News January 24, 2025

DSC నోటిఫికేషన్ ఎప్పుడంటే?

image

TG: రాష్ట్రంలో మరో DSC నోటిఫికేషన్ APR తర్వాతే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ ప్రకారం FEBలోనే నోటిఫికేషన్ రావాలి. కానీ SC వర్గీకరణ కోసం కమిషన్ వేసిన సర్కార్ నివేదిక కోసం ఎదురుచూస్తోంది. దీనికి సమయం పట్టే అవకాశం ఉండటంతో అప్పటివరకు DSC నోటిఫికేషన్ రాకపోవచ్చని తెలుస్తోంది. ఇక గతేడాది 11,062 పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం మరో 5వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్స్ ఉంది.

News January 24, 2025

కొత్తగూడెం, సాగర్‌లో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు స్థలాల పరిశీలన

image

TG: కొత్తగూడెం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిసరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అనువైన స్థలాలను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా బృందం పరిశీలించింది. కొత్తగూడెం సమీపంలోని గరీబ్‌పేట, రామవరం ప్రాంతాల్లో 950 ఎకరాలు, సాగర్ సమీపంలోని ఏపీ వైపు విజయపురి సౌత్ వద్ద 1600 ఎకరాల భూములను చెక్ చేసింది. ఆయా ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి, కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.

News January 24, 2025

పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రికి ‘వరం’

image

AP:2027లో జరిగే గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్రం రూ.271.43 కోట్లు కేటాయించింది. 2071-72 ఏడాదికి ఈ స్టేషన్ నుంచి గంటకు 9,533 మంది రాకపోకలు సాగిస్తారన్న అంచనాలతో స్టేషన్ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి కింద రూ.250 కోట్ల పనులు చేపట్టేలా టెండర్లను పిలవగా, పుష్కరాల ప్రతిపాదనలతో వాటిని రద్దు చేసి కొత్త నిధులను కేంద్రం ఇచ్చింది.

News January 24, 2025

త్వరలో RTCలో నియామకాలు: మంత్రి

image

TGSRTCలో త్వరలో 3038 మంది డ్రైవర్లు, కండక్టర్లతో పాటు కారుణ్య నియామకాలు చేపడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. 3500 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందినా గత ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదని, కొత్త బస్సులు కొనలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం 2000 కొత్త బస్సులు కొనుగోలు చేసిందని, మరో 600 బస్సులను డ్వాక్రా సంఘాలు కొంటాయని చెప్పారు. HYDలో పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడతామని తెలిపారు.

News January 24, 2025

ఫీజ్ రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదల

image

AP: మైనార్టీ విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల అయ్యాయి. రూ.40.22కోట్ల ట్యూషన్ ఫీజు ప్రభుత్వం విడుదల చేసినట్లు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ముస్లిం మైనార్టీ స్టూడెంట్స్‌కు రూ.37.88కోట్లు, క్రిస్టియన్ మైనార్టీలకు రూ.2.34కోట్లు మంజూరైనట్లు ఆయన తెలిపారు.

News January 24, 2025

Stock Markets: ఓపెనింగ్‌కు సానుకూల సంకేతాలు..

image

స్టాక్‌మార్కెట్లు పాజిటివ్‌గా మొదలవ్వొచ్చు. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుతున్నాయి. గిఫ్ట్‌నిఫ్టీ 45PTS మేర పెరగడం దీనినే సూచిస్తోంది. డాలర్‌ ఇండెక్స్, ట్రెజరీ బాండు యీల్డుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ఐటీ సహా మేజర్ కంపెనీల నుంచి మద్దతు లభిస్తే నిఫ్టీ 23,200 పైస్థాయిలో నిలదొక్కుకోవచ్చు. నేడు JSW Steel, HPCL, BOI, DLF, AUSFB, FED BANK, LAURUS LAB, SRIRAM FIN ఫలితాలు విడుదలవుతాయి.

News January 24, 2025

కత్తిపోట్ల వల్ల పట్టు తప్పాను: పోలీసులతో సైఫ్

image

తనపై కత్తిదాడి కేసులో యాక్టర్ సైఫ్ అలీఖాన్ పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చారు. ‘కరీనా, నేనూ 11వ ఫ్లోర్‌లో ఉన్నాం. సడన్‌గా అరుపులు వినిపించడంతో జే రూమ్‌కు వెళ్లాం. అతను ఏడుస్తున్నాడు. అక్కడెవరో ఉన్నట్టు గమనించి పట్టుకొనేందుకు ప్రయత్నించా. ఆగంతకుడి కత్తిపోట్ల వల్ల నా పట్టు తప్పింది. వెంటనే జేను వేరే గదిలోకి తీసుకొచ్చాం. ఆ తర్వాత ఇంట్లోవాళ్లు రూ.కోటి డిమాండ్ గురించి చెప్పారు’ అని ఆయన వివరించారు.

News January 24, 2025

నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త

image

TG: ప్రైవేటు ఉద్యోగ వేటలో ఉన్న నిరుద్యోగుల కోసం ప్రభుత్వం ‘డీట్’ యాప్ తెచ్చింది. AIతో పనిచేసే దీన్ని డౌన్‌లోడ్ చేసుకుని విద్యార్హత, స్కిల్స్ ఎంటర్ చేస్తే రెజ్యుమే తయారవుతుంది. పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్, వర్క్ ఫ్రం హోంతో పాటు ఇంటర్న్‌షిప్ ఆప్షన్స్ ఉంటాయి. ఐటీ, ఆటోమొబైల్స్, ఫార్మా, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్ తదితర కంపెనీలు ఇందులో రిజిస్టరై ఉండగా వాటికి కావాల్సినవారి రెజ్యుమేలను యాప్ రిఫర్ చేస్తుంది.

News January 24, 2025

రీ సర్వేపై సందేహాలా? ఈ నంబర్‌కు ఫోన్ చేయండి

image

APలో భూముల రీసర్వే పైలట్ ప్రాజెక్టు అమలవుతున్న నేపథ్యంలో రైతుల సందేహాల నివృత్తికై ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్‌ను ప్రారంభించింది. ఉ.10 నుంచి సా.5.30 వరకు 8143679222 నంబర్‌కు ఫోన్ చేసి సందేహాలు, సమస్యలు తెలియజేయవచ్చని సూచించింది. రీసర్వే సందర్భంగా యజమానులు భూమి వద్దకు వచ్చి హద్దులు చూపించేందుకు 3సార్లు అవకాశం ఉంటుందని, అయినా రాకపోతే వీడియో కాల్ ద్వారా హద్దులు ఖరారు చేస్తామని అధికారులు తెలిపారు.

News January 24, 2025

ముగిసిన TG CM రేవంత్ దావోస్ పర్యటన

image

దావోస్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ముగిసింది. అక్కడ జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ వార్షిక సదస్సు-2025లో పాల్గొన్న ఆయన ఈ ఉదయం 10.30 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా రేవంత్ బృందం దావోస్ పర్యటన సాగింది. ఈ సందర్భంగా సీఎంకు స్వాగతం పలికేందుకు కాంగ్రెస్ శ్రేణులు విమానాశ్రయానికి వెళ్లనున్నాయి.