News April 19, 2024

నేటి నుంచి సీఎం రేవంత్ ఎన్నికల ప్రచారం

image

TG: పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. ఉదయం మహబూబ్‌నగర్‌లో వంశీచంద్ రెడ్డి నామినేషన్‌కు హాజరై సాయంత్రం మహబూబాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారు. రేపు మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్‌కు హాజరైన అనంతరం కర్ణాటకలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. ఈనెల 21న భువనగిరి, 22న ఆదిలాబాద్‌, 23న నాగర్‌కర్నూల్‌, 24న జహీరాబాద్‌, వరంగల్‌లో పర్యటించనున్నారు.

News April 19, 2024

గుజరాత్‌లో అతిపెద్ద పాము శిలాజాలు గుర్తింపు!

image

గుజరాత్‌లోని కచ్‌లో ఇటీవల గుర్తించిన శిలాజాలకు సంబంధించి IIT రూర్కి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. ఇవి ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పాముకు చెందిన వెన్నెముక భాగాలు కావొచ్చని పేర్కొంది. అంతరించిపోయిన మా‌డ్‌ట్సోయిడే కుటుంబానికి చెందిన ఈ పాము పొడవు 11-15 మీటర్లు (36-49 ఫీట్లు) ఉండొచ్చని తెలిపింది. కాగా కొత్తగా గుర్తించిన ఈ రకం పాము జాతికి పరిశోధకులు ‘వాసుకీ ఇండికస్’ అని నామకరణం చేశారు.

News April 19, 2024

ఐపీఎల్ ఎఫెక్ట్.. డిస్నీ స్టార్‌కు పెరిగిన వీక్షకులు!

image

ఈ ఐపీఎల్‌‌ తొలి 26 మ్యాచ్‌లతో తమ టీవీ ఛానెళ్లకు 45కోట్ల మంది వీక్షకులు వచ్చినట్లు డిస్నీ స్టార్ గ్రూప్ వెల్లడించింది. గత సీజన్‌తో పోలిస్తే ఈసారి తమ ఛానెళ్లకు మొత్తంగా రీచ్ 8శాతం, టెలివిజన్ రేటింగ్స్ 15% పెరిగినట్లు తెలిపింది. గరిష్ఠంగా ముంబై ఇండియన్స్, RCB మధ్య ఈనెల 11న జరిగిన మ్యాచ్‌ను 15 కోట్ల మంది వీక్షించినట్లు తెలిపింది. మరోవైపు టోటల్ వాచ్ టైమ్ 188 బిలియన్ మినట్స్‌గా ఉన్నట్లు పేర్కొంది.

News April 19, 2024

మరోసారి గెలిస్తే రెండేళ్లలో నక్సలిజం అంతం చేస్తాం: అమిత్ షా

image

ప్రధాని మోదీని మరోసారి గెలిపిస్తే దేశంలో నక్సలిజం అనేది లేకుండా చేస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ‘అధికారంలోకి వచ్చిన ఏడాది లేదా రెండేళ్లలోనే నక్సలిజాన్ని అంతం చేస్తాం. ఛత్తీస్‌గఢ్‌లో BJP సర్కార్ రాగానే 90 రోజుల్లోనే 86 మంది నక్సల్స్ హతమయ్యారు. 126 మంది అరెస్ట్ కాగా 250 మంది సరెండర్ అయ్యారు’ అని తెలిపారు. కాంకేర్ ఎన్‌కౌంటర్‌లో 29 మంది మావోలు హతమైన నేపథ్యంలో షా ఈ వ్యాఖ్యలు చేశారు.

News April 19, 2024

భారత నేవీ కొత్త చీఫ్‌గా దినేశ్ త్రిపాఠి

image

భారత నేవీ చీఫ్‌గా అడ్మిరల్ హరి కుమార్ పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్రం వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠిని కొత్త చీఫ్‌గా ప్రకటించింది. ఈనెల 30న త్రిపాఠి నేవీ చీఫ్‌గా బాధ్యతలు అందుకోనున్నారు. త్రిపాఠి గతంలో వెస్ట్రన్ నేవల్ కమాండ్ కమాండర్ ఇన్ చీఫ్‌గా సేవలు అందించారు. ఎన్నో నేవీ ఆపరేషన్లలో కీలక పాత్ర పోషించారు. 1985 జూలై 1న నేవీలో చేరిన త్రిపాఠి 2019లో వైస్ అడ్మిరల్/వైస్ చీఫ్ హోదా అందుకున్నారు.

