News April 19, 2024

ఇదేనా రాజకీయం?

image

తెలంగాణలో ‘టచ్’ రాజకీయాలు నడుస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని కాంగ్రెస్ మంత్రులు అంటుంటే.. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే టచ్‌లో ఉన్నారంటూ బీఆర్ఎస్ నేతలంటున్నారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారంటూ బీజేపీ చెబుతోంది. ఇదంతా గమనిస్తున్న ప్రజలు.. ‘ఇవేం రాజకీయాలు?’ అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

News April 19, 2024

MI కెప్టెన్‌కు రూ.12 లక్షల ఫైన్

image

పంజాబ్ కింగ్స్‌పై గెలుపొందిన ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్ మేనేజ్‌మెంట్ షాకిచ్చింది. ఆ టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు భారీ జరిమానా విధించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్‌కు రూ.12 లక్షల ఫైన్ వేసింది. ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇప్పటికే ఢిల్లీ కెప్టెన్ పంత్‌కు రెండు సార్లు, గుజరాత్ కెప్టెన్ గిల్‌కు ఒకసారి జరిమానా విధించిన విషయం తెలిసిందే.

News April 19, 2024

Gallery: ఓటెత్తిన ప్రముఖులు

image

దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తుతున్నారు. వేసవి కావడంతో ఉదయాన్నే ఓటింగ్ సెంటర్లకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ఆయాచోట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

News April 19, 2024

Elections2024: ఆసక్తికర విషయాలు

image

భారత దేశ చరిత్రలో లోక్‌సభ ఎన్నికలు సుధీర్ఘంగా జరగడం ఇది రెండోసారి. ఈదఫా 7 విడతల్లో ఏప్రిల్ 19 నుంచి జూన్ 4 వరకు 44 రోజుల పాటు ఎన్నికలు కొనసాగనున్నాయి. అయితే.. ఇంతకంటే సుదీర్ఘమైన ఎన్నికలు గతంలో జరిగాయి. ఏకంగా 68 విడతల్లో పోలింగ్ నిర్వహించడం విశేషం. 1951 అక్టోబర్ 25న మొదలై 1952 ఫిబ్రవరి 21న ముగిశాయి. ఓటింగ్ ప్రక్రియకు 3 నెలల 27 రోజులు పట్టింది. గత 2019 ఎన్నికలు 39రోజుల్లో ముగిశాయి.
<<-se>>#Elections2024<<>>

News April 19, 2024

జనసేనాని ప్రచార షెడ్యూల్ ఖరారు

image

AP: జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. ఈనెల 20న పిఠాపురం నుంచి మొదలయ్యే షెడ్యూల్ 22 రోజుల పాటు కొనసాగుతుంది. 21న భీమవరం, నర్సాపురం, 22న తాడేపల్లిగూడెంలో ఆయన పర్యటించనున్నారు. 23న పిఠాపురంలో నామినేషన్ వేస్తారు. పలు నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొంటారు. మే 10న మరోసారి పిఠాపురంలో రోడ్డు షో చేసి అక్కడి సభలో ప్రసంగిస్తారు. 11న కాకినాడ రూరల్‌లో రోడ్డు షోతో షెడ్యూల్ ముగియనుంది.

News April 19, 2024

కాంగ్రెస్ రంగు బయటపడుతోంది: KTR

image

TG: 120రోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అసలు రంగు బయటపడుతోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. నిరుద్యోగులకు నెలకు రూ.4వేలు, ఫిబ్రవరి 1న ఉద్యోగ నోటిఫికేషన్లు, పోటీ పరీక్షల ఫీజు ఎత్తివేత వంటి హామీలను నెరవేర్చలేదని అన్నారు. కోర్టులో కేసులు వేసి ఎన్నో పోటీ పరీక్షలు రద్దయ్యేలా చేసిన బల్మూరి వెంకట్‌కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిందని ఆరోపించారు.

News April 19, 2024

అమ్మ చనిపోయింది.. పోటీ చేయలేను: డిప్యూటీ సీఎం కూతురు

image

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హిమాచల్‌ప్రదేశ్ డిప్యూటీ CM ముకేశ్ అగ్నిహోత్రి కుమార్తె ఆస్తా నిరాకరించారు. ఆమెను హమీన్‌పుర్ నుంచి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌పై పోటీకి దింపాలని కాంగ్రెస్ భావించింది. ‘తల్లి మరణాన్ని తట్టుకోలేకపోతున్నా. ఆమె జ్ఞాపకాలే మదిలో మెదులుతున్నాయి. ఇలాంటి విషాద సమయంలో ఎన్నికల బరిలో నిలవలేను’ అని తెలిపారు. కాగా ఆస్తా తల్లి అనారోగ్యంతో ఫిబ్రవరిలో మరణించారు.

News April 19, 2024

ఓటేసిన తమిళ స్టార్ హీరోలు

image

తమిళ స్టార్ హీరోలు సామాన్యుల్లా క్యూలో నిల్చొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రజనీకాంత్, అజిత్ కుమార్, ధనుష్, శివకార్తికేయ ఉదయాన్నే పోలింగ్‌ బూత్‌లకు వెళ్లి ఓటు వేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఓటు వేసిన సూపర్ స్టార్ రజనీకాంత్.. ఓటు మన హుందాతనాన్ని పెంచుతుందని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

News April 19, 2024

మే 3న ‘ఇంటి నుంచి ఓటు’ ప్రారంభం

image

TG: ‘ఇంటి నుంచి ఓటు’ హక్కు వినియోగించుకోవాలనుకునే వయోవృద్ధులు, దివ్యాంగులు ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. మే 3 నుంచి 8లోగా వారి ఓటు నమోదు చేస్తామన్నారు. మరోవైపు రాష్ట్రంలో ప్రస్తుతం 3,31,48,527 ఓటర్లుగా నమోదయ్యారని, ఈ నెల 15 వరకు స్వీకరించిన దరఖాస్తుల్లో 1.17 లక్షల అర్జీలను పరిష్కరించాల్సి ఉందని వెల్లడించారు.

News April 19, 2024

ఎల్లుండి అభ్యర్థులకు టీడీపీ బీఫాంలు

image

AP: TDP చీఫ్ చంద్రబాబు ఈనెల 21న అభ్యర్థులకు బీఫాంలు అందజేయనున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో 144 మంది అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు బాబు స్వయంగా వాటిని అందజేస్తారు. అనంతరం ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలు, మిత్రపక్షాలతో సమన్వయం వంటి అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు 2,3 చోట్ల అభ్యర్థుల మార్పుపై కసరత్తు చేస్తున్న బాబు.. అదేరోజు కొత్త అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.