News April 18, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 18, 2024

TODAY HEADLINES

image

➣కాంగ్రెస్ ఉంటే మొబైల్ బిల్లు నెలకు రూ.5వేలు వచ్చేది: PM
➣AP:జగనాసుర వధ జరిపి.. రామరాజ్యం స్థాపిస్తాం: CBN
➣వైసీపీ నేతలను తన్ని తరిమేయండి: పవన్
➣TG:వచ్చే ఇరవై ఏళ్లు రాహులే ప్రధాని: సీఎం రేవంత్
➣ఎన్నికలు పూర్తయ్యాక హామీలు నెరవేరుస్తాం: మంత్రి కోమటిరెడ్డి
➣ధ్వంసమైన ఆలయాలన్నీ పునర్నిర్మిస్తాం: కిషన్ రెడ్డి
➣నేను పార్టీ మారుతా అనే వారిని చెప్పుతో కొడతా: హరీశ్ రావు
➣IPL:గుజరాత్‌పై ఢిల్లీ విజయం

News April 18, 2024

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు: సచిన్ పైలట్

image

లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని BJP ఎక్కువ ఊహించుకుంటోందని రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ విమర్శించారు. బీజేపీ వాళ్లు చెప్పే మాటలకు వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉందని అన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈవీఎంల టాంపరింగ్ లేకుండా ఎన్నికలు సజావుగా జరిగితే బీజేపీకి 180 సీట్లు కూడా రావని అంతకుముందు ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.

News April 17, 2024

చరిత్ర సృష్టించిన ఢిల్లీ క్యాపిటల్స్

image

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ చరిత్ర సృష్టించింది. గుజరాత్‌తో మ్యాచ్‌లో 67 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. దీంతో 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో బంతుల పరంగా ఢిల్లీకి ఇదే అతి పెద్ద విజయం. అంతకుముందు 2022లో పంజాబ్ కింగ్స్‌పై 57 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. అలాగే ఈ సీజన్‌లో బంతులపరంగా అతి పెద్ద విజయంగా ఢిల్లీ రికార్డు నమోదు చేసింది.

News April 17, 2024

ఆజాద్ యూటర్న్.. లోక్‌సభ ఎన్నికలకు దూరం

image

తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని జమ్మూకశ్మీర్‌కు చెందిన డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ(DPAP) చీఫ్ గులాం నబీ ఆజాద్ వెల్లడించారు. ఆయన అనంతనాగ్- రాజౌరీ స్థానం నుంచి పోటీ చేస్తారని ఈ నెల 2న పార్టీ తెలిపింది. అయితే అనూహ్యంగా ఆజాద్ యూటర్న్ తీసుకుని పోటీ చేయడం లేదని తాజాగా ప్రకటించారు. ఇక్కడ మాజీ సీఎం, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత మియాన్ అల్తాఫ్ పోటీలో ఉన్నారు.

News April 17, 2024

వయనాడ్‌లో రేవంత్ ప్రచారం

image

TG: ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎంపీగా పోటీ చేస్తున్న వయనాడ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. అక్కడ జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం బహిరంగసభలో రేవంత్ ప్రసంగించారు. కాగా రాహుల్ బిజీగా ఉండటం వల్ల దేశంలోని ప్రముఖ కాంగ్రెస్ నేతలు వయనాడ్‌లో ప్రచారం చేస్తున్నారు. రాహుల్ తరఫున వారందరూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

News April 17, 2024

IPL: టీంల వారీగా అత్యల్ప స్కోర్లు

image

49- ఆర్సీబీ vs కేకేఆర్
58- రాజస్థాన్ vs ఆర్సీబీ
66- ఢిల్లీ vs ముంబై
67- కేకేఆర్ vs ముంబై
73- పంజాబ్ vs పుణె
79- చెన్నై vs ముంబై
82- లక్నో vs గుజరాత్ టైటాన్స్
87- ముంబై vs SRH
89- గుజరాత్ vs ఢిల్లీ*
96- SRH vs ముంబై

News April 17, 2024

సీఎం దిగజారి మాట్లాడుతున్నారు: పవన్

image

AP: ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే జగన్ తనను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. ‘జగన్ గారి సతీమణిని అనడానికి ఎంతసేపు పడుతుంది. పెళ్లాం అనే పదం మనం వాడుతామా? CM దిగజారి మాట్లాడుతున్నారు. సొంత చెల్లి జీవితాన్ని రోడ్డున పడేశాడు. పోలవరం, రాజధాని లేకుండా చేశారు. మహిళల అదృశ్యం, దళితులపై దాడులు, నీ నిరంకుశ పాలన చూస్తుంటే ప్రజలకు మండదా? జగన్’ అని నిలదీశారు.

News April 17, 2024

నీ పట్టుదలకు హ్యాట్సాఫ్

image

సంకల్ప బలం ఉంటే విజయాన్ని ఆపలేరు అనడానికి నిదర్శనం కేరళకు చెందిన సారిక. ఈమె పుట్టుకతోనే వైకల్యం బారిన పడ్డారు. కుడి చేయి పూర్తిగా పని చేయదు. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో రెండో ప్రయత్నంలో సివిల్స్ పరీక్షల్లో సారిక 922వ ర్యాంక్ సాధించి సత్తా చాటారు. తల్లిదండ్రులు తనకు మద్దతుగా నిలిచారని చెప్పారు. ఏదైనా సాధించాలని బలంగా కోరుకుంటే విశ్వం మొత్తం మనకు సహకరిస్తుంది అనడాన్ని విశ్వసిస్తానని చెప్పారు.

News April 17, 2024

గుజరాత్ టైటాన్స్ చెత్త రికార్డు

image

ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 89 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే గుజరాత్ తమ అత్యల్ప స్కోరు నమోదు చేసి అప్రతిష్ఠపాలైంది. ఇంతకుముందు గుజరాత్ అత్యల్పస్కోరు 125/6గా ఉంది. కాగా ఆ జట్టు 100 పరుగులలోపు ఆలౌట్ కావడం కూడా ఇదే తొలిసారి.