News April 19, 2024

వీళ్ల ఆస్తులు రూ.వందల్లోనే!

image

సాధారణంగా ఎంపీ అభ్యర్థి ఆస్తి రూ.లక్షలు లేక రూ.కోట్లలోనో ఉంటుంది. కానీ నేడు జరగనున్న లోక్‌సభ తొలి విడత ఎన్నికల అభ్యర్థుల్లో కొందరి ఆస్తి రూ.వందల్లో ఉంది. తమిళనాడులోని తూత్తుకుడి నుంచి పోటీకి దిగిన స్వతంత్ర అభ్యర్థి పోన్‌రాజ్ ఆస్తి రూ.320. చెన్నై నార్త్ స్వతంత్ర అభ్యర్థి సూర్యముత్తు, మహారాష్ట్రలోని రామ్‌తేక్ స్వతంత్ర అభ్యర్థి కార్తిక్ గెండ్లాజీ ఆస్తుల విలువ చెరో రూ.500గా ఉంది. <<-se>>#Elections2024<<>>

News April 19, 2024

LS PHASE-1: కోటీశ్వరులదే హవా

image

లోక్‌సభ తొలి విడత ఎన్నికల్లో భాగంగా నేడు 1625 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో 450 మంది అభ్యర్థులు కోటీశ్వరులే కావడం గమనార్హం. తమిళనాడు నుంచి అత్యధికంగా 202 మంది సంపన్న అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు క్రిమినల్ కేసులు ఉన్న 251 మంది అభ్యర్థుల్లో 28 మంది బీజేపీ, 19 మంది కాంగ్రెస్‌కు చెందిన వారు ఉన్నారు. DMK, AIADMK నుంచి చెరో 13 మందిపైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. <<-se>>#Elections2024<<>>

News April 19, 2024

ఆ రాష్ట్రాలకు నేడు డబుల్ ధమాకా!

image

అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో లోక్‌సభ తొలి విడత ఎన్నికలతో పాటు నేడు అసెంబ్లీ ఎన్నికలూ జరగనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో 60 అసెంబ్లీ స్థానాలు ఉండగా 10 చోట్ల BJP అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 50 సీట్లకు నేడు పోలింగ్ జరగనుంది. 133 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సిక్కింలో 32 స్థానాలకు పోలింగ్ జరగనుండగా, 146 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

News April 19, 2024

ఆ రాష్ట్రాల్లో అన్నీ స్థానాలకు నేడే పోలింగ్

image

లోక్‌సభ తొలి విడత ఎన్నికల్లో భాగంగా ఏడు రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో అన్నీ స్థానాలకు నేడే పోలింగ్ జరగనుంది. తమిళనాడు (39), ఉత్తరాఖండ్ (5), అరుణాచల్ ప్రదేశ్ (2), మేఘాలయా (2) సహా చెరొక స్థానాలు ఉన్న సిక్కిం, నాగాలాండ్, మిజోరంలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక యూటీలైన అండమాన్ & నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరీల భవితవ్యాన్ని కూడా ఓటర్లు నేడు తేల్చనున్నారు. <<-se>>#Elections2024<<>>

News April 19, 2024

రేవంత్ ఎవరి కోసం పనిచేస్తున్నారు?: కేటీఆర్

image

TG: రేవంత్ రెడ్డి CM అయ్యాక రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి కనబడుతోందని KTR అన్నారు. జూబ్లీహిల్స్‌లో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ‘లిక్కర్ స్కామ్‌లో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయటం అన్యాయమని రాహుల్ అంటాడు. రేవంత్ మాత్రం కవితమ్మ అరెస్ట్ కరెక్ట్ అంటాడు. రేవంత్ అసలు ఎవరి కోసం పనిచేస్తున్నాడు. మోదీ కోసమా? రాహుల్ కోసమా?. మైనార్టీలు కాంగ్రెస్‌కు వేసే ఒక్కో ఓటు అది BJPకే వెళ్తుంది’ అని వ్యాఖ్యానించారు.