఖైదీలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు అధికారులు జైలు వ్యాన్ ఎక్కించారు. పోలీసులు డాక్యుమెంట్ వర్క్ చేస్తుండగా ఇద్దరు ఖైదీలు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె పోలీసులకు చెప్పడంతో వారు విస్తుపోయారు.

News April 20, 2024

CBNకు జనసేనాని పుట్టినరోజు శుభాకాంక్షలు

image

TDP అధినేత చంద్రబాబుకు జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘రాజకీయంగా, పరిపాలనాపరంగా అనుభవజ్ఞులైన చంద్రబాబు నిరంతరం రాష్ట్రం గురించే ఆలోచిస్తారు. రాజకీయ ఒత్తిళ్లు, వేధింపులు ఎన్ని ఎదురైనా దృఢ చిత్తంతో ఎదుర్కొంటారు. వైసీపీ సర్కారు బనాయించిన కేసులతో కారాగారంలో ఉన్నప్పుడూ మనో నిబ్బరం కోల్పోలేదు. ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుణ్ని కోరుకుంటున్నా’ అని తెలిపారు